జల్ పల్లిపై కేసీఆర్ కు ప్రత్యేక అభిమానం
ఓటువేసి వాటిని నిలుపుకొందాం
జల్ పల్లి వాసులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
ధూమ్ ధామ్ గా, గులాబీ దండుతో కలిసి జల్ పల్లి మునిసిపల్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. భారీ ర్యాలీతో మంత్రి, మహేశ్వరం బిఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డికి ఘనంగా ఆ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. యువ నాయకులు కార్తీక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి మంత్రి సబితమ్మ ఇంద్రారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యా శాఖ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ బి ఆర్ ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ....
జల్ పల్లి ప్రాంతంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక అభిమానం ఉందని, ఈ ప్రాంత అభివృద్ధికి కోట్లాది నిధులు కేటాయించారన్నారు. ప్రతి ఓటరును కలిసి ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధిని వివరించి, కారు గుర్తుకు ఓటు వేయించాలని కోరారు. ఈ ప్రాంతంలో ఐటి కంపెనీల రాకతో రూపురేఖలు మారిపోతాయని, 40 ఎకరాలు ఇప్పటికే కేటాయించామని. నియోజకవర్గంలో మొత్తం 15000 ల చెక్కులలో 4000 జల్ పల్లి షాది ముబారక్ చెక్కులు జల్ పల్లిలో అందించాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాంతంలో 30 పడకల ఆస్పత్రి మంజూరు చేసారన్నారు. 5 కోట్లు పాఠశాలకు కేటాయించాం, పహాడీ షరీఫ్ దర్గాకు 14 కోట్లతో ర్యాంప్ రోడ్డు కు నిధులు మంజూరు చేసామని మంత్రి వెల్లడించారు.
యువనేత కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ... జల్ పల్లిలో మంత్రి సబితమ్మ ఆధ్వర్యంలో ఉహాలకందని అభివృద్ధి జరిగింది. బడ్జెట్ లో మైనార్టీల కు అధిక కేటాయింపులు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో, హైదరాబాద్ లో శాంతి భద్రతలు ఎంతో మెరుగ్గా ఉన్నాయి. నీటి సమస్యతో పాటు దశాబ్దాల సమస్యలకు పరిష్కారం లభించింది. జల్ పల్లి బిఆర్ఎస్ కు కంచుకోట అని,మరింత అభివృద్ధి కోసం సబితమ్మను గెలిపించాలన్నారు.
Post A Comment:
0 comments: