డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ పరీక్షలకు ఈ నెల 18 లోపు ఫీజు చెల్లించాలి

 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ పరీక్షలకు

ఈ నెల 18 లోపు ఫీజు చెల్లించాలి

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

బ్యాక్ లాగ్ విద్యార్థుల కోసం డాక్టర్ బీఆర్అం బేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ డిగ్రీ పరీక్షా ఫీజును ఆన్లైన్ చెల్లించేందుకు ఈ నెల 18న తుది గడువుగా పెట్టింది. ఈ విషయాన్ని బేగంపేటలోని మహిళా డిగ్రీ కళాశాలలోని అం బేద్కర్ వర్శిటీ సెంటర్ కో-ఆర్డినేటర్ మారోజు రామాచారి ఒక ప్రకటనలో తెలియజేశారు. 2016, అం తకముందు బ్యాచ్లకు చెందిన బీఏ, బీకామ్, బీఎస్సీ బ్యాగ్గ్ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థు లకు డిసెంబర్ 9 నుంచి 12 వరకు, ద్వితీయ సంవ త్సరం విద్యార్ధులకు డిసెంబర్ 9 నుంచి 14 వరకు, తృతీయ సంవత్సరం విద్యార్థులకు డిసెంబర్ 16 నుం చి 21 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: