సకాలంలో స్పందించి విద్యార్థి ప్రాణాలు కాపాడిన,,, కాలాపత్తర్ పోలీస్ సిబ్బంది,,,,, ఫిర్యాదు అందిన 40 నిమిషాల్లో ప్రాణాలతో చిన్నారి తల్లిదండ్రులకు అప్

 సకాలంలో స్పందించి విద్యార్థి ప్రాణాలు కాపాడిన,,,

కాలాపత్తర్ పోలీస్ సిబ్బంది

ఫిర్యాదు అందిన 40 నిమిషాల్లో ప్రాణాలతో చిన్నారి తల్లిదండ్రులకు అప్పగింత

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

హైదరాబాద్ నగరం పాతబస్తీలోని కాలాపత్తర్ ఇందిరానగర్ కు చెందిన షిరీన్ అనే మహిళ తన ఐదు సంవత్సరాల అబ్బాయి నాహేద్ రమ్నస్త్ పురా కాలికమాన్ ప్రైమరీ స్కూలు చదవుతున్నాడు. ఆ విద్యార్ధి నాహేద్  కనిపించకపోవడంతో ఆ చిన్నారి తల్లి రోదిస్తూ వచ్చి కాలాపత్తర్ ఇన్ స్పెక్టర్ దాలీ నాయుడుకు ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే స్పందించిన సీఐ దాలీ నాయుడు హుటాహుటీన తన సిబ్బందితో గాలింపు చర్యలకు చేపట్టారు. అబ్బాయి కోసం వీధి వీధిన గాలించడమే కాకుండా పెద్ద పెద్ద నాలాలు, అఖరికి నీళ్ల ట్యాంకులలో గాలింపు చేశారు. ఇలా గాలిస్తుండగా ఆ విద్యార్థి చదివే స్కూల్ సమీపంలోని గుర్రపు తబేలాలొ లొపట ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.


ఆ తబేలా గేటు గడియ పడడంతొ విద్యార్థి లోపటే ఏడుస్తు ఉండిపోయాడు. ఇది గమనించిన పోలీసు సిబ్బంది ఆ విద్యార్థి గుర్తించి కాపాడారు. మహిళా ఫిర్యాదు అందిన కేవలం 40 నిమిషాలలో ఆ విద్యార్థి ఆచూకిని కాలాపత్తర్ పోలీస్ సిబ్బంది గుర్తించి కాపాడగలిగారు. చివరకు ఆ చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై చిన్న గల్లి, గల్లీ సైతం గాలించడంవల్లే కేవలం నలభై నిమిషాల్లో ఆ విద్యార్థిని కాపాడటం జరిగిందని పలువురు కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ సీఐ దాలీ నాయుడుతో పాటు ఈ గాలింపు చర్యల్లో పాల్గొన్న పోలీసు సిబ్బందిని పలువురు ప్రశంసించారు. ఈ గాలింపు చర్యల్లో సబ్ ఇన్ స్పెక్టర్లు సఫీ, శ్రీనివాస్, మౌనిక , పిసి సంతోష్, హెచ్‌సి మల్లారెడ్డి తదితర్లు పాల్గొన్నారు. 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: