స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టిన..... 

నందికొట్కూరు బిజెపి అసెంబ్లీ ఇంచార్జ్ కొండే పోగు చిన్న సుంకన్న

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా బిజెపి జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ బైరెడ్డి శబరి ఆదేశాల మేరకు నందికొట్కూరునియోజకవర్గం మిడుతూరు మండలం లోని మండల అధ్యక్షులు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మిడుతూరు మండలంలోని పైపాలెం గ్రామంలో ముఖ్యఅతిథిగా నందికొట్కూరు బిజెపి అసెంబ్లీ ఇన్చార్జ్ కొండేపోగు చిన్న సుంకన్న హాజరై స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంటే ఎలాంటి అనారోగ్యాలు రావని, అందరూ ఆరోగ్యంగా ఉంటారని,ప్రతి ఒక్కరు మీ గ్రామంలో, మీ వీధిలో, మీ ఇంట్లో స్వచ్ఛత అనేది చాలా అవసరమని, భారత దేశ ప్రధానమంత్రి చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ జిల్లా స్వచ్ఛ గ్రామం పేరు మీదుగా పరిశుభ్రంగా ఉంచుకుంటే అందరూ క్షేమంగా ఎలాంటి రోగాలకు దరిచేరకుండా దూరంగా ఉండాలానే ఉద్దేశంతో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టామని,


మరుగుదొడ్లు నల్ల కులాయి ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో స్వచ్ఛత ఉంచుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా నాయకులు గోకారి , పైపాలెం, నాగలూటి గ్రామస్తులు మరియు మిడుతూరు మండల నాయకులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: