సోనియాగాంధీ ఆరోగ్యంగా ఉండాలి,,,, అయ్యప్ప స్వామి పడిపూజలో పులిపాటి రాజేష్ కుమార్ ప్రార్థన,,,, మహాలక్ష్మి గ్యారంటీ అమలుపై సంబరాలు,,,,, మిఠాయిలు పంచిన

 సోనియాగాంధీ ఆరోగ్యంగా ఉండాలి

అయ్యప్ప స్వామి పడిపూజలో పులిపాటి రాజేష్ కుమార్ ప్రార్థన

మహాలక్ష్మి గ్యారంటీ అమలుపై సంబరాలు

మిఠాయిలు పంచిన పులిపాటి రాజేష్ కుమార్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆమె ఆరోెగ్యంగా ఉండాలని బహదూర్పురా నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి పులిపాటి రాజేష్ కుమార్ ( రాహుల్ ) ఆకాంక్షించారు. శనివారంనాడు హైదరాబాద్ పాతబస్తీలోని బహదూర్పురా నియోజకవర్గం లోని కిషన్ బాగ్ డివిజన్ నందిముస్లయిగూడ ప్రాంతంలో అన్నం కృష్ణ శ్రీకాంత్, డప్పు వినోద్ స్వాములు వారు నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజలో  బహదూర్పురా నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి పులిపాటి రాజేష్ కుమార్ ( రాహుల్ ) పాల్గొన్నారు.


ఈ సందర్భంగా అయ్యప్పస్వామికి పులిపాటి రాజేష్ కుమార్ పూజలు చేశారు. ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న సోనియా గాంధీ ఆరోగ్యంగా ఉండాలని, తెలంగాణ ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉండాలని స్వామి వారిని పులిపాటి రాజేష్ కుమార్ కోరారు. 

మహాలక్ష్మి గ్యారంటీ అమలుపై మిఠాయిలు పంచి సంబరాలు

ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలోని మహాలక్ష్మి గ్యారంటీని కాంగ్రెస్ సర్కార్ అమలు చేసి మహిళలకు ఆర్టీసీ బస్సులల్లో ఉచిత ప్రయాణం అమలు చేసిన సందర్భంగా బహదూర్పురా నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి  పులిపాటి రాజేష్ కుమార్ ( రాహుల్ ) ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచి ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారుు. ఈ సందర్భంగా పాల్గొన్న స్థానిక మహిళలు కూడా హర్షం వ్యక్తంచేశారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: