జాతిపిత మహాత్మ గాంధీకి....లాల్ బహదూర్ శాస్త్రికి,,,
ఎస్.పి.క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ఘననివాళ్లులు
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
జాతిపిత మహాత్మ గాంధీ 154వ జయంతి మరియు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 119వ జయంతి సందర్భంగా యువజన కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి ఎస్.పి.క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో గౌలిపురా గాంధీ విగ్రహం వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి, శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా క్రాంతి కుమార్ మాట్లాడుతూ జాతిపిత మహాత్మ గాంధీ అహింస మార్గంలో భారత దేశ స్వాతంత్య్ర ఉద్యమాన్ని ముందు ఉండి నాడిపించారని, అలాగే మచ్చలేని నాయకుడిగా, జై జావాన్ జై కిసాన్ నినాదంతో దేశ అభ్యున్నతికి కృషి చేసిన మాజీ ప్రధాని శాస్త్రి సేవలను ప్రజాలు ఏనాటికీ మరువరని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జి.నవీన్ కుమార్, బి.కోటేష్, జి.భాను ప్రసాద్, చంద్రకాంత్, ఎస్.ప్రణీత్, స్థానికులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
జాతిపిత మహాత్మ గాంధీకి....లాల్ బహదూర్ శాస్త్రికి,,,
ఎస్.పి.క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ఘననివాళ్లులు
Post A Comment:
0 comments: