ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ప్రథమ స్థాయి పరిశీలన పకడ్బందీగా చేపట్టండి... రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా

 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ప్రథమ స్థాయి పరిశీలన పకడ్బందీగా చేపట్టండి...

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ప్రథమ స్థాయి పరిశీలన (ఎఫ్ఎల్సి) ప్రక్రియ పగడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. ఎలక్షన్ కమిషన్ కార్యాలయం నుండి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ప్రథమ స్థాయి పరిశీలన (ఎఫ్ఎల్సి) ప్రక్రియపై అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.నంద్యాల జిల్లా కలెక్టరేట్ లోని  వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్  డా.మనజిర్ జిలాని సమూన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ పుల్లయ్య,జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి,ఎన్నికల విభాగపు అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.ఈసందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ప్రథమ స్థాయి పరిశీలన (ఎఫ్ఎల్సి) ప్రక్రియను ఈ నెల 16వ తేది నుండి ప్రారంభించేందుకుఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని, దాదాపు 20 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఎలాంటి చిన్న పొరపాట్లకు తావివ్వకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లను సూచించారు.బెల్ ఇంజనీర్లు,రాజకీయ పార్టీ నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమం జాగ్రత్తగా చేపట్టాలన్నారు.జిల్లాకు వచ్చిన బ్యాలెట్ యూనిట్లు,కంట్రోల్ యూనిట్లు,వివి ప్యాట్లకు సంబంధించి రాజకీయ పార్టీ ప్రతినిధులు లేవనెత్తిన అంశాలను పూర్తి స్థాయిలో పరిష్కరించి అవగాహన కల్పించాలని,


ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఫస్ట్ లెవెల్ చెక్ (ఎఫ్ఎల్సి) ప్రక్రియను సీసీ కెమెరాలతో రికార్డు చేయడంతో పాటు  వీడియోగ్రఫీ కూడా చేయించాలని,పరిశీలన కార్యక్రమంలో పాల్గొనే సిబ్బందికి గుర్తింపు కార్డులు తప్పక జారీ చేయాలని 
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం నంద్యాల జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ ఈనెల 16 నుండి ప్రారంభమయ్యే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ప్రధమ పరిశీలనప్రక్రియను(ఎఫ్ఎల్సి) పకడ్బందీగా చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డిని ఆదేశించారు. 20 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 09:00 గంటల నుండి సాయంత్రం 07:00 గంటల వరకు నిర్వహించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు సంబంధిత సిబ్బంది తప్పనిసరిగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని,విధులు నిర్వహించే సిబ్బంది అందరికీ గుర్తింపు కార్డుల జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిఆర్ఓ మరియు డిప్యూటీ సీఈఓ లను కలెక్టర్ మనజీర్ జిలాని సామున్ ఆదేశించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: