నంద్యాల బొగ్గు లైన్ ఇస్లాంపేట ప్రజలకు ఇల్లు నిర్మించాలి.... సిపిఐ నాయకుల డిమాండ్

 నంద్యాల బొగ్గు లైన్ ఇస్లాంపేట ప్రజలకు ఇల్లు నిర్మించాలి.... 

సిపిఎం నాయకుల డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా స్థానిక నంద్యాల పట్టణంలోని బొగ్గు లైన్,ఇస్లాంపేట ప్రజలకు ఇళ్ల స్థలాలు చూపించి ఇల్లు నిర్మించి ఇవ్వాలి,భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్ ) సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నంద్యాల బొగ్గు లైన్ ఇస్లాంపేట ప్రజలను బలవంతంగా ఖాళీ చేయిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),సిపిఎం నాయకులుహెచ్చరించారు. ఈ సందర్భంగా వారు బొగ్గు లైన్ ఇస్లాంపేట ప్రజలతో భారీ ర్యాలీ గా వచ్చి ఉదయం 8 గంటల నుండి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తుండగా


స్థానిక ఎమ్మార్వో శ్రీనివాసులు ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇస్తామని, అంతవరకు ఖాళీ చేయవద్దని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగరాజు, సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి పుల్లా నరసింహులు, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు తోటా మద్దులు, పార్టీ పట్టణ కార్యదర్శి వర్గసభ్యులు లక్ష్మణ్, వెంకటలింగం అక్కడి బొగ్గు లైన్, ఇస్లాంపేట ప్రజలు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: