నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న "జీవి మాల్" ను సీజ్ చేయాలి... ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్

 నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ,,,

"జీవి మాల్" ను సీజ్ చేయాలి...

ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాలో స్థానిక నంద్యాల పట్టణంలో నడుపుతున్న "జీవి మాల్" డిస్కౌంట్ల పేర్లతో ప్రజలను మోసం చేస్తూ,నయా మోసానికి తెరలేపిన "జీవి మాల్" యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి ధనుంజయ్ నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి పత్రికా ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి ధనుంజయుడు మాట్లాడుతూ ఎటువంటి ప్రభుత్వ నిబంధన లేకుండా,మున్సిపాలిటీ నిబంధనలకు విరుద్ధంగా,పార్కింగ్ లేకుండా జనావాసాలకు ఇబ్బంది కలిగిస్తూ, డిస్కౌంట్ల పేరుతో నయా మోసం చేస్తున్న నంద్యాల పట్టణంలోని జీవి మాల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని,నంద్యాల పట్టణంలోని దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది బట్టల వ్యాపారం చేసుకుంటూ తమ కుటుంబాలను పోషిస్తూ పదిమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో జీవి మాల్స్ రావడం వల్ల వారి కడుపులు కొట్టె విధంగా కార్పొరేట్ మాల్స్ యాజమాన్యం ధనార్జన దేయంగా ఆర్థిక సంపాదన చేస్తూ పేద మధ్యతరగతి ప్రజలను మోసం చేస్తున్నారని,నంద్యాలలో వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులుసూరత్,ఢిల్లీ, ముంబై ప్రాంతాల నుండి ఎంతో వ్యయ ప్రయాసలు పడి సరుకు తెచ్చుకొని తక్కువ ధరలకు విక్రయిస్తు సామాన్య ప్రజలకు అందుబాటులో ధరలు ఉండేటట్లు అమ్మకాలు కొనసాగిస్తూన్నారని,


జీవి మాల్ లాంటి కార్పొరేట్ సంస్థలు డిస్కౌంట్ల పేరుతో పది రూపాయలకు వస్తువునుకొని 30 రూపాయలు దాని పైన రేటు పెట్టి మరల 20 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నట్లుగా ప్రచారాలు చేస్తూ తప్పుడు ప్రచారాలు చేసి ఆ పది రూపాయలకే  అమ్ముతూ ప్రజలను మోసం చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే నంద్యాల జిల్లా కలెక్టర్ గారు స్పందించి నంద్యాల పట్టణంలో నూతనంగా ప్రారంభమైనటువంటి జీవి మాల్ యాజమాన్యం ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా, పార్కింగ్ లేకుండా,మాల్ నడుపుతూ,డిస్కౌంట్ ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న జీవి మాల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి యాజమాన్యాన్ని అరెస్టు చేసి జీవిమాల్ ను సీజ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి ధనుంజయుడు అధికారులను డిమాండ్ చేశారు.చర్యలు తీసుకోలేని పక్షంలో జీవిమాల్ ఎదుటనే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలను కలుపుకొని ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: