సత్యమేవ జయతే దీక్ష నిర్వహించిన..... పాణ్యం మాజీ ఎమ్మెల్యే,టిడిపి ఇన్చార్జ్ గౌరు చరితారెడ్డి

 సత్యమేవ జయతే దీక్ష నిర్వహించిన..... 

పాణ్యం మాజీ ఎమ్మెల్యే,టిడిపి ఇన్చార్జ్ గౌరు చరితారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజక వర్గం కల్లూరు మండలం లోని చెన్నమ్మ సర్కిల్ నందు రాజమండ్రి లో నార భువనేశ్వరి చేస్తున్న నిరాహార దీక్షకు సంఘీభావంగా మహిళలతో కలిసి దీక్ష చేపట్టిన మాజీ ఎంఎల్ఎ గౌరు చరిత రెడ్డి దీక్షకు ముఖ్య అతిథులుగా టీడీపీ సీనియర్ నాయకులు, నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గౌరు వెంకట రెడ్డి,  నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లేల రాజశేఖర్ లు పాల్గొని సంఘీభావం తెలిపిన అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి మరియు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గౌరు చరితా రెడ్డి మాట్లాడుతూ,,, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి రాజమండ్రిలో సత్యాగ్రహ నిరాహారదీక్ష చేస్తున్నారని, నారాభువనేశ్వరికి పూర్తి స్థాయిలో సంఘీభావంగా రాష్ట వ్యాప్తంగా తలపెట్టిన సత్యమేవ జయతే దీక్షలో భాగంగా పాణ్యం నియోజకవర్గం లోని కల్లూరు చెన్నమ్మ సర్కిల్  నందు భువనేశ్వరి  మద్దతుగా భారీ సంఖ్యలో మహిళలతో కలిసి నిరాహారదీక్ష నిర్వహిస్తున్నామని, గాంధీ జయంతి రోజున నైన ఈ సైకో ముఖ్యమంత్రి ఆలోచన విధానంలో పరివర్తన చెందుతారని భావిస్తున్నామనీ, రానున్న ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో వైసిపి ప్రభుత్వం ఓడిపోతుందని భయంతోనే ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టి, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ టిడిపి నేతలను ఇబ్బందులకు గురి చేయడం లాంటి చర్యలు తీసుకొనే వైసిపి ప్రభుత్వాన్ని ప్రజలు చికొడుతున్నారని, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ప్రజలంతా ఏకమై చంద్రబాబు ను గెలిపించాలని పిలుపు నిచ్చారు.


ఈ కార్యక్రమంలో పాణ్యo నియోజకర్గ జనసేన పార్టీ ఇంచార్జి చింతా సురేష్, నంద్యాల పార్లమెంట్ మహిళ అధ్యక్షురాలు పార్వతమ్మ, రాష్ట మహిళ అధ్యక్షురాలు ఝాన్సి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపొగు వెంకట స్వామి, జనసేన పార్టీ మహిళా నాయకురాలు హసీనా బేగం, టీడీపీ రాష్ట మహిళ అధికార ప్రతినిధి సుభద్రమ్మ, కల్లూరు మాజీ ఎంపీపీ వాకటి మాధవి, తడకన పల్లే సర్పంచ్ సహారా బి, కల్లూరు మహిళ నాయకురాల్లు రమణమ్మ, కృష్ణవేణమ్మ, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ రామకృష్ణ, తెలుగు  యువత రాష్ట ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు బ్రహ్మణ పల్లె నాగిరెడ్డి, బిసి సెల్ రాష్ట కార్యదర్శి కాసాని మహేష్ గౌడ్, నియోజకవర్గ ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు ఫిరోజ్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గంగాధర్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శేఖర్ చౌదరి, మాదన్న, కేతూరు మదు, శ్రీనివాస రావు, క్రిస్టియన్ సెల్ బాబు రాజు, కల్లూరు మండల అధ్యక్షులు రామాంజనేయులు, గడివేముల మండల కన్వీనర్ దేశం సత్య నారాయణ రెడ్డి, పాణ్యం నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల, గ్రామాల మరియు కల్లూరు అర్బన్ వార్డ్ ఇంచార్జి లు టీడీపీ అభిమానులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: