జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి.... జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమున్

 జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి

జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమున్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలనుఅలవర్చుకుని ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ తెలుపుతూ మహాత్మా గాంధీ 154 వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ లోని మహాత్మా గాంధీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ తో పాటు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి,నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిషా తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ అహింసా మార్గంలో నడిచి దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో కీలక పాత్ర పోషించిన జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను అలవర్చుకుని ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాలని,


మహాత్మా గాంధీ జీవితం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని, గాంధీ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా మహనీయుడిని తలచుకోవడం జరుగుతోందని, గాంధీ మహాత్ముడు నేర్పించిన సిద్ధాంతాలు,ఆదర్శాలను ఆదర్శంగా తీసుకోవడంతో పాటు భావితరాలవారు తప్పకుండా పాటించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరుతూ ప్రజలందరికీ మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య సంకల్పాన్ని సాకారం చేసిన ఏకైక వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు.గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్న సదుద్దేశంతో గ్రామాల్లోనే సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ సేవలు,సంక్షేమ పథకాలన్నీ ప్రజలందరికీ అందించడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి,రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసులు మరియు అధికారులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: