నా విజయానికి సహకరించండి పార్టీ నేతలు, కార్యకర్తలను కోరిన బీజేపీ అభ్యర్థి ఊరడి సత్యనారాయణ

 నా విజయానికి సహకరించండి

పార్టీ నేతలు, కార్యకర్తలను కోరిన బీజేపీ అభ్యర్థి ఊరడి సత్యనారాయణ

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

తన విజయానికి పార్టీ నేతలంతా సహకరించాలని  చంద్రయనగుట్ట అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఊరడి సత్యనారాయణ కోరారు. శుక్రవారంనాడు చంద్రయనగుట్ట అసెంబ్లీ రియాసత్ నగర్ డివిజన్ లో ఊరడి సత్యనారాయణ బీజేపీ పార్టీ డివిజన్ కార్యకర్తలను, స్థానిక బస్తీ పెద్దలను కలిసి మద్దతు కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో  అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ గంజి వేణు, డివిజన్ అధ్యక్షులు శివ కాంత్,  అర్జున్ శేఖర్ రెడ్డి, గోపి తదితరులు పాల్గొన్నారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: