దేశ వ్యాప్తంగా బిసి కులగణన చేస్తాం........ సిడబ్ల్యూసి లో తీర్మానం... సంబరాలు జరుపుకున్న నంద్యాల పార్లమెంట్ డిసిసి అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ

 దేశ వ్యాప్తంగా బిసి కులగణన చేస్తాం........ 

సిడబ్ల్యూసి లో తీర్మానం... సంబరాలు జరుపుకున్న

నంద్యాల పార్లమెంట్  డిసిసి అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

దేశంలో బీసీల కుల జనగణనకు సిడబ్ల్యూసి ఏకగ్రీవంగా అంగీకారం తెలపడం సంతోషదాయకమని, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే,రాహుల్ గాంధీకి, రఘువీరారెడ్డి, పీసీసీ అద్యక్షులు గిడుగు రుద్రరాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణములో నంద్యాల పార్లమెంట్ డిసిసి అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు బాణా సంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు.


ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వెంటనే కులగణన చేపట్టాలని రాహుల్ గాంధీ గారు ఏఐసీసీ అధ్యక్షుడిని అడిగిన వెంటనే సిడబ్ల్యూసి తీర్మానం చేయించడం చాలా సంతోషమని,కాంగ్రెస్ పార్టీ 4 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే 3 రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారని,బీజేపి 10 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే కేవలం ఒక బీసీ ముఖ్యమంత్రి మాత్రమే ఉన్నారని,దేశంలో బీసీలు, ఎస్సీ,ఎస్టీల జనాభా తెలిస్తేనే వారి అభివృద్దికి, విద్య, వైద్యం ,ఆర్థిక, న్యాయానికి కృషి చేయడానికి మార్గాలు మరింత చేరువవుతాయని, విద్య,ఉద్యోగ,ఆర్థిక,రాజకీయ సమానత్వం రావాలంటే కుల గణన చేపట్టాలని,పార్లమెంట్ లో మహిళ బిల్లులో కూడా బిసి,ఎస్సి,ఎస్టీ,మైనారిటీ లకు కూడా సబ్ కోట రిజర్వేషన్లు కల్పించాలని కేవలం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, మరియు సమాజ్ వాదీ పార్టీ,డియంకె, ఆర్జేడీ, పార్టీలు మాత్రమే సబ్ కోటా రిజర్వేషన్లు కావాలని అడిగారనీ,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో అధికారంలో ఉన్న జగన్ రెడ్డి ప్రభుత్వం అడగలేదని,దేశములో 60%బిసి జనాభా ఉన్న విద్య,ఉద్యోగ, రాజకీయాలలో కేవలం 15% లోపలే ఉన్నారని, బిసి,ఎస్సి,ఎస్టీ, మైనారిటీ ప్రజలు ఇప్పటికైనా ఆలోచించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తేనే ఇందిరమ్మ రాజ్యం ఏర్పడి బీసీలకు,ఎస్సీలకు,ఎస్టీలకు,మైనార్టీలకు అన్ని రంగాల్లో సామాజిక న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈకార్యక్రమంలో నంద్యాల పట్టణఅద్యక్షులు చింతలయ్య,డిసిసి ప్రధానకార్యదర్శి డాక్టర్ మద్దులేటి స్వామి, మైనారిటీ సెల్ జిల్లా అద్యక్షలు పఠాన్,పీసీసీ ప్రధాన కార్యదర్శి మోహన్ రావు,రాష్ట్ర స్పోకెన్ పర్సన్ వాసు,ఎస్సి సెల్ జిల్లా అద్యక్షలు నాగలింగం, పాణ్యం కో ఆర్డినేషన్ సభ్యులు సాంబశివుడు, స్టేట్ సోషల్ మీడియా కన్వీనర్ లక్ష్మన్న, డోన్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శేఖర్,బాలకృష్ణ,షేక్షావలి తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: