విద్యుత్ స్టేషన్ తనిఖీ చేసిన... నంద్యాల రూరల్ ఏడి సతీష్ కుమార్ రెడ్డి

 విద్యుత్ స్టేషన్ తనిఖీ చేసిన... 

నంద్యాల రూరల్ ఏడి సతీష్ కుమార్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ ను నంద్యాల రూరల్ ఏడి సతీష్ కుమార్ రెడ్డి తనిఖీ నిర్వహించి, సంబంధిత రికార్డులను పరిశీలించి, విద్యుత్ సబ్ స్టేషన్ నుండి వ్యవసాయ రంగానికి అందిస్తున్న విద్యుత్ సరఫరా పై ఆరా తీశారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో కానీ వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో కానీ ఏమైనా సమస్యలు తలెత్తిన వెంటనే స్థానిక ఏఈ గారికి లేదా తనకు తెలియజేసిన వెంటనే పరిష్కరిస్తామని, ఒకవేళ పరిష్కారం కానీ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామని,


విద్యుత్ ఉత్పత్తి మరియు పంపిణీ వ్యవస్థలో సాంకేతిక కారణాలు తలెత్తినప్పుడు మాత్రమే రెండు లేదా మూడు రోజులు  విద్యుత్ అంతరాయం కలుగుతుందని, రెండు లేదా మూడు రోజుల అనంతరం వ్యవసాయరంగానికి పూర్తిగా విద్యుత్ సరఫరా అందించడంతోపాటు గృహ అవసరాలకు కూడా ఎలాంటి అవాంతరం లేకుండా విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందని, రైతుల వ్యవసాయ విద్యుత్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెచ్ వి డి సి పనులు అక్కడక్కడ నిలిచిపోయాయని రైతులు ఇబ్బంది పడుతున్నారని ప్రశ్నించగా ప్రస్తుతం హెచ్ వి డి సి కి సంబంధించి పునరుద్ధరించడానికి అనుమతులు మంజూరు కావాల్సి ఉందని తెలిపారు. ఈ తనిఖీల్లో ఏఈ ప్రభాకర్ రెడ్డి, జెఏఈ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: