భవ్య శ్రీ ని హత్య చేసిన మానవ మృగాలని వెంటనే ఉరి తీయాలి... ఎస్ఎఫ్ఐ, సీఐటీయూ నాయకుల డిమాండ్

 భవ్య శ్రీ ని హత్య చేసిన మానవ మృగాలని వెంటనే ఉరి తీయాలి

ఎస్ఎఫ్ఐ, సీఐటీయూ నాయకుల డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం లోని పాణ్యం స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు చిత్తూరు జిల్లా  పెనుమలూరు కీ చెందిన భవ్య శ్రీ ని హత్య చేసిన మానవ  మృగాలను వెంటనే శిక్షించి భవ్య శ్రీ ఆత్మ కు శాంతి చేకూర్చాలని ర్యాలీ నిర్వహించి భవ్యశ్రీ ని హత్య చేసిన మానవ మృగాలను ఉరి తీసి,భవ్య శ్రీ ఆత్మ కు శాంతి చేకూర్చాలని మౌనం పాటించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి  వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భారత విద్యార్ధి ఫెడరేషన్  ఎస్ఎఫ్ఐ నంద్యాల జిల్లా సహాయ కార్యదర్శి బత్తిని ప్రతాప్ మాట్లాడుతూ  ఇంటర్  చదువుతున్న విద్యార్థిని కొంతమంది నాలుగు రోజులపాటు దారుణంగా నరకం చూపించి హత్య చేయడం దారుణంమని, సమాజంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని,వారం రోజులు అవుతున్న జరిగిన సంఘటన బాధతో మర్చిపోలేకపోతున్నామని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ వ్యవస్థ తగు చర్యలు తీసుకోని పోలీస్ వ్యవస్థ పై ప్రజలకు మరింత నమ్మకం కలిగించేలా వ్యవహరించాలని, చదువుకునే అమ్మాయిని అత్యంత దారుణంగా హత్య చేయడం వల్ల విద్యార్థినులు చదువుకోవడానికి  బయటకు రావాలంటే భయపడే పరిస్థితిలు ఏర్పడుతున్నాయని,


నేటికి సమాజంలో ఇలాంటి సంఘటనలు.జరగడం దారుణమనీ,రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపించి భవ్య శ్రీ కుటుంబానికి  న్యాయం చేకూర్చాలని,ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండెందుకు ప్రభుత్వం మరియు పోలీస్ అధికారులు తగుచర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి భాస్కర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.



Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: