ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జీ హెచ్ యం సీ చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్ టీ. వెంకన్న

(జానో జాగో వెబ్ న్యూస్- హైద్రాబాద్ ప్రతినిధి)

రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ సందర్బంగా చార్మినార్ శాసనసభ నియోజకవర్గం-66 పరిధిలోని 202 పోలింగ్ కేంద్రాలలో అసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని  నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జీ హెచ్ యం సీ చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్ టీ. వెంకన్న తెలిపారు .బుధవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోని  కమల నెహ్రూ పాలిటెక్నిక్ మహిళా కళాశాలలోని  డి ఆర్ సి కేంద్రంలో  పోలింగ్ ఏర్పాట్లు వివరాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకన్న వివరించారు. చార్మినార్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 226117 మంది ఓటర్లు ఉండగా....  ఇందులో పురుషులు-118272. మహిళలు-107815. థర్డ్ జెండర్ -30 మంది ఉన్నారు.


91 భవనాల్లో 202 పోలింగ్ కేంద్రాలు ఉండగా...133 సమస్యత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. అన్ని పోలి కేంద్రాలలో ప్రత్యేక సిసి కెమెరాలు ఏర్పాటు చేసి గట్టి నిఘాతో భద్రత చర్యలు చేపట్టామన్నారు.  డి ఆర్ సి కేంద్రం నుంచి అన్ని పోలింగ్ కేంద్రాలకు ఈ వి ఎం లు, ప్రెసిడింగ్ ఆఫీసర్లు లు అసిస్టెంట్ ప్రొసీడింగ్ ఆఫీసర్ల ల తో పాటు మైక్రో అబ్జర్వర్లను నియమించి మొత్తం 1,050 మంది పోలింగ్ సిబ్బందిని కేంద్రాలకు తరలించమన్నారు. ఇప్పటికే నియోజకవర్గ ఓటర్లు అందరికీ  సిబ్బందితో ఓటర్ స్లిప్పులను పంపిణీ చేశామన్నారు.

ప్రజలందరూ తమ ఓటు  హక్కును బాధ్యత గా వినియోగించుకోవాలన్నారు. పోలింగ్ శాతం పెంచేందు ఇప్పటికే  అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఓటర్ల ను చైతన్య  పరిచామన్నారు.  100% శాతం  పోలింగ్ నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలింగ్ నేపథ్యంలో ఎలాంటి  శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా  నోడల్ అధికారి  పర్యవేక్షణ లో పటిష్టమైన భద్రత చర్యలు   చేపట్టమన్నారు. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లో  సి- విజిల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఎన్నికలకు సంబంధించి ఏవైనా అక్రమాలు, సమస్యలు తలెత్తితే  అందులో ఫిర్యాదు చేయాలని సూచించారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: