ఆళ్లగడ్డలో టిడ్కో గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేసిన....
రాష్ట్ర మంత్రులు
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లాలో ప్రతి పేదవాడు జీవితాంతం కష్టపడ్డా సొంతింటి కల నెరవేర్చుకోలేని తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇచ్చి సొంతింటి కల నెరవేర్చారాలను ఉద్దేశంతో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం పరిధిలోని చింతకుంట్ల గ్రామ సమీపంలో ఏర్పాటుచేసిన టిడ్కో గృహ సముదాయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్,రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్,జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలానీ సమూన్,ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి,ప్రభుత్వ సలహాదారుమాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి,స్థానిక ఎమ్మెల్యే బ్రిజేంద్రనాధ్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి,జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ భాషాలు పాల్గొని 1392 టిడ్కో గృహాలు ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ
దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రవ్యాప్తంగా 2.62 లక్షల టిడ్కో గృహాలను మంజూరు చేసి పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నామని,31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశామనీ. నాలుగున్నర సంవత్సరాల కాలంలో 98 శాతం హామీలు సియం వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలుచేసారనీతెలిపారు. అనంతరం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ఆళ్ళగడ్డ పట్టణంలో 23 ఎకరాల స్థలంలో నిర్మించిన 1392 టిడ్కో గృహాలను పంపిణీ చేయడం సంతోషకరంగా ఉందనీ,అక్క,చెల్లెమ్మలకు జగనన్న పుట్టింటి సారెగా అన్ని వసతులతో కూడిన ఉచిత గృహాన్ని నిర్మించి ఒక్క రూపాయికే ఇస్తున్నామనీ,రాబోయే రోజుల్లో టిడ్కో గృహ సముదాయాలన్నీ గ్రామాలుగా మారుతాయనీ,గత ప్రభుత్వం అరకొరగా నిర్మించిన గృహాలకు అత్యా ధునిక వసతులు కల్పించి పేదలకు రాజకీయాలకు ఆతీతంగా సంక్షేమ పథకాలు అందరికీ అందజేస్తున్నామని,ఎన్నోఏళ్లుగా అద్దె ఇళ్లలో అవస్థలు పడిన లబ్ధిదారులు ఇక నుంచి జగనన్న నగర్ లో అన్ని వసతులతో కూడిన గృహ ఇంటి పట్టాలు పంపిణీచేస్తున్నామన్నామని తెలిపారు.
అనంతరం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ అసంపూర్తిగా వున్న టిడ్కో గృహ నిర్మాణాలను పూర్తి చేసి పేద ప్రజలకు పంపిణీ చేశామనీ,ఎక్కువ ధరకు టెండర్లు వేయడం గమనించి రివర్స్ టెండరింగ్ పద్ధతి ద్వారా వందల కోట్లు ప్రజాధనం వృథా కాకుండా ఆపామనని,నాడు-నేడు ద్వారా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల రూపు రేఖలు మార్చామనీ, ఆసరా,చేయూత,చేదోడు తదితర పలు సంక్షేమ కార్యక్రమాలన్నీ విజయవంతంగా అమలు చేస్తున్నామనీ,పేదవాడికి భరోసా పాలన ఇచ్చిన ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోవాలని తెలిపిన అనంతరం జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ పేదవాడు ఇల్లు కట్టుకోవాలన్న కలను రాష్ట్ర ముఖ్యమంత్రి నిజం చేస్తున్నారనీ,జిల్లావ్యాప్తంగా 95 వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసామనీ,జిల్లా మొత్తం మీద 11,680 టిడ్కో గృహాలను నిర్మించగా ఆళ్లగడ్డ పట్టణంలో 1392 టిడ్కో గృహాలను పండుగ వాతావరణంలో లబ్ధిదారులకు అందజేస్తున్నామని,
టిడ్కో గృహ నిర్మాణం కొరకు 70 కోట్ల రూపాయలు ఖర్చు చేసామనీ,322 జగనన్న లే అవుట్ లలో 44 వేల మందికి గృహాలు మంజూరు చేయగా ఇప్పటివరకు 31 వేల గృహాలు లబ్ధిదారులు పూర్తి చేసుకున్నారనీ తెలిపారు. అనంతరం నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి తిండి,కూడు,గుడ్డ అత్యవసరమని ఇందులో భాగంగానే ప్రతి నిరుపేద కుటుంబానికి గృహాన్ని నిర్మించి ఇవ్వాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయమనీ తెలిపిన అనంతరం లబ్ధిదారులకు ఇంటి హక్కు పత్రాలను, ఇంటి తాళాలను అందజే శారు.ఈ కార్యక్రమంలో రామతీర్థం పుట్టాలమ్మ ఆలయ చైర్మన్ గంగుల మనోహర్ రెడ్డి,గవిజయ డైరీ చైర్మన్ ఎస్వీ జగన్, విజయ డైరీ డైరెక్టర్ గంగుల విజయ సింహారెడ్డి,ఆళ్ళగడ్డ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి,ఏపీ ముస్లిం మైనార్టీ జనరల్ సెక్రటరీ బాబులాల్,ఆళ్ళగడ్డమార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం రాఘవ రెడ్డి,ఏపీ ఇరిగేషన్ చైర్మన్ కర్రాగిరజాహర్షవర్ధన్ రెడ్డి,ఆళ్లగడ్డ ఎంపీపీ గజ్జల రాఘవేంద్ర రెడ్డి,పలు శాఖల వైస్ చైర్మన్లు, ఎంపిటిసిలు,జడ్పీటిసిలు మరియు భారీ సంఖ్యలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆళ్లగడ్డలో టిడ్కో గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేసిన....
రాష్ట్ర మంత్రులు
Post A Comment:
0 comments: