కిచక ఉపాధ్యాయుడు రాంబాబు ను తక్షణమే సస్పెండ్ చేయాలి.... ఆర్విఎఫ్,ప్రగతిశీల విద్యార్థి సంఘం నాయకుల డిమాండ్.

 కిచక ఉపాధ్యాయుడు రాంబాబు ను తక్షణమే సస్పెండ్ చేయాలి.... 

ఆర్విఎఫ్, ప్రగతిశీల విద్యార్థి సంఘం నాయకుల డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజక వర్గం స్థానిక  ఓర్వకల్లు మండలంలోని బుగ్గరామేశ్వర డిగ్రీ కళాశాలలో విలేకరుల సమావేశంలో రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (అర్విఎఫ్ )రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ రవీంద్రనాథ్, ప్రగతిశీల విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయ్యన్న లు మాట్లాడుతూ ఓర్వకల్లు మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో ఉన్న  మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల లో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న రాంబాబును తక్షణమే విధుల నుంచి తొలగించాలని,ఓర్వకల్లు మండలంలో రోజురోజుకూ విద్యా వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నా మండల విద్యాశాఖ అధికారులు నిద్రా వ్యవస్థలో ఉన్నారని, విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాద్యాయుడు విద్యార్థుల పై అసభ్యంగా ప్రవర్తిస్తూ,ఉపాధ్యాయ వృత్తికి కలంకం తీసుకొస్తున్నాడని, ఉప్పలపాడు గ్రామంలో ఒక విద్యార్థికి తెలుగు టీచర్  రాంబాబు ప్రవర్తన సరిగా లేక ఉయ్యాలవాడ స్కూల్ కు మారడంజరిగిందని, స్కూల్ మారినా విద్యార్థినిని వదలని తెలుగు టీచర్ రాంబాబు ప్రవర్తన మారలేదని,


ఈ ఘటన జరిగి నాలుగు రోజులు కావస్తున్నా ఇంతవరకు విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుడి పై చర్యలు తీసుకోవడం లేదని, ఓర్వకల్లు మండలం విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా నిద్ర మత్తు వదిలి కీచక టీచర్ రాంబాబు పై తక్షణమే చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఉద్యమం ఉద్రిక్తత చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు విష్ణు, రామ్, మనోజ్, రాజు, రవితేజ తదితరులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: