మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన....
నందికొట్కూర్ ఏబీవీపీ నాయకులు
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం లోని స్థానిక నందికొట్కూర్ పట్టణంలో ఉన్న గాంధీ మెమోరియల్ స్కూల్ మరియు గర్ల్స్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని పరిశీలించిన ఏబీవీపీ నాయకులు. ఈసందర్భంగా ఏబీవీపీ కళామంచ జిల్లా కన్వీనర్ నాగరాజు మరియు భాను మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్భాటంగా జగనన్న గోరుముద్ద పథకాన్ని ప్రారంభించారని, జగనన్న గోరుముద్దలో నాణ్యత, నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించడంలో విఫలం అయ్యారని, సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు మరియు పాఠశాల విద్యార్థులకు సన్న బియ్యం సరఫరా చేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగిందని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇప్పటివరకు విద్యార్థులకు ఎలాంటి సన్న బియ్యం సరఫరా చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, మార్కెట్లో ఉన్న నిత్యవసర సరుకులకు అనుగుణంగా విద్యార్థుల మెస్ బిల్లులు పెంచి విద్యార్థులకు నాణ్యతతో కూడిన జగనన్న గోరుముద్ద పథకాన్ని అమలు చేయాలని, విద్యా సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు గడుస్తున్నా సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేక అనేక రకాలైన ఇబ్బందులను విద్యార్థులు ఎదుర్కొంటున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్ హాస్టళ్లకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లోనే కొనసాగిస్తున్నారని, ఇప్పటికైనా నూతన భవనాలను ఏర్పాటు చేసి విద్యార్థుల కాస్మోటిక్ మరియు మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హరినాథ్, యుగంధర్, భార్గవ్ మరియు ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన....
నందికొట్కూర్ ఏబీవీపీ నాయకులు
Post A Comment:
0 comments: