జగనన్న ఆరోగ్య సురక్ష పేదలకు వరం.... నంద్యాల జిల్లా ప్రజా ప్రతినిధులు

 జగనన్న ఆరోగ్య సురక్ష  పేదలకు వరం.... 

నంద్యాల జిల్లా ప్రజా ప్రతినిధులు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ప్రారంభించిన  నంద్యాల జిల్లా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ పేద ప్రజల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషకరమని మేము ప్రైవేటు హాస్పిటల్ లో వైద్యం చేయించుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఏర్పాటుచేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్నకు ప్రజలు ప్రత్యేకధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ జగనన్న సురక్షతో ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం అందుతుందని, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఐదు దశలుగానిర్వహిస్తున్నారని, పట్టణంలో వైయస్ఆర్ హార్బన్ హెల్త్ క్లినిక్లు, గ్రామాలలో విలేజ్‌ క్లినిక్‌ లో భాగంగా ఆశావర్కర్లు, వాలంటీర్లు మమేకమై ప్రతి ఇంటిని జల్లెడపట్టి సర్వే చేసి ప్రతి ఇంట్లో బీపీ, షుగర్‌, హిమోగ్లోబిన్‌ పరీక్షలు చేస్తారని, అవసరాన్ని బట్టి యూరిన్‌, మలేరియా, డెంగ్యూ,కఫం పరీక్షలు కూడా చేస్తారని, ప్రతి ఇంటిలో ఏడు రకాల పరీక్షలు నిర్వహించి, ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై ఒక నివేదిక ఇచ్చి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎలా వినియోగించుకోవాలో, ఆరోగ్యశ్రీ యాప్‌ డౌన్లోడ్‌ చేసుకునే వీలుగా అవగాహన కల్పిస్తారని,


గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో రక్తహీనత నివారణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి మందులు ఇవ్వడమే కాకుండా మ్యాపింగ్‌ చేసి ఆహారం సప్లిమెంటేషన్‌ కోసం వాలంటీర్లు చర్యలు చేపడతారని తెలిపారు. నంద్యాల జిల్లాలో ప్రతిష్టాత్మకంగా మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ప్రజలకు అధునాతన ఉచిత వైద్యం, విద్య అందిస్తున్న గొప్ప మహానేత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు మంచి చేస్తున్న వైయస్ఆర్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్లు, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్స్, మాజీ కౌన్సిలర్లు, వైద్యఅధికారులు మరియు ఏ యన్ యం లు మరియు వాలంటరీలు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: