అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు.... గడివేముల ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య

 అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు.... 

గడివేముల ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడి వేముల మండల పరిధిలోని బూజునూరు గ్రామంలో గడివేముల ఎస్సై బిటి వెంకట సుబ్బయ్య పల్లెనిద్ర నిర్వహించి ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గడివేముల ఎస్ఐ బీటి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ గ్రామంలో దొంగతనాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అసాంఘిక కార్యక్రమాలైన జూదం, మట్కా,నాటు సారాయి తయారీ, విక్రయం, వినియోగం మొదలగు వాటిపై ప్రత్యేక దృష్టి ఉంచి వారిపై పీడీ యాక్ట్ చట్టాలు అమలు చేస్తున్నామని, ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమ నిభందనలను పాటించి రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి ఉంచాలని, మోటర్ సైకిల్ పై వెళ్ళు ప్రతి ఒక్కరు  హెల్మెంట్ తప్పనిసరిగా ఉపయోగించాలని, ఆటోలో పరమితికి మించిప్రయాణం చేయకూడదని, సైబర్ క్రైమ్ ఫైన, లోన్ అప్ప్, అనవసర లింక్ లపై అవగాహన కలిగి ఉండాలని, విద్యార్థులు క్రికెట్ బెట్టింగ్ లపై ప్రత్యేక దృష్టి పెట్టడమైనదని, విద్యార్థులు బెట్టింగుల జోలికి వెళ్లకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, చెడునడత గలవారు ప్రజల శాంతికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన యెడల వారిపై


చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, చెడు అలవాట్లకు స్వస్తి చెప్పి సత్ప్రవర్తనతో మెలగాలని, ఎవరైనా భిన్నంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని, గ్రామంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డా చర్యలు తప్పవని, పోలీస్ శాఖ ఆదేశాలను, సూచనలను పెడచెవిన పెట్టి ప్రజల శాంతికి భంగం కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై పీడీ యాక్ట్ అమలు పరుస్తామని, పోలీస్ లు మీ ప్రతి కదలికలను గమనిస్తూ ప్రత్యేక నిఘా ఉంచుతారని, జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: