పసుపుబోర్డు ప్రకటించినందుకు,,,,, బీజేపీ ఆధ్వర్యంలో మోడీకి పాలాభిషేకం,,,, బీజేపీనేత ఆనంద్ గుప్తా ఆధ్వర్యంలో పసుపు సంబరాలు

 పసుపుబోర్డు ప్రకటించినందుకు

బీజేపీ ఆధ్వర్యంలో మోడీకి పాలాభిషేకం

బీజేపీనేత ఆనంద్ గుప్తా ఆధ్వర్యంలో పసుపు సంబరాలు

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ పసుపుబోర్డును ప్రకటిచిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ నేతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో బహదూర్ పుర అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డి. ఆనంద్ గుప్తా ఆధ్వర్యంలో  ఆ పార్టీ నేతలు పసుపు సంబరాలు చేసుకొన్నారు. ఈ సందర్బంగా ప్రధాని నరేంద్రమోడీ చిత్రపటానికి వారు పాలాభిషేకం చేశారు. అనంతరం బీజేపీ నేతలు  పసుపు సంబరాలు  చేసుకొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి పసుపు బోర్డు ప్రకటించినందుకు ప్రధాని నరేంద్రమోడీకి ఈ సందర్బంగా ఆనంద్ గుప్తా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ఎన్. ప్రశాంత్, ధర్మతెజ, నరేష్, నిరంజన్ కుమార్, బిట్టు, సుమింత్,  ప్రమోద్ తోపాటు బహదూర్ పుర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు. 

 









Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: