ఖైదీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న,,,
ఎంపీజేకు అవార్డు
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
గత 15 ఏళ్లుగా ఖైదీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న తమ సంస్థకు ఈయేడు కూడా తగిన గౌరవం లభించడం సం తోషకరమని మూవ్ మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (ఎంపీజే) జనరల్ సెక్రెటరీ సలీమ్ అల్ హిందీ అన్నారు. గాంధీజయంతి, ఖైదీల సంక్షేమ దినోత్సవాలను పురస్కరించుకుని చంచల్గూడ సెంట్రల్ జైలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెంట్రోపాలిటన్ సెషన్ జడ్జి ఎస్. ప్రేమావతి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవడం జరిగిం దన్నారు. ఈ సందర్భంగా సలీమ్ అల్ హింది మాట్లాడుతూ, ఎంపీజే గత 15 ఏళ్లుగా కులమతాలకతీతంగా చేయని నేరాలకు జైళ్లల్లో మగ్గుతున్న వారిని గుర్తించి విడుదలకు కృషి చేస్తుందన్నారు. అం తేకాకుండా జీవిత ఖైదు పడి జైళ్లలో ఉంటున్న నిరుపేద ఖైదీల కుటు బసభ్యులకు జీవనోపాధి కల్పించి వారి కాళ్లపై వారు నిలబడేలా ఎం పీజే కృషి చేస్తుందన్నారు. సంస్థ చేస్తున్న కృషిని గుర్తించిన జైలు అధికారులు ఈ ఏడాది కూడా తమ సంస్థకు తార్డును అం దజేశారన్నారు.
Post A Comment:
0 comments: