ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పరిశీలనకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయండి....
జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లాలో 16-10-23(సోమవారం) నుండి ప్రారంభమయ్యే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ప్రథమ స్థాయి పరిశీలన(ఎఫ్ఎల్సి)కు సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని నంద్యాలజిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ డిఆర్ఓ పుల్లయ్య,ఆర్డీవో శ్రీనివాసులును ఆదేశించారు.టేక్కె మార్కెట్ యార్డు గోడౌన్లో భద్రపరచిన ఈవీఎంలను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డితో కలిసి కలెక్టర్ పరిశీలించారు.ఈసందర్భంగా జిల్లాకలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు 16 -10-23 నుండి 10-11-23 వ తేదీ వరకు ఉదయం 09:00 గంటల నుండి సాయంత్రం 07:00 గంటల వరకు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి సూపర్వైజర్ ఆధ్వర్యంలో ఓటింగ్ యంత్రాల పరిశీలన జరుగుతుందని, రాజకీయ పార్టీ ప్రతినిధులకు జారీచేసిన గుర్తింపు కార్డుదారులను మాత్రమే లోపలికి అనుమతిస్తామని,రాజకీయ పార్టీల ప్రతినిధులు కూర్చునేందుకు వీలుగా కౌంటర్లలో కుర్చీలు ఏర్పాటు చేయాలని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ప్రథమ స్థాయి పరిశీలనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని,ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్లో పరిశీలనకు అవసరమైన టేబుళ్లు, కుర్చీలు, టివి, లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలని,ఫ్లెక్సీ బ్యానర్ ఏర్పాటు చేయడంతో పాటు బెల్ ఇంజనీర్లకు అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇతర స్టేషనరీ సామాగ్రి కొరత లేకుండా చూసుకోవాలని డిఆర్ఓ పుల్లయ్యను ఆదేశించారు.
అనంతరం బిల్డింగ్ చుట్టు బారికేడింగ్ ఏర్పాటు చేసుకోవాలని, గుర్తింపు కార్డులు మంజూరు చేసిన వ్యక్తులనే లోపలికి అనుమతించాలని, పరిశీలన గది వెలుపలి ప్రాంతంలో సెల్ ఫోన్ లు, డిపాజిట్ చేసేందుకు కౌంటర్ ను ఏర్పాటు చేయాలని, మెటల్ డిటెక్టిర్ ను ఏర్పాటు చేసి ప్రతి వ్యక్తిని తనిఖీ చేసిన అనంతరం లోపలికి అనుమతించేలా చర్యలు తీసుకోవాలని డిఎస్పి మహేశ్వరరెడ్డిని ఆదేశించారు. వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటింగ్ యంత్రాల పరిశీలన పర్యవేక్షించేందుకు సిసి నిఘా కెమెరాలను ఏర్పాటు చేయాలని డిఎస్పి మహేశ్వరరెడ్డిని ఆదేశించారు. అనంతరం డిఆర్వో పుల్లయ్య మాట్లాడుతూ 12 మంది బెల్ ఇంజనీర్లు, 50 మంది మున్సిపల్ సచివాలయ సిబ్బంది, 40 మంది రెవెన్యూ సిబ్బందిని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ప్రథమ స్థాయి పరిశీలన(ఎఫ్ఎల్సి)కు వినియోగిస్తున్నమని, వైయస్సార్ సిపి పార్టీ అనిల్, అమృతరాజు, సిపిఎం ప్రతినిధి పూల నరసింహులు, సిపిఐ రంగనాయుడు, కాంగ్రెస్ పార్టీ సయ్యద్ రియాజ్, తెలుగుదేశం పార్టీ శివరామిరెడ్డి, నంద్యాల తాసిల్దార్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పరిశీలనకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయండి....
జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్
Post A Comment:
0 comments: