భారతదేశ ఆధునిక సామాజిక సంఘ సంస్కర్తలు..... జ్యోతిరావుపూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల ఆవిష్కరణ

 భారతదేశ ఆధునిక సామాజిక సంఘ సంస్కర్తలు.,,,

జ్యోతిరావుపూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల ఆవిష్కరణ

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలో భారతదేశ ఆధునిక సామాజిక సంఘ సంస్కర్తలు,బహుజనుల ఆరాధ్య దైవం అయిన జ్యోతిబాపూలే సావిత్రిబాయిపూలే ల విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం కస్తూరిబా బాలికల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, మహిళా ఐక్య వేదిక నంద్యాలజిల్లా అధ్యక్షురాలు సునీత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నంరాజేశ్వరి, మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు విజయలక్ష్మీ, బీసీ సంక్షేమ సంఘం నాయకులు అన్వర్ హుస్సేన్, సాయి, మహిళా ఐక్యవేదిక రాయలసీమ అధ్యక్షురాలు భారతమ్మ పాల్గొన్నారు. ఎంఈఓ అనురాధ, స్కూల్ ప్రిన్సిపాల్ సునీత  మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ విద్యార్థులు సావిత్రిబాయిపూలే, జ్యోతిబాపూలేల అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆలోచన విధానంతో ముందుకు వెళ్లాలని వారు తెలిపారు.చదువుల తల్లి సావిత్రిబాయిపూలే జయంతి రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.ఆధునిక భారతదేశంలోనే మొట్ట మొదటి సామాజిక ఉద్యమకారులు మహాత్మా జ్యోతిరావుపూలే అని,


మహిళలనువిద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు తన భార్యనుఉపాధ్యాయురాలు గా తీర్చిన ఘనత పూలే గారిదేనని, జ్యోతిభాపూలేను గురువులుగా ప్రకటించుకొని డా బిఅర్ అంబేద్కర్ విద్యకు సంబంధించిన హక్కులు,రిజర్వేషన్లు మరియు మహిళల హక్కులు అన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరిచారని, సావిత్రిబాయి పూలే జయంతిని 
అధికారికంగా జరపాలని, సావిత్రిబాయి పూలే జయంతి రోజు జనవరి 3 వ తేదీని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.అనంతరంమహిళా ఐక్యవేదికరాష్ట్రఅధ్యక్షురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు పూలే దంపతులను ఆదర్శంగా తీసుకొని ఉన్నత చదువులు చదవాలని పిలువు నిచ్చారు.నాడు వారు ఏ యే సమస్యలపై పోరాడారో నేడు అవే సమస్యలు కొత్త రూపంలో వస్తున్నాయని వాటన్నింటిపై చదువుతూ పోరాడాలని ఆమె పిలుపు నిచ్చారు. మహనీయుల త్యాగాలను స్మరించుకుని ఆ స్ఫూర్తితో ప్రతి బహుజన బిడ్డ మరియు విద్యార్థులు ముందుకు వెళ్లాలని సూచించారు. ఈకార్యక్రములోస్కూలుఉపాధ్యాయులు మరియు మహిళా ఐక్యవేదిక నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి భాను,కర్నూలు టౌన్అధ్యక్షురాలు రాధ,ఉపాధ్యక్షురాలు పద్మావతి,సభ్యులు సరోజ,  లక్ష్మేశ్వరి, షేకూన్ బి, సుబ్బలక్ష్మి, వరలక్ష్మి, దిమ్మె దాతలు లక్ష్మి నారాయణ, సునీత తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: