పట్టాలు ఇచ్చారు స్థలాలు ఇవ్వలేదు.....పేద ప్రజల సొంత ఇంటి కల నేరవేర్చాలి.... ఆర్విఫ్, ప్రగతిశీల విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్

 పట్టాలు ఇచ్చారు స్థలాలు ఇవ్వలేదు.....పేద ప్రజల సొంత ఇంటి కల నేరవేర్చాలి 

ఆర్విఫ్, ప్రగతిశీల విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలంలోని స్థానిక ఓర్వకల్లు గ్రామంలో సర్వేనెంబర్ 532/Cలో  దాదాపు 600 మంది నిరుపేదలకు పట్టాలు ఇచ్చారనీ, పట్టాలిచ్చిన వారికి స్థలం చూపించాలని రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (అర్విఎఫ్) అద్వర్యంలో  ఓర్వకల్లు మండల తాశిల్దార్ శివ ప్రసాద్ రెడ్డికి వినతి పత్రం అందజేసిన అనంతరం రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (అర్విఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ రవీంద్రనాథ్, ప్రగతిశీల విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయ్యన్న లు మాట్లాడుతూ  ఓర్వకల్లు గ్రామంలో  సెంటు స్థలం లేని నిరుపేదలకు దళితులు, మైనార్టీలు, వెనుకబడిన తరగతుల వర్గాల వారికి మరియు పెద ప్రజలకు 600 మందికి  పైగా ఒక్కొక్క లబ్ధిదారునికి 1.1/2 సెంట్ల ప్రకారం గడప గడప కార్యక్రమంలో లబ్ది దారులకు ఇంటి పట్టాల పంపిణీ చేశారని, కానీ వారికి ఇప్పటివరకు స్థలం చూపించడంలో రెవెన్యూ అధికారులు విఫలం అయ్యారని, స్థలం  లేని నేటి లబ్ధిదారులకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇస్తామని, ఇంటి స్థలం లేని నిరుపేదలు ఆంధ్రప్రదేశ్ లో ఉండకూడదని అన్నారని, కానీ ఓర్వకల్లు లో ఇంటి పట్టాలు ఇచ్చారు కానీ స్థలాలు చూపించ లేదని పేదవారి సొంత ఇంటి కల నెరవేరాలంటే తక్షణమే రెవిన్యూ అధికారులు సర్వే నెంబర్ 532/c లో లే అవుట్ లు వేసి ఇంటి పట్టాలు ఇచ్చిన లబ్ది దారులకు స్థలాలు ఇవ్వాలని  తాశిల్దార్ శివ ప్రసాద్ రెడ్డికి వినతి పత్రం అందజేయగా స్పందించిన ఎమ్మార్వో శివ ప్రసాద్ రెడ్డి 10 లేదా 15 రోజులలో లే అవుట్ వేసి పెద ప్రజల సొంత ఇంటి కలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముని స్వామి విష్ణు, రామ్, ధను రాజు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: