జగనన్న లేఔట్ లో నిర్మించిన గృహాలకు గృహప్రవేశాలు....
నంద్యాల జిల్లా ఇన్చార్జి కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లాలో జగనన్న లేఅవుట్ కాలనీల్లో నిరుపేదలందరికీ ఇళ్ళు పథకంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 44 వేల గృహాలు మంజూరు చేశామని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. నిరుపేదలందరికీ ఇళ్లు పథకం కింద ప్రతి పేదవాడికి గూడు కల్పించాలన్న ప్రధాన నేపథ్యంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 7.43 లక్షల ఇళ్లను పూర్తి చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజవర్గం సామర్లకోటలో వైఎస్సార్ జగనన్న హౌసింగ్ కాలనీ లేఔట్ లను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించే కార్యక్రమాన్ని నందికొట్కూరు పట్టణం పగిడ్యాల రోడ్ లోని వైఎస్సార్ జగనన్న కాలనీ లేఔట్ సమీపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో లైవ్ ద్వారా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, నందికొట్కూరు శాసనసభ్యులు తోగూర్ ఆర్థర్, మైనారిటీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారు హబీబుల్లా, నందికొట్కూర్ మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ రబ్బాని, హౌసింగ్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ రమాదేవి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ అబ్దుల్ సుకూర్మియా, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ రహాత్, హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకట సుబ్బయ్య తదితర అధికారులు పాల్గొని వీక్షించారు. గృహప్రవేశాలు ప్రారంభించిన అనంతరం నంద్యాలజిల్లా ఇంచార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల జిల్లాలోని 322 వైయస్ జగనన్న లేఔట్లు, సొంత స్థలాలు కలిగిన 44 వేల మందికి గృహాలు మంజూరు చేశామన్నారు. ఇప్పటివరకు 31 వేల గృహాలు లబ్ధిదారులు పూర్తి చేసుకున్నారన్నారని, నందికొట్కూరు మున్సిపాలిటీకి సంబంధించి వైయస్సార్ జగనన్న లేఔట్ లో 526 గృహాలు మంజూరు కాగా ఇప్పటి వరకు 209 గృహాలు పూర్తి చేసుకొన్న గృహాలకు గృహప్రవేశాలు ప్రారంభించామని,మిగిలిన గృహాలు వివిధ నిర్మాణ దశలలో ఉన్నాయని, ఇందుకు సంబంధించి గృహ నిర్మాణ శాఖ ద్వారా 6.28 కోట్ల రూపాయలను ఖర్చు చేశామని,మౌలిక సదుపాయాలకు సంబంధించి త్రాగునీటి సరఫరా కొరకు 67.5 లక్షలు,విద్యుద్దీకరణకు 80 లక్షలు,రహదారుల నిర్మాణానికి 25 లక్షలు, పైలాన్ కొరకు 50 వేల రూపాయలు,ఆర్చి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఖర్చు చేశామని,లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా నిత్యావసర వస్తువుల సరకులను కూడా ఇక్కడే పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, పారిశుధ్య చర్యలపై ఫోకస్ పెట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, గతంలో ఏవిధంగా సంక్షేమ పథకాలు పొందుతున్నారో అదే రీతిలో ఈకాలనీలో కూడా సంక్షేమ పథకాలు పొందేలా చర్యలు తీసుకుంటామనితెలిపారు. నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచ బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి తిండి,కూడు,గుడ్డ అత్యవసరమని ఇందులో భాగంగానే ప్రతి నిరుపేద కుటుంబానికి గృహాన్ని నిర్మించి ఇవ్వాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయమని, నందికొట్కూరు నియోజకవర్గంలోని జగనన్న లేఔట్ లో 209 మంది గృహాలు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని,గృహ నిర్మాణాలే కాకుండా విద్యా,వైద్య ఇతర సంక్షేమ రంగాలకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు.
Post A Comment:
0 comments: