నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తున్న జీవీమాల్ యాజమాన్య వైఖరిపై.....
నంద్యాలజిల్లా డీఆర్ఓ, మున్సిపల్ కమీషనర్ కి ఫిర్యాదుచేసిన....
నంద్యాల విద్యార్ధి,యువజన సంఘాల జేఏసీ నేతలు
(జానో జాగోె వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా స్థానిక నంద్యాల పట్టణంలో ఆఫర్ల పేరుతో జీవిమాల్ యాజమాన్యం ప్రజలకు చేస్తున్న మోసంపై నంద్యాల జిల్లా డిఆర్ఓ పుల్లయ్య మరియు మున్సిపల్ కమీషన్ రవి చంద్రారెడ్డికి సమస్యను వివరించి వినతి పత్రం అందించిన విద్యార్థి యువజన సంఘాల నేతలు.ఈ సందర్భంగా జేఏసీ నేతలు రామినేని రాజునాయుడు, బందెల ఓబులేసు, శివకృష్ణ యాదవ్, షేక్ రియాజ్ , జయరాజులు మాట్లాడుతూ నంద్యాల జిల్లా కేంద్రంలో జీవీ షాపింగ్ మాల్ పేరిట కార్పోరేట్ షాపింగ్ మాల్ ఏర్పాటు చేసి గత 30 సంవత్సరాల నుండి నంద్యాలలో బట్టల వ్యాపారం చేస్తున్న నంద్యాల వాసులకు ఉపాధికి దూరం చేస్తున్నారనీ,ఆఫర్ల పేరుతో నయా మోసంచేస్తున్నారనీ,
జీవీ షాపింగ్ మాల్ కు ఎటువంటి ప్రభుత్వ అనుమతులు, మున్సిపాలిటీ అనుమతులు లేవనీ, కొందరు అధికారులు ముడుపులు తీసుకొని జీవీ మాల్ కు సరియైన మౌలిక సదుపాయాలు లేకుండా ఉన్న తప్పుడు అనుమతులు ఇచ్చారనీ, ఆఫర్ల పేరుతో నయా మోసం చేస్తూ, నంద్యాలలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగిస్తూ ఉన్న జీవీ షాపింగ్ మాల్ పై చర్యలు తీసుకోవాలని లేదంటే షాపింగ్ మాల్ ఎదుట ప్రత్యక్ష ఆందోళనలు చేపడుతామని వివరింపగా నంద్యాల పట్టణంలో నిర్వహిస్తున్న జీవీ షాపింగ్ మాల్ పై విచారణ చేపడుతామని మున్సిపల్ కమీషనర్ రవి చంద్రారెడ్డి తెలియజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల విద్యార్థి యువజన సంఘాల నేతలు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: