కృష్ణా జలాల నీటి పంపకంలో రాయలసీమకు తీవ్ర నష్టం,..... మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి

 కృష్ణా జలాల నీటి పంపకంలో రాయలసీమకు తీవ్ర నష్టం,..... 

మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి

(జానో జాగోె వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

రాయలసీమ ప్రాంతానికి చెందిన సీఎం జగన్ మోహనరెడ్డి కృష్ణా నీటి వాడుకలో సీమకు అన్యాయం జరుగుతున్న స్పందించక పోవడం దారుణమని నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి విమర్శించారు.నంద్యాల పట్టణంలోని తన స్వగృహంలో ఏర్పాటుచేసిన సమావేశంలో విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కృష్ణాజిల్లాలను 811 టీఎంసీలను కేటాయించారని, అనంతరం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కృష్ణనది జలాలను 512టీఎంసీలను ఆంధ్రాకు,299 టీఎంసీలు తెలంగాణకు కేటాయించారని, ఆంధ్రాలో పోలవరం జాతీయ ప్రాజెక్టును నిర్మిస్తున్నందున కృష్ణా,ప్రకాశం బ్యారేజ్ లో మిగులు 80 టీఎంసీలను, కర్ణాటకకు 21 టీఎంసీలను, మహారాష్ట్రకు 14 టీఎంసీలను కేటాయించి సీమకు అన్యాయం చేశారని,మళ్ళీ ఇప్పుడు 80 టీఎంసీలలో ఎగువ రాష్ట్రాలకు 35 టీఎంసీలు పోను మిగిలిన 45 టీఎంసీలలో కూడా సగంవాటాను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో ఉండగానే  తెలంగాణ ప్రభుత్వం 45 టీఎంసీలలో సగం నీటిని కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందని,పోలవరం నిర్మాణానికి 7 మండలాలను ఇచ్చామని కాబట్టి మాకు నీటి కేటాయింపులు చేయాలనీ చాలాకాలం నుండి కోరుతున్నారని తెలుపగా కేంద్రం కృష్ణా జలాలను సమీక్సించమని జీవో విడుదల చేసిందని,కృష్ణా జలాల పంపిణీ వల్ల సీమ రైతులు తీవ్రంగా నష్ట పోతారని తెలిసి కూడా సీఎం జగన్మోహనరెడ్డి నోరు మెడపక పోవడం దారుణమని,


అంబటి రాంబాబు ఈ జివో పై సుప్రీంకోర్టుకు పోతామని హడావుడి చేశారని,కానీ ఆచరణలో మాత్రం చేయలేదని,తెలంగాణ ప్రభుత్వం ఈవిషయం పై ఆంధ్ర కంటే ముందే కెవియట్ పిటిషన్ వేసిందని,ఆంధ్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల స్టే వచ్చే అవకాశాలు కూడా ఇప్పుడు లేకుండా పోయాయని,సీమ రైతులకు సాగు నీటి విషయంలో అన్యాయం జరుగుతున్న అధికారపార్టీ ప్రజాప్రతినిధులు స్పందించకపోవటం సిగ్గు చేటని,ఇప్పటికైనా రైతులకు అన్యాయం జరగకుండా కేంద్రం సంబందిత అధికారులతో చర్చలు జరపాలని, లేకపోతే ప్రస్తుత అధికార పార్టీ నాయకులు సీమ ద్రోహులుగా మిగిలి పోతారని తెలిపారు. ఈకార్యక్రమంలో రైతులు సంఘం నాయకులు బాలీశ్వర్ రెడ్డి,గోపాల్ రెడ్డి,రవి బాబు,గురునాధ్ రెడ్డి, మహేంద్ర రెడ్డి, పెద్దకొట్టాల కొండా రెడ్డి,లాయర్ మనోహర్ రెడ్డి మరియు రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: