తిరుమలగిరి ఎస్టేట్ యజమాన్యం బీకేసింగ్ ప్రభుత్వ భూములు... భూకబ్జాలు...అక్రమ ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలి.... సిపిఐ నాయకుల వినతి

 తిరుమలగిరి ఎస్టేట్  యజమాన్యం బీకేసింగ్ ప్రభుత్వ భూములు... 

భూకబ్జాలు...అక్రమ ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలి....

సిపిఐ నాయకుల వినతి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాలో తిరుమలగిరి ఎస్టేట్. అగ్రసేని ఎస్టేట్ పేర్లతో రియల్ ఎస్టేట్ యజమాని బికే సింగ్ ప్రభుత్వ భూములను భూకబ్జాలు చేసి వెంచర్లు ద్వారా ప్రభుత్వ ఖజానాను గండి కొడుతున్న బికే సింగ్ అక్రమ ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని, ఆత్మకూరు ఆర్డీవో మురియాందాస్ ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగాలను లక్షల రూపాయలకు అమ్ముకుంటూ అవినీతికి పాల్పడుతున్నారని, జిల్లా ఉన్నతా అధికారులతో ఎంక్వైరీ కమిటీ వేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమంలోని డిఆర్ఓ పుల్లయ్యకు డిమాండ్స్ తో కూడిన వినతి పత్రం అందజేశామని తెలిపారు. ఈసందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్, సిపిఐ జిల్లా కార్యవర్గ  సభ్యులు ధనుంజయుడు, సిపిఐ పట్టణ సహయ కార్యదర్శి సోమన్న, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సుబ్బరాయుడు, ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ నంద్యాల జిల్లా కలెక్టర్ రెవెన్యూ  యంత్రాంగాన్ని సక్రమమైన పద్ధతిలో నడుపుతూ ప్రజా పాలన నిర్వహిస్తుంటే కొంతమంది రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడుతూ భూకబ్జాలు చేసే వారికి వత్తాసు పలుకుతు, అక్రమమైన పద్ధతిలో ప్రభుత్వ ఉద్యోగాలను అమ్ముకుంటూ ప్రభుత్వ ఖజానాను గండి కొడుతున్నారని


అందులో ఆత్మకూరు ఆర్డీవో మురియందాస్, పాణ్యం మండల తహసిల్దార్ కార్యాలయంలోని కొంతమంది రెవెన్యూ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అవినీతికి పాల్పడి ప్రభుత్వ భూములను అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారి బీకేసింగ్ ఉమ్మడి జిల్లాలో తిరుమలగిరి ఎస్టేట్, అగ్రసేని ఎస్టేట్ పేర్లతో అవినీతికి పాల్పడుతున్న రెవెన్యూ అధికారులను తన చెప్పు చేతుల్లోకి తీసుకుంటూ భూకబ్జాలు చేస్తున్నాడని, జిల్లా ఉన్నతాధికారులు బికే సింగ్ అక్రమ ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని, ప్రభుత్వ ఉద్యోగాలను అవినీతికి పాల్పడుతూ అమ్ముకుంటున్న ఆత్మకూరు ఆర్డీవో మురియందాస్ పై ఎంక్వైరీ కమిటీ వేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో సిపిఐ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని బికే సింగ్ భూకబ్జాలు చేసి ఆక్రమించిన  ప్రభుత్వ భూములలో ఎర్రజెండాలు పాతి పేద ప్రజలకు స్థలాలను అందజేస్తామని హెచ్చరించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: