నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ కొరకు,,,,
ప్లకార్డ్స్ లను ప్రదర్శించనున్న......ట్రాఫిక్ పోలీసులు
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా స్థానిక నంద్యాల పట్టణంలోని ఎల్కేఆర్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ కళ్యాణ్ కుమార్ రెడ్డి నంద్యాల పట్టణంలో రోడ్డు ట్రాఫిక్ నిబంధనల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కొరకు100 ప్లకార్డ్స్ తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాల నివారణకు తమ వంతు సహాయంగా నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ కె.రఘువీర్ రెడ్డి ఐపిఎస్ గారికి అందజేయగా జిల్లా ఎస్పీ గారు తన ఛాంబర్ లో వాటిని ఓపెన్ చేసి వీటిని నంద్యాల పట్టణంలోని ప్రధాన కూడల్లలో,రద్దీ ప్రదేశాలలో, యాక్సిడెంట్లు జరిగే బ్లాక్ స్పాట్ ల వద్ద ఏర్పాటు చేయాలని నంద్యాల ట్రాఫిక్ సిఐ ఇస్మాయిల్ గారిని ఆదేశించారు.ఈసందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి ఐపిఎస్ గారు మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని పోలీస్ వారు చేస్తున్న కృషికి సహాయపడాలని రోడ్డు ప్రమాదాల కొరకు తమ వంతు సహాయంగా పోలీస్ వారి సూచనల మేరకు 100 ప్లకార్డ్స్ లను తయారు చేయించి పోలీస్ వారికి అందించిన ఎల్కేఆర్ స్కూల్ మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానం చేరాలని జిల్లా ఎస్పీ కే. రఘువీర్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ వెంకటరాముడు,నంద్యాల ట్రాఫిక్ సిఐ ఇస్మాయిల్, ఎల్కేఆర్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ కళ్యాణ్ కుమార్ రెడ్డి మరియు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ బాబీ పాల్గొన్నారు.
నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ కొరకు,,,,
ప్లకార్డ్స్ లను ప్రదర్శించనున్న......ట్రాఫిక్ పోలీసులు
Post A Comment:
0 comments: