డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పలువురికి శిక్ష విధించిన కోర్టు,,,, బహదూర్ పురా ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ఎన్.కరుణా కుమార్ వెల్లడి 

 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పలువురికి శిక్ష విధించిన కోర్టు

బహదూర్ పురా ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ఎన్.కరుణా కుమార్ వెల్లడి

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పలువురికి కోర్టు శిక్ష విధించినట్లు బహదూర్ పురా ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ఎన్.కరుణా కుమార్ వెల్లడించారు. నాంపల్లి మనోరంజన్ కాంప్లెక్స్ లోని IX ఎంఎం కోర్టు న్యాయమూర్తి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఎనిమిది మందికి శిక్ష విధించినట్లు ఆయన తెలిపారు. ఈ డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో ఒకరికి 8 రోజుల శిక్షతోపాటు జరిమానా, నలుగురికి 4 రోజుల శిక్షతోపాటు జరిమానా ముగ్గురికి రెండు రోజుల శిక్షతోపాటు జరిమానా విధించినట్లు ఇన్ స్పెక్టర్ ఎన్.కరుణా కుమార్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, రోడ్డు ప్రమాదాలను నివారించాలని వాహనదార్లకు ఇన్ స్పెక్టర్ ఎన్.కరుణా కుమార్ సూచించారు.  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: