అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు....
ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం.....గౌరు దంపతుల వెల్లడి
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజక వర్గంలోని స్థానిక టిడిపి కార్యాలయంలో నందికొట్కూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ గౌరు వెంకటరెడ్డి, పాణ్యంనియోజకవర్గంలోని నంద్యాల చెక్ పోస్ట్ సర్కిల్ నందు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించిన అనంతరం విలేకరుల సమావేశంలో గౌరు దంపతులు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబు నాయుడుపై వ్యవస్థలను అడ్డుపెట్టుకొని అక్రమ కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపులు చేస్తున్నారని, స్కిల్ డెవలప్మెంట్,ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్ అంటూ ఒకదాని తర్వాత ఒకటి కేసులు పెడుతున్నారని,
టిడిపి హాయంలో ఆరు లక్షల కోట్ల అవినీతి జరిగిందని వైసీపీ నేత వైఎస్ జగన్ వైసీపీ నాయకులు చెబుతున్నారని కానీ ఇంతవరకు 60 రూపాయల అవినీతి కూడా చూపించలేకపోతున్నారని టిడిపి హయంలో యువత నైపుణ్యాభివృద్ధి కొరకు మెరుగుపరచడానికి స్కిల్ డెవలప్మెంట్ తీసుకొని వస్తే యువత నైపుణ్యాభివృద్ధి నీరు గాడ్చెందుకు రాజకీయ కక్షతో యువతకు ఉపాధి లేకుండా నిర్వీర్యం చేసేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, కేసు రిమాండ్ రిపోర్టు లోని 16వ పేజీలో 145.37 కోట్లు అని,మరో పేరాలో 279 కోట్లని,పేజి నెంబర్ 21 లో అసలు ఈ సొమ్మంతా ఎవరి ఖాతాలోకి ఎటు పోయిందో తెలియదని సిఐడి అధికారులు చెప్తున్నారని,
సొమ్ము ఎంతో తెలియకుండా ఎవరి ఖాతాలో వెళ్లిందో తెలుపకుండా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశాడని ఎలా అంటున్నారని,ఫైబర్ పై ఖర్చు 280 కోట్లుని, ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 900 కోట్లు కోట్లని,రాష్ట్ర ప్రజలకు 149 రూపాయలకే ఇంటర్నెట్, ఫోన్,టీవీ చానల్ల సౌకర్యం కల్పించారని,ఫైబర్ నెట్ అండర్ గ్రౌండ్ కేబుల్స్ కొరకు 5 వేలకోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారని,అండర్ గ్రౌండ్ కేబుల్స్ కు అంత ఖర్చు వద్దని కరెంటు స్తంభాలను వాడుకొని ఐదువేల కోట్ల ఖర్చును 330 కోట్లకు చంద్రబాబు తగ్గించి, చివరకు 328 కోట్లకు టెండర్లను ఖరారు చేశారని,
ఇందులో ఏలాంటి అవినీతి జరగకుండా కేవలం రాజకీయ కక్ష సాధింపుతోనే చంద్రబాబు నాయుడు గారి పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని,దళితున్ని చంపి డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుకు బెయిలు మంజూరయి బయట తిరుగుతున్నారని, నిరపరాధి అయిన చంద్రబాబు నాయుడు గారిని వ్యవస్థలను అడ్డుపెట్టుకొని బెయిలు మంజూరు కాకుండా చేస్తున్నారని,వైసిపి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పై పెట్టిన ఏ ఒక్క కేసు కూడా నిరూపించుకోలేరని,అక్రమ కేసులు ఎన్ని పెట్టిన భయపడే ప్రసక్తే లేదని రాబోయే ఎన్నికల ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని తెలిపారు.ఈకార్యక్రమంలో నందికొట్కూరు నియోజకవర్గం లోని టిడిపి నాయకులు,అభిమానులు పాణ్యంనియోజకవర్గంలోని టిడిపికార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.
అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు....
ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం.....గౌరు దంపతుల వెల్లడి
Post A Comment:
0 comments: