వికలాంగుల సదరం స్లాట్ సమస్యలను పరిష్కరించండి....... డిజైబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ (DRWA/AP) డిమాండ్

 వికలాంగుల సదరం స్లాట్ సమస్యలను పరిష్కరించండి.......

డిజైబుల్డ్  రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ (DRWA/AP) డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాలో వికలాంగులకు సదరం సర్టిఫికెట్స్ కొరకు సదరం స్లాట్స్ బుక్ చేసుకునేందుకు ప్రభుత్వం ఈనెల 7వ తేదీన అవకాశం కల్పించింది కానీ ఎక్కడ కూడా సదరం స్లాడ్స్ బుక్ కాలేదని, అక్కడక్కడ విహెచ్,హెచ్ హెచ్,వారు తప్ప ఆర్థోపెడిక్ వికలాంగులకు ఒక్కటి కూడా సదరం స్లాట్ బుక్ కాక వికలాంగులు ఇబ్బందులకు గురవుతున్నారని, డిజైబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు మస్తాన్వలి అన్నారు. నంద్యాల స్థానిక జగజ్జనని నగర్ డిజైబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ కార్యాలయంలో వికలాంగుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన సమావేశంలోచేశారు.


మస్తాన్ వలి మాట్లాడుతూ ప్రభుత్వము 3 నెలలకు ఒకసారి సదరం క్యాంపులు నిర్వహిస్తుందని, ఈనెల 7వ తేదీన విడుదల చేసిన సదరం క్యాంపులో ఒక్క సర్టిఫికెట్ అయిన కూడా వికలాంగులు అప్లై చేసుకోలేకపోయారని, సర్వర్ పని చెయ్యని కారణంగా,కొన్నిచోట్ల వెయిటింగ్ లిస్టులో ఉన్న కారణంగా చాలామంది వికలాంగులు ఇబ్బందులకు గురయ్యారని,కొన్ని వెయిటింగ్ లిస్టులో పడినప్పటికీ వారికి మెసేజ్ వచ్చేటైం తెలియక, కొంతమంది నిరక్షరాశులు కావడం వల్ల వాళ్లు సదరం సర్టిఫికెట్లకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తు, ఇలాంటి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి, సదరం క్యాంపులను 3 నెలలకు ఒకసారి కాకుండా ప్రతినెల సదరం క్యాంపులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిజైబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కిరణ్ కుమార్, జిలాని,  ముస్తఫా, వినోద్ తదితరులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: