ఎంఐఎంకు హటావో....కాంగ్రెస్ కో లావో అని ప్రజలంటున్నారు

భారత్ జాడో యాత్రతో మైనార్టీలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు

ప్రచారంలో అడుగడుగున ప్రజాద్దరణ

పాతబస్తీలో జీరో పురోగతి

మేం వస్తే జీరో నుంచి ఉన్నత  ప్రగతి సాధిస్తాం

నియోజకవర్గ రూపురేఖలు మార్చేస్తా

బహదూర్ పురా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పులిపాటి రాజేష్ కుమార్


ఈ ఎన్నికల్లో బహదూర్ పురా నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం...పతాంగ్ దిగడం తథ్యమని ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులిపాటి రాజేష్ కుమార్ స్పష్టంచేశారు. తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో యావత్తుదేశంలో పరిస్థితులు కాంగ్రెస్ కు అనుకూలంగా మారాయని, ఈ ప్రభావం తమ నియోజకవర్గం బహదూర్ పురాలోనూ కనిపిస్తోందని ఆయన వెల్లడించారు. నియోజకవర్గంలో సుమారు 70శాతానికి పైగా ముస్లిం మైనార్టీలు ఉన్నారని, వారంతా కాంగ్రెస్ పైనే నమ్మకం ప్రదర్శిస్తున్నారని ఆయన వెల్లడించారు. అందుకే ఈ సారి బహదూర్ పురా నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఆయన స్పష్టంచేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి వస్తున్న స్పందన తమకు విజయంపై విశ్వాసం రోజురోజుకు రెట్టింపు అవుతోందన్నారు.


సోమవారంనాడు బహదూర్ పురా నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి పులిపాటి రాజేష్ కుమార్ నియోజకవర్గం లోని అలియాబాద్ డివిజన్ లోని రాజన్నబావి ప్రాంతం లో ఎన్నికల ప్రచారం విస్తృతంగా చేశారు, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటిలతోపాటు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి ప్రజలకు ఆయన వివరించారు. ఈ ప్రచారంలో పులిపాటి రాజేష్ కుమార్ తోపాటు శ్యామ్ రావు ముదిరాజ్, టీ.చందు, సంతోష్, సూరిశెట్టి సుమన్, జ్యోతి, అంబికా, తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.   ఎన్నికల సందర్బంగా నియోజకవర్గంలోని పలు డివిజన్లలో సుడిగాలి పర్యటన చేస్తున్న బహదూర్ పురా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పులిపాటి రాజేష్ కుమార్ మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. నియోజకవర్గంలో ప్రజల నుంచి కాంగ్రెస్ కు వస్తున్న స్పందనను ఆయన తెలియజేశారు. 

ప్ర: ఎన్నికల సందర్భంగా మీకు వస్తున్న ప్రజా స్పందన ఎలావుంది....?

జ) బ్రహ్మాండంగా వస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి నియోజకవర్గంలోని మైనార్టీలంతా కాంగ్రెస్ వైపే విశ్వాసం ప్రకటిస్తున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో మైనార్టీలకు కాంగ్రెపై ఎనలేని నమ్మకం పెరిగింది. ఈ స్పందన చూస్తుంటే ఈ సారి బహదూర్ పురా నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని స్పష్టమవుతోంది. కాంగ్రెస్ గెలుపును ఏ పార్టీ ఆపలేదు. 


ప్ర: మీకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు అని మీరు భావిస్తున్నారు...?

జ) మాకు ప్రధాన ప్రత్యర్థి ఎంఐఎం మాత్రమే. ఇతర పార్టీలు అసలు మాకు పోటీలోనే లేవు. ఈ సారి నియోజకవర్గ ప్రజలు ఎంఐఎం పై కంటే కాంగ్రెస్ పైనే విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. కారణం పాతబస్తీ లో ఎంఐఎం పాలనతో ప్రజలు విసిగిపోయారు. ఇక్కడ అభివృద్ధి అన్నది జీరో. అందుకే ప్రజలు మమ్మత్ని కోరుకొంటున్నారు. కాంగ్రెస్ గెలిస్తే జీరో స్థాయి నుంచి ఉన్నత అభివృద్ధి వైపునకు నియోజకవర్గాన్ని తీసుకెళ్తా. ప్రజలు కూడా నాపై ఆ నమ్మకమే పెట్టుకొన్నారు. 


ప్ర:మీరు గెలిస్తే నియోజకవర్గంలో ఏ సమస్యకు తొలి ప్రాధాన్యత ఇస్తారు...?

జ)నేను గెలిస్తే నియోజకవర్గంలోని అన్ని సమస్యలకు ప్రాధాన్యత ఇస్తా. ఎందుకంటే నియోజకవర్గంలో అన్నీ సమస్యలే. నేటికీ ఎంఐఎం ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. నేను గెలిస్తే ఏ ఒక్క సమస్యను విస్మరించకుండా చిట్టచివరి సమస్య పరిష్కారినికి శ్రద్దపెడతా. ఎందుకంటే ప్రజలు నాపై అలాంటి నమ్మకంతో ఎదురుచూస్తున్నారు. నీరు, రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వంటి చిన్న చిన్న సమస్యలతో ప్రజలు నిత్యం సతమతమవుతున్నారు. 


ప్ర:మీ ప్రచారంలో ఎలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు...?

జ)మా పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు సర్వరోగ నివారణి లాంటిది. ఇక మైనార్టీల కోసం ప్రత్యేక డిక్లరేషన్ నా విజయానికి బూస్ట్ నిస్తోంది. ఆరు గ్యారెంటీలు, ప్రత్యేక డిక్లరేషన్ చూసే మైనార్టీలు నన్ను బ్రహ్మరథంపడుతున్నారు. ఇక ఎస్పీనగర్ కిషన్ బాగ్ ప్రాంతంలో దళిత సోదరులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. వారి సమస్యల పరిష్కారాన్ని కూడా ఛాలేంజ్ గా స్వీకరిస్తా.   

ప్ర:  గత ప్రత్యర్థియే మీకు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థిగా ఉండటం ఎలా అనిపిస్తోంది...?

జ)అవును నిజమే..గతంలో రమ్నేష్ పురా కార్పోరేటర్ ఎన్నికల్లో ప్రస్తుత ఎంఐఎం ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ ముబీన్ ప్రత్యర్థిగా ఉన్నారు. ఆయనే ఇపుడు అసెంబ్లీ ఎన్నికల్లో నాకు ప్రధాన ప్రత్యర్థిగావున్నారు.  పాత ప్రత్యర్థితో తాజాగా కూడా పోటీపడటం ఆనందంగా ఉంది. గెలిచే అవకాశమున్న ఈ సారి ఆయనే నాకు ప్రత్యర్థిగా ఉండటం మరింత ఆనందంగా ఉంది. ఏది ఏమైనా తనకు నియోజకవర్గ అభివృద్ధియే కీలకం. వాటిపైనే నా ఫోకస్..ప్రత్యర్థి అభ్యర్థి ఎవరు అన్నది తరువాత అంశమే.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: