నవంబర్ 2023

 ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జీ హెచ్ యం సీ చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్ టీ. వెంకన్న

(జానో జాగో వెబ్ న్యూస్- హైద్రాబాద్ ప్రతినిధి)

రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ సందర్బంగా చార్మినార్ శాసనసభ నియోజకవర్గం-66 పరిధిలోని 202 పోలింగ్ కేంద్రాలలో అసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని  నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జీ హెచ్ యం సీ చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్ టీ. వెంకన్న తెలిపారు .బుధవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోని  కమల నెహ్రూ పాలిటెక్నిక్ మహిళా కళాశాలలోని  డి ఆర్ సి కేంద్రంలో  పోలింగ్ ఏర్పాట్లు వివరాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకన్న వివరించారు. చార్మినార్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 226117 మంది ఓటర్లు ఉండగా....  ఇందులో పురుషులు-118272. మహిళలు-107815. థర్డ్ జెండర్ -30 మంది ఉన్నారు.


91 భవనాల్లో 202 పోలింగ్ కేంద్రాలు ఉండగా...133 సమస్యత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. అన్ని పోలి కేంద్రాలలో ప్రత్యేక సిసి కెమెరాలు ఏర్పాటు చేసి గట్టి నిఘాతో భద్రత చర్యలు చేపట్టామన్నారు.  డి ఆర్ సి కేంద్రం నుంచి అన్ని పోలింగ్ కేంద్రాలకు ఈ వి ఎం లు, ప్రెసిడింగ్ ఆఫీసర్లు లు అసిస్టెంట్ ప్రొసీడింగ్ ఆఫీసర్ల ల తో పాటు మైక్రో అబ్జర్వర్లను నియమించి మొత్తం 1,050 మంది పోలింగ్ సిబ్బందిని కేంద్రాలకు తరలించమన్నారు. ఇప్పటికే నియోజకవర్గ ఓటర్లు అందరికీ  సిబ్బందితో ఓటర్ స్లిప్పులను పంపిణీ చేశామన్నారు.

ప్రజలందరూ తమ ఓటు  హక్కును బాధ్యత గా వినియోగించుకోవాలన్నారు. పోలింగ్ శాతం పెంచేందు ఇప్పటికే  అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఓటర్ల ను చైతన్య  పరిచామన్నారు.  100% శాతం  పోలింగ్ నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలింగ్ నేపథ్యంలో ఎలాంటి  శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా  నోడల్ అధికారి  పర్యవేక్షణ లో పటిష్టమైన భద్రత చర్యలు   చేపట్టమన్నారు. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లో  సి- విజిల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఎన్నికలకు సంబంధించి ఏవైనా అక్రమాలు, సమస్యలు తలెత్తితే  అందులో ఫిర్యాదు చేయాలని సూచించారు.


పచ్చజెండా జాగాలో హస్తం జెండా రెపరెపలు

బహదూర్ పురాలో కాంగ్రెస్ అభ్యర్థి పులిపాటి రాజేష్ కుమార్ బైక్ ర్యాలీ

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

పాతబస్తీ అంటే పచ్చ జెండా...ఎంఐఎం అంటే పాతబస్తీ అన్నట్లుగా ఎవరైనా చెబుతున్నారు. గతానికి భిన్నంగా ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎంకు ధీటుగా ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్లింది. నిత్యంజనంలో ఉంటూ బహదూర్ పురాలో కాంగ్రెస్ అభ్యర్థి పులిపాటి రాజేష్ కుమార్ బైక్ ర్యాలీ విస్త్రుత ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ కు ఓటేయాలని కోరారు. జనంతో మమేకమై వారి సమస్యలను తెలుసుకొన్నారు. ఇదిలావుంటే మంగళవారంనాడు బహదూర్ పురాలో కాంగ్రెస్ అభ్యర్థి పులిపాటి రాజేష్ కుమార్ బైక్ ర్యాలీనిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని నినాదాలతో బైక్ ర్యాలీలో హోరెత్తించారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పాతబస్తీలో మార్పు వస్తుందని వారు పేర్కొన్నారు. పోలింగ్ రోజు ప్రజలు పెద్దఎత్తున్న వచ్చి కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని వారు కోరారు.
 మహేశ్వరంలో వార్ వన్ సైడే

ప్రచారంలోనూ..ఆదరణలోనూ సబితా రెడ్డిదే పై చేయి

చేసిన అభివృద్ధి శ్రీరామ రక్ష

గెలుపుపై ధీమాతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ప్రత్యర్థుల అంచనాలకు దొరకకుండా జనంలోకి

తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య వార్ హోరాహోరీగా సాగినా మహేశ్వరంలలో మాత్రం వార్ వన్ సైడ్ గానే కనిపిస్తోంది. నియోజకర్గంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సాధించిన పట్టుయే ఇందుకు కారణం. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గంగా మహేశ్వరం చెప్పవచ్చును.  గ్రామీణ,పట్టణ ఓటర్ల కలయికతో,రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలతో మినీ ఇండియాను తలపిస్తుంది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుమారు 52 కంపెనీలు రాగా,లక్ష ఉద్యోగాలు లభించే ఫ్యాక్స్ కాన్ కూడా ఈ ప్రాంతంలో రానుండటంతో మరో సైబరాబాద్,మరో గచ్చిబౌలిగా ఈ ప్రాంతం మారబోతుంది.భవిష్యత్తు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సబితా రెడ్డి కోరిక మేరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి తుక్కుగూడ మీదుగా కందుకూరు వరకు 6600 కోట్లతో మెట్రో ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే వాగ్దానం చేసారు. 


అభివృద్దికి చిరునామాగా మారిన సబితా ఇంద్రారెడ్డి

అభివృద్ది అంటే గుర్తొచ్చే నేతగా మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరుతెచ్చుకొన్నారు. వాటికి అనుగుణంగానే మహేశ్వరం నియోజకవర్గ ములో 176 కోట్లతో 450 పడకల ఆస్పత్రితో మెడికల్ కళాశాల మంజూరు కాగా మంత్రులు హరీష్ రావు,సబితా ఇంద్రారెడ్డి లు శంకుస్థాపన సైతం చేసారు. ఇవే కాకుండా పెద్ద ఎత్తున విద్యాలయాలు, రోడ్లు,నాళాల అభివృద్ధి, అర్బన్ ఫారెస్ట్ పార్కులు,చెరువుల సుందరికరణ,లాంటి కార్యక్రమాలతో పాటు సుమారు 3 వేల కోట్లతో ఎమ్మెల్యేగా సబితా ఇంద్రారెడ్డి అభివృద్ధి చేసారు.మహేశ్వరం నియోజకవర్గములో రైతు బంధు పథకం ద్వారా ఇప్పటివరకు 389 కోట్లు,రైతు భీమా ద్వారా 24 కోట్లు,రుణమాఫీ క్రింద 87 కోట్లు ,ఆసరా పెన్షన్లు 576 కోట్లు,కళ్యాణాలక్ష్మి కింద 108 కోట్లు,షాది ముబారక్ పథకంతో 51 కోట్లు,ముఖ్యమంత్రి సహాయనిది తో 15 కోట్ల ప్రభుత్వ సహయం అందింది.


నియోజకవర్గములోని పట్టణ ప్రాంతాల్లో 16 కోట్లతో సమీకృత మార్కెట్ సముదాయాల నిర్మాణం,8 కోట్లతో మోడ్రెన్ దోబీ ఘాట్ లు, గొర్రెల పంపిణీకి 42 కోట్లు,చేపల పంపిణీకి 5 కోట్లు,ప్రభుత్వ ఆస్పత్రులో ప్రసవం పొందిన 2029 మంది మహిళలకు కేసీఆర్ కిట్లు,నియోజకవర్గములో 84 కుల సంఘాలకు స్థలాలు కేటాయించి ఆత్మగౌరవ భవనాలకు నిధులు కేటాయించి పనులకు శంకుస్థాపనలు చేసారు.మహేశ్వరం నియోజకవర్గములోని బడంగ్ పేట్,మీర్ పేట్,తుక్కుగూడ,జల్ పల్లి జంట కార్పొరేషన్లు,జంట మునిసిపాలిటీలలో  832 కోట్ల రూపాయల భారీ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. కార్పొరేషన్ పరిధిలో ట్రoక్ లైన్లు,నాళాల నిర్మాణాలతో వరదనీటి ముంపు సమస్యలకు పరిష్కారం చూపటం జరిగింది.


నాలాల అభివృద్ధికి 110 కోట్లతో   మహేశ్వరం నియోజకవర్గంలో పనులు జరుగుతున్నాయి.తాగునీటి సమస్య లేకుండా చేయటానికి 280 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా పనులు చేపడుతున్నట్లు నూతన పైప్ లైన్లు,ట్యాంకులు, రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతుంది.నియోజకవర్గంలో బడంగ్ పేట్,మీర్ పేట్,జల్ పల్లి,తుక్కుగూడ ల పరిధిలోని 11 చెరువులలో 40 కోట్ల రూపాయలతో అభివృద్ధి, సుందరికరణ పనులు చేపట్టడం జరిగింది.మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఫ్లై ఓవర్,నియోజకవర్గానికి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తాము అని సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.


నియోజకవర్గములో 176 కోట్ల రూపాయల భారీ నిధులతో మెడికల్ కళాశాలకు కూడా శంకుస్థాపన చేయగా వచ్చే విద్యా సంవత్సరం నుండి అందుబాటులోకి వస్తుంది.1200 కోట్లతో కొత్తపేటలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి,10 కోట్లతో జల్ పల్లిలో 30 పడకల ఆస్పత్రి,6 కోట్లతో మహేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను 50 పడకలుగా అప్ గ్రేడ్ చేయటం జరిగింది .అదేవిధంగా 13 బస్తీ దవాఖానలు,8 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లు,16 పల్లె దవాఖానలు ఏర్పాటు చేసారు. మహేశ్వరం నియోజకవర్గములో 280 కోట్ల భారీ నిధులతో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాము.40 కోట్లతో అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేశాము. పురాతన దేవాలయాల అభివృద్ధికి 10 కోట్లు,450 కోట్లతో రోడ్ల అభివృద్ధి, పంచాయతి రాజ్ శాఖ ద్వారా 284 కోట్లు,దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్  మహేశ్వరం పర్యటనలో160 కోట్ల నిధుల వరాల జల్లు కురిపించగా  పనులు జరుగుతున్నాయి. 


జనమే ప్రాణంగా....ఎదిగిన నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి

జన కోసమే జనమే ప్రాణంగా ఎదిగిన నాయకురాలు  మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్న భావన మహేశ్వరం నియోజకవర్గంలోని ప్రజల్లో ఉంది. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ నియోజకవర్గములో సబితా ఇంద్రారెడ్డి తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.ఒక్క రోజులో 18 గంటల వరకు కూడా నియోజకవర్గ పర్యటనలు చేస్తూ అభివృద్ధికి కృషి చేస్తుండటంతో ప్రజలందరి చేత మన్ననలు పొందుతున్నారు.తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా భూదేవి అంతా ఓపిక,ఓర్పు,సహనంతో సబితా రెడ్డి పనిచేస్తారని సాక్ష్యత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించటం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.తన నియోజకవర్గములోని ముంపు ప్రాంతాల సమస్యలపై పేపర్ల క్లిప్పింగ్స్, వీడియోలు,తాను మోకాల్లోతు నీళ్లలో తిరిగిన విధానం చూసి జంట నగరాల్లో, శివారు మునిసిపాలిటీ లలో వేయి కోట్లతో నాలాల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు అవి నేడు సత్పలితాలు ఇస్తున్నాయన్నారు.అది సబితా రెడ్డి పుణ్యమే అంటూ ప్రకటించటంపై కాలనీల వాసుల నుండి హర్షధ్వానాలు వ్యక్తం అవుతున్నాయి.


నియోజకవర్గముపై ఇంత మనసు పెట్టి పనిచేసే ఎమ్మెల్యే దొరకటం మహేశ్వరం నియోజకవర్గ ప్రజల అదృష్టం అని పేర్కొనటంతో నియోజకవర్గములో సబితా రెడ్డి గ్రాఫ్ బాగా పెరిగిందని చెప్పవచ్చును.విద్యా శాఖ మంత్రిగా బిజీగా ఉన్న రోజుకు ఒకేసారి అయిన నియోజకవర్గ పర్యటన చేస్తారని ప్రజలే చర్చించుకుంటున్నారు.కరోన సమయంలో అయితే నియోజకవర్గముతో పాటు రంగారెడ్డి,వికారాబాద్ జిల్లాల్లో పర్యటించి ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేసారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కనిపించని వాళ్ళు నేడు ఓట్ల కోసం వస్తున్నారని ఆమె తన ప్రత్యర్థులపై విమర్శలు చేస్తున్నారు.

ఉద్దండులతో పోటీ అయిన వార్ వన్ సైడే

గతానికి భిన్నంగా మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఉద్దండ నేతను బరిలోకి దించింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డియే టార్గెట్ గా కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని కాంగ్రెస్ బరిలోకి దించింది. దీంతో మహేశ్వరంలో రసోత్తరమైన పోటీ అని తొలుత భావించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేపట్టిన ప్రచారంతో నియోజకవర్గంలో ఆమె ప్రభంజనం ఖాయమన్న విశ్లేషణలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే మహేశ్వరం నియోజకవర్గములో ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఒక రియల్ లీడర్ తో పోటీ చేస్తున్నారని ఎన్నికల ప్రచారంలో భాగంగా సబితా ఇంద్రారెడ్డి పేర్కొంటున్నారు.


తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని తెల్లవారు జామున లేచినప్పటి నుండి రాత్రి వరకు ప్రజాసేవలోనే ఉంటానని అంటున్నారు. కాంగ్రెస్,బీజేపీ అభ్యర్థులు ఇప్పటికే తనపై పోటీ చేసి ఓడిపోయారని అప్పటి నుండి ప్రజలకు కనిపించకుండా పోయి ఎన్నికలు రాగానే నేడు సేవ అంటూ ముందుకువస్తున్నారని  ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని తప్పకుండా తనను ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉందని ఆమె ధీమాతో ఉన్నారు.రాష్ట్రంలో మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని,సబితా రెడ్డి మల్లీ గెలిచి మంత్రి అవుతారని బిఆర్ఎస్ నేతలు,అభిమానులు పేర్కొంటున్నారు. ఇతర పార్టీల వారు గెలిస్తే ఎమ్మెల్యేకె పరిమితం అవుతారని నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడుంటుందని,అభివృద్ధి కొనసాగలంటే సబిత రెడ్డి రావాలని బిఆర్ఎస్ శ్రేణులతో పాటు ప్రజలు సైతం పేర్కొంటున్నారు.

రాష్ట్రంలో బలమైన ఏకైక మహిళా నేతగా ఎదిగిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి మహిళ హోమ్ మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ ప్రభుత్వంలోను మొదటి మహిళ మంత్రిగా పనిచేస్తున్నారు.రంగారెడ్డి,వికారాబాద్ జిల్లాల్లో ప్రస్తుత ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుండి పోటీ చేస్తున్న ఏకైక మహిళగా సబితా రెడ్డి నిలిచారు.మహేశ్వరం నియోజకవర్గములో కూడా ఆమె అభ్యర్థిత్వానికి మహిళలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. ఒక మహిళతో ఎంతో మంది నేతలు పోటీ పడుతున్నారని పార్టీలకతీతంగా మహిళల మద్దతు సబితా రెడ్డికే ఉంటుందని బిఆర్ఎస్ మహిళ సంఘ నేతలతో పాటు,వివిధ మహిళ సంఘాలు బహిరంగంగా మద్దతు ఇస్తున్నాయి.ఇలా ఏ కోణంలో చూసిన మహేశ్వరం నియోజకవర్గములో సబితా ఇంద్రారెడ్డి ముందంజలో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిఘా సంస్థలు,వివిధ సర్వేలలో కూడా ఇదే స్పష్టం అవుతోంది.కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి మద్దతుగా

మీర్పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లో ఆయన సతీమణి ప్రచారం

పెద్ద ఎత్తున్న హాజరైన కాంగ్రెస్ నేతలు

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మహేశ్వరంలో కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నాగారి లక్ష్మారెడ్డి కి మద్దతుగా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున్న ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారంనాడు మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని  28 వా వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి విస్త్రుతంగా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో  ఏపీసిసి అధ్యక్షుడు రుద్రరాజు, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు పప్పు శ్యామ్ కుమార్, మీర్పేట్  అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, కార్పొరేటర్ మాధవి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఆరు గ్యారెంటీల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...


తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగుతోందని, మహేశ్వరం నియోజకవర్గంలోనూ  ఈ సారి కాంగ్రెస్ విజయం ఖాయమని వెల్లడించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు  తమది గ్యారెంటీ అని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ప్రచారంలో జోరుమీదున్న కారు

ప్రతి గడపగడపకు వెళ్లి ఓటు అభ్యర్థిస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి సల్లాహుద్దీన్ లోధి

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

ఎన్నికల సమయం దగ్గర పడుతున్నవేళ చార్మినార్ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి మహమ్మద్ సల్లాహుద్దీన్ లోధ ప్రచారంలో స్పీడు పెంచారు. ఈ సారి ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగుతుందన్నారు. చార్మినార్ లో కూడా తన విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తంచేశఆరు. 


సోమవారంనాడు చార్మినార్ నియోజకవర్గ పరిధిలో మొఘల్ పురా డివిజన్ లో సుభాస్ చంద్రబోస్ విగ్రహం, అశోకే జెండా, గంగపుత్ర సంఘం, హనుమాన్ టెంపుల్, ఇంద్రానగర్, సుల్తాన్ సాహీ తదితర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారాన్ని మహమ్మద్ సల్లాహుద్దీన్ లోధి నిర్వహించారు. బీఆర్ఎస్ గెలుపుతోనే నియోజకవర్గానికి మహర్ధశ అని ఆయన వెల్లడించారు. ప్రజా ఉపయోగ పథకాలు రావాలంటే బీఆర్ఎస్ గెలిచి తీరాలని ఆయన కోరారు. చార్మినార్ లో తనను గెలిపిస్తే నియోజకవర్గం కోసం ప్రత్యేక కార్యచరణతో పనిచేస్తానని ఆయన వెల్లడించారు.


కాంగ్రెస్ ది అభయ హస్తం

 ఆరు గ్యారెంటీలతో సామాన్యుడి జీవతం ఉజ్వలం

గడపగడపకు ప్రచారం చేపట్టిన బోయా నగేష్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

చంద్రయాణగుట్టా అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోయా నగేష్ విస్త్రుత ప్రచారం నిర్వహిస్తున్నారు.  నియోజకవర్గ పరిధిలో ఆయన విస్త్రుతంగా పర్యటించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను వివరించారు. సోమవారంనాడు కాంగ్రెస్ అభ్యర్థి బోయా నగేష్ జంగం మెట్ డివిజన్. శివ గంగానగర్. లక్ష్మీ నగర్. రాజన్న బావి. సాయిబాబా దేవాలయం. సంతోషిమాత టెంపుల్. పరిసర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమానికి. సీనియర్ కాంగ్రెస్ నాయకులు. శ్యామ్ ముదిరాజ్, అనిల్ కుమార్, బాలరాజు. ద్వారక. శివకుమార్ సందీప్ పవన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా బోయా నగేష్ మాట్లాడుతూ...


కాంగ్రెస్ పార్టీ ఎపుడూ ప్రజల వైపే ఉంటుందని, తమ పార్టీ హస్తం పేదల నేస్తమని ఆయన వెల్లడించారు. ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతోందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని, ఆరు గ్యారెంటీలు నెరవేర్చుతుందన్నారు. 
తనను గెలిపించి కాంగ్రెస్ పార్టీకి తోడుగా నిలవాలని నియోజకవర్గ ఓటర్లను ఆయన కోరారు.
 మహేశ్వరం ప్రచారంలో...కారు స్పీడు

మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అడుగడున జన నీరాజనం

మహేశ్వరంకు ఎంతో చేశా...గెలిపిస్తే మరింత చేస్తా: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని జల్ పల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి సచితా ఇంద్రారెడ్డి విస్త్రుత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డికి మద్దతు తెలుపుతూ స్థానిక ప్రజలు స్వచ్చందంగా తరలివచ్చి తమ మద్దతును  ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో ప్రజల ఉత్సాహం కనివినని రీతిలో కనిపించింది. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ప్రజలు  ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ...జల్ పల్లి మునిసిపాలిటీ అభివృద్ధి బిఆర్ఎస్ తోనే సాధ్యం... ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ ప్రాంతంపై ప్రత్యేక అభిమానం ఉందని, ఈ ప్రాంత అభివృద్ధికి కోట్లాది నిధులు కేటాయించారన్నారు.


మరింత అభివృద్ధికి కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి... మీ అడబిడ్డగా అండగా ఉంటానని ఆమె వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఐటి హబ్ ఏర్పాటు చేయటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని. ఐటి కంపెనీల రాకతో ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని,  40 ఎకరాలు ఇప్పటికే కేటాయించామన్నారు. నియోజకవర్గములో మొత్తం 15000 ల చెక్కులలో  4000 జల్ పల్లి షాది ముబారక్ చెక్కులు జల్ పల్లిలో అందించాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాంతంలో  30 పడకల ఆస్పత్రి మంజూరు చేసారన్నారు. పాఠశాలల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని, పహాడీ షరీఫ్ దర్గాకు 14 కోట్లతో ర్యాంప్ రోడ్డు కు నిధులు మంజూరు చేసామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో, హైదరాబాద్ లో శాంతి భద్రతలు ఎంతో మెరుగ్గా ఉన్నాయన్నారు.   నీటి సమస్యతో పాటు దశాబ్దాల సమస్యలకు పరిష్కారం లభించిందన్నారు.
ఎన్నికల ఫిర్యాదులకు ప్రత్యేక కంట్రోల్ రూమ్

ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జీ హెచ్ యం సీ చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్ టీ. వెంకన్న

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

రాష్ట్ర శాసనసభ ఎన్నికలను పురస్కరించుకొని చార్మినార్ శాసనసభ నియోజకవర్గం-66 పరిధిలోని ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించేందుకు డీ ఆర్ సీ కేంద్రంలో రౌండ్ ది క్లాక్  ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని సోమవారం నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జీ హెచ్ యం సీ చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్ టీ. వెంకన్న తెలిపారు .  కంట్రోల్ రూమ్ లో మూడు షిఫ్టులో సిబ్బందిని ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని  ఎన్నికలకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే   పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. - మొదటి షిఫ్ట్ లో యాదయ్య (9000333685) ఇలియాస్ (9704758372), - రెండో షిఫ్ట్ లో మన్సూర్ అహ్మద్ (9704990970) మహమ్మద్ అబ్దుల్ ముఖిత్ (9989259203),  - మూడో షిఫ్ట్  లో నరేందర్ (9394023024) ఆదర్ష్ (8187871849) లను సంప్రదించాలన్నారు.


ఆల్టర్నేట్ పాలిట్రిక్స్ తోనే,,,పాతబస్తీ అభివృద్ధి సాధ్యం

ఈసారి మాకు అవకాశమివ్వండి

పాతబస్తీ రూపురేఖలు మార్చేస్తాం

యాకుత్ పురా నియోజకవర్గ ఎంబీటీ అభ్యర్థి అంజాదుల్లా ఖాన్

ఆల్టర్నేట్ పాలిట్రిక్స్ తోనే పాతబస్తీ అభివృద్ధి సాధ్యమని యాకుత్ పురా అసెంబ్లీ ఎంబీటీ అభ్యర్థి అంజాదుల్లాఖాన్ వెల్లడించారు. ఎంఐఎంకే ఓటేయడం ద్వారా పాతబస్తీలో మరి ముఖ్యంగా యాకుత్ పురాలో అభివృద్ధి ఎక్కడవేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా తయారైందన్నారు. ముస్లింలతోపాటు హిందూ ఓటర్లు పోలింగ్ కు వచ్చి ఎంబీటీకి ఓటేయాలని ఆల్టర్నేట్ పాలట్రిక్స్ లేకుండా ఎంఐఎం ప్రజలను అసలు పట్టించుకోదన్నారు. పాతబస్తీలోనే యాకుత్ పురా చాలా పురాతన అసెంబ్లీ నియోజకవర్గమని, అయినా ఇక్కడ అన్ని విషయాలోనూ అభివృద్ధి అనేది అదమంగా ఉందన్నారు. ఈ విషయాన్ని ఓటర్లు గమనించాలన్నారు. యాకుత్ పురా నియోజకవర్గంలో విస్త్రుతంగా ప్రచారం చేస్తున్న ఎంబీటీ అభ్యర్థి అంజాదుల్లా ఖాన్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టీగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పాతబస్తీ రాజకీయ పరిస్థితులపై వివరాలు వెల్లడించారు.

ప్ర:మీకు ఈ సారి ఎన్నికల్లో ప్రజల మద్దతు ఉంటుందని భావిస్తున్నారా...?

జ)కచ్చితంగా ఈ సారి ప్రజా మద్దతు ఉంటుంది. యాకుత్ పురా నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఏమీలేదని ప్రజలకు కూడా తెలిసిపోయింది. పైపెచ్చు ఇక్కడ సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయో తప్పా  పరిష్కారం కావడంలేదు. ఈ పరిస్థితియే ఎంబీటీ గెలవడానికి కారణమవబోతోంది. ఈ సారి ప్రజలు కచ్చితంగా ఎంబీటీని ఆదరిస్తారు. ఎంఐఎం పాలనలో ఇక్కడి ప్రజలు విసిగిపోయారు. ఎంఐఎంకు ఓటేయడానికి ఇష్టంలేని వారు ఓటేయడానికి పోలింగ్ బూత్ కు రావడంలేదు. వారంతా పోలింగ్ వచ్చి ఎంఐఎంకు వ్యతిరేకంగా ఎంబీటీకి మద్దతుగా ఓటేయాలి. అప్పుడే ఇక్కడి రాజకీయాలలో మార్పు వస్తుంది. ప్ర:ఈ సారి ఆల్టర్నేట్ పాలిట్రిక్స్ గురించి పాతబస్తీ ప్రజలు ఆలోచిస్తారని భావిస్తున్నారా...?

జ)కచ్చితంగా మార్పు కోసం ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు.  ఈ సారి ఎన్నికల్లో ఎంఐఎంకు నష్టం వాటిల్లుతుంది. ప్రజలు మార్పు రావాలని కోరుకొంటున్నారు కాబట్టే ఆ ప్రత్యామ్నాయం తాము కావాలని ఈ సారి కూడా ఎన్నికల బరిలో దిగాలని భావించి పోటీలో ఉన్నాం. లేకపోతే పోటీ చేయకూడదన్న భావనతో ఉండేవారం, ప్రజలు మార్పు కోరుకొంటున్నారు కాబట్టే తాము పోటీలో ఉన్నాం.

ప్ర:పాతబస్తీలో మీ ఎంబీటీ పార్టీ ఎన్ని ప్రయత్నాుల చేసినా ఓడిపోతోంది కదా...?

జ)ఇక్కడ  ఎంబీటీ ఓడిపోతుంది అనడం భావ్యంకాదు. ఎంబీటీ గట్టిపోటీ నిస్తోంది. కానీ పాతబస్తీలోని వ్యవస్థ మా ఓటమికి కారణమవుతోంది. పోలిసింగ్, లా అండ్ ఆర్డర్,  ఎన్నికల విధానం, బూత్ మేనేజ్ మెంట్ ను ఎంఐఎం బాగా వాడుకొంటోంది. పోలీసులను మాపై ఉసిగొల్పుతోంది. ఈ వాతావరణంలో ఎంఐఎంకు పోటీగా ఎంబీటీ బరిలోనిలవడమే  పెద్ద సాహసం. ఈ సాహసాన్ని మీరు గుర్తించాలి. అంతేకానీ ప్రజల మద్దతు మాకు లేదు అనడం భావ్యంకాదు.  

ప్ర: ఏ అంశం ఈ సారి మిమల్ని ఎన్నికల్లో గెలిచేలా చేస్తుంది...?

జ)ఒక్క అంశం ఏమిటో నియోజకవర్గంలోనున్న సమస్యలే ఎంఐఎంకు శాపంగా మాకు అస్త్రాలుగా ఉపయోగపడతాయి. వీటితోపాటు ఈ సారి బోగస్  ఓటింగ్ ఉండదని భావిస్తున్నాం. ఇపుడున్న సీఈసీ ఖరాకండిగా ఉన్నారని తెలిసింది. ఇది కూడా మేం ఎన్నికల్లో నిలబడటానికి కారణం. ప్రతి ఎన్నికల్లో ఎంఐఎం మాపై బొగస్ ఓటింగ్ తో గెలిస్తోంది. ఈ సారి బోగస్ ఓట్లకు ఆస్కారముండదు కాబట్టి మా విజయం ఈ సారి కచ్చితం. ఎలాంటి సందేహం అక్కర్లేదు. 

ప్రశ్న: మీరు గెలిస్తే నియోజకవర్గానికి ఏం చేస్తారు...?

జ)ఫలాన చేస్తానని కాదు అన్ని రకాలుగా నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలి. రోడ్లు, డ్రైనేజీ, విధీ దీపాలు ఇలా మౌళిక సదుపాయాలు బాగా పెరగాలి, ప్రభుత్వ సూపర్ స్పెషాలటీ ఆసుపత్రలు, కాలేజీలు, విద్యాలయాలు రావాలి. వీటిని యాకుత్ పురా తెచ్చేందుకు నేను పూర్తిగా ప్రయత్నిస్తా. ఎందుకంటే పాతబస్తీయే వెనకబడిందంటే యాకుత్ పురా అన్ని నియోజకవర్గాల కంటే ఎంతో వెనకబడివుంది. పాతబస్తీకి మెట్రో ట్రైన్ రావాలి. ఇలా ఎన్నో చేయాల్సివుంది.

ప్ర:ఎంఐఎంను మీరు ఎందుకు నిలువరించలేకపోతున్నారు..మీకు ఆ శక్తిలేకనా...?

జ)మళ్లీ మీరు అదే అడుగుతున్నారు. మేం ఎంఐఎంకు గట్టిగా ధైర్యంతో పోటీపడే సాహసం చేస్తున్నాం. మా శక్తిచాలడంలేదని ఎందుకంటారు. మేం సాహసంతో ఎదుర్కొంటున్నామని ఎందుకు అనుకోరు. ఎంఐఎం రూలింగ్ లో వచ్చే పార్టీతో కలుస్తుంది, తరువాత ఆ పార్టీలనే కాటేస్తోంది. కాంగ్రెస్ తొలుత ఎంఐఎంను ప్రోత్సహించింది. అందుకే ఈ రోజు కాంగ్రెస్ ను ఎంఐఎం కాటేసింది. ఇపుడు బీఆర్ఎస్ తో ఉంది. ఎంఐఎం వల్ల రేపు బీఆర్ఎస్ పరిస్థితికూడా కాంగ్రెస్ లాగే తయారవుతుంది. 


కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరు

కర్ణాటక తరహా ఫలితమే ఇక్కడ ఉంటుంది

ముస్లింల మద్దతు ఈ సారి కాంగ్రెస్ కే

టీ పీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ అలీ మస్కతీ

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

తులంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరని టీ పీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ అలీ మస్కతీ పేర్కొన్నారు. కర్ణాటక తరహా ఫలితమే ఇక్కడ కూడా రిపీట్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ముస్లింలు ఈ సారి నమ్మే పరిస్థితి లేదని ఆయన వెల్లడించారు. కర్ణాటక ముస్లింల తరహాలోనే తెలంగాణ ముస్లింలు కాంగ్రెస్ పార్టీకే జై కొడతారని వెల్లడించారు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు. టీపీసీసీ ప్రచార కమిటీ బాధ్యతలు స్వీకరించిన అలీ మస్కతీ తెలంగాణ రాష్ట్రంలోని ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో విస్త్రుతంగా పర్యటించి కాంగ్రెస్ కు ముస్లింల మద్దతు కూడగడుతున్నారు.


కామారెడ్డి, వికారాబాద్, ఆందోల్, సికింద్రాబాద్, మహేశ్వరం, నిజామాబాద్, నాగర్ కర్నూల్, షాద్ నగర్ తదితర ప్రాంతాలలో ఆయన పర్యటించి కాంగ్రెస్ ఓటేయాలని ముస్లింలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా తనను కలసిన మీడియా ప్రతినిధులతో రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై విజయవకాశాలపై ఆయన మీడియాకు వివరించారు. 
ఈ సారి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై ఈ సారి ఓటర్లు తమ విశ్వాసం ప్రదర్శిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ప్రజలపై బలమైన ముద్ర వేశాయన్నారు. బీఆర్ఎస్ చెప్పేదానికి చేదానికి పొంతనలేదన్నారు. ముస్లింలకు పన్నెండుశాతం రిజర్వేషన్లు అన్నది హామీగా నే మిగిల్చేసిందన్నారు. ముస్లిం ఓటర్లంటే బీఆర్ఎస్ చిన్నచూపు ఏర్పడిందని ఆయన ఆగ్రహంవ్యక్తంచేశారు. అందుకే ఈ సారి ముస్లింలు కాంగ్రెస్ కు మద్దతు నిలవనున్నారని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం ఖాయమని ఆయన వెల్లడించారు. 
 రోజురోజుకు బిజెపి గ్రాఫ్ పెరుగుతోంది

బహదూర్ పురా బీజేపీ అభ్యర్థి వై.నరేష్

బీజేపీ అభ్యర్థిని గెలిపించండి...షబానా మోమిన్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

రోజు రోజుకు నియోజకవర్గంలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని బహదూర్ పురా నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి వై.నరేష్ వెల్లడించారు. ఎన్నికల నాటికి ఈ గ్రాఫ్ విజయం దాకా వెళ్తుందన్నారు. తాను గెలిస్తే నియోజకవర్గంలో మంచి ఉన్నత విద్య, ఆదునాతన ఆసుపత్రి, మౌళిక సదుపాయాల కల్పనకు పాటుపడతానన్నారు. అర్హులైన వారికి రేషన్ కార్డలు, పాత కార్డులను రెన్యూవల్ చేసేందుకు చర్యలు చేపడతానని ఆయన హామీ ఇచ్చారు. మోడీ రోడ్ షోతో బీజేపీ విజయం సునాయాసం కావడంతో పాటు గెలుపు అత్యధిక మెజార్టీతో వస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఇప్పటికే బీజేపీ విజయం ఖాయమైనట్లు తెలుస్తోందని ఆయన అన్నారు.


ఇదిలావుంటే హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి  వై నరేష్‌తో పాటు బిజెపి తెలంగాణ మైనారిటీ వ్యవహారాల ఇంచార్జి షబానా మోమిన్, బిజెపి జిల్లా ఇంచార్జి  కొప్పులు రవీందర్ రెడ్డి,  బిజెపి రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి మీర్ విరాసత్ అలీ బక్రీ, మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు షకీల్ మిర్జా, డాక్టర్ ఇసాక్ రాజ్ ఆధ్వర్యంలో మన్ కీ బాత్ లో నేతలు ప్రసంగించారు. ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ మైనారిటీ వ్యవహారాల ఇంచార్జి షబానా మోమిన్ మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి వై.నరేష్ కు ఓటేయాలని కోరారు. పాతబస్తీని ఎంఐఎం సర్వనాశనం చేసిందన్నారు. బీజేపీ గెలిస్తేనే పాతబస్తీలో పురోగతి ఉంటుందన్నారు. ఎంఐఎం ఎప్పుడూ మత రాజకీయాలను ఆసరా చేసుకొని గెలుస్తుందన్నారు. నియోజకవర్గం బాగుపడాలంటే బీజేపీకి ఓటేయాలని కోరారు. ఈ విషయంలో మైనార్టీలు కూడా పునరాలోచన చేసి బీజేపీని గెలిపించాలని ఆమె కోరారు.