ప్రాధాన్యత కార్యక్రమాలపై ప్రత్యేకదృష్టిసారించండి ...
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి లక్ష్యం మేరకు ఫలితాలు సాధించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను సూచించారు.వ్యవసాయం, పశుసంవర్ధక,డెయిరీ డెవలప్మెంట్,రెవెన్యూ, రీసర్వే,జాతీయ రహదారులకు భూసేకరణ, ఎంపీఎఫ్సి గోడౌన్ లకు భూ కేటాయింపు,ప్రాధాన్యత భవనాలు,ఉపాధి హామీలో వేజ్ జనరేషన్,జల్ జీవన్ మిషన్,జగనన్నకు చెబుదాం తదితర అంశాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించి ఆయా అంశాలలో దిశా నిర్దేశం చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయం నుండి ఇంచార్జి కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి,కలెక్టరేట్ ఛాంబర్ నుండి డిఆర్ఓ పుల్లయ్య ఇతర జిల్లా అధికారులు సిఎస్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.ఈసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలైన జగనన్న లేఅవుట్లలో గృహ నిర్మాణాలు,ప్రాధాన్యత భవనాల నిర్మాణాల పనులు పెండింగ్ లేకుండా త్వరితగతిన పూర్తి చేసేలా అన్ని చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సూచించారు.
రబీ సీజన్ లో రైతులకు అవసరమైన విత్తనాలను రాయితీపై పంపిణీ చేయాలని,పెండింగ్ లో ఉన్న రైతుల ఈ క్రాప్ బుకింగ్,ఈకేవైసీ పూర్తి చేయించాలని,ఉపాధి హామీ పథకం క్రింద కూలీలకు పనులు కల్పిస్తూ సకాలంలో బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని,జగనన్నకు చెబుదాం - స్పందన కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదుల దారుల సమస్యలు త్వరితగతిన ఫిర్యాదులు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కరించాలని కలెక్టర్లను సూచించారు.
ప్రాధాన్యత కార్యక్రమాలపై ప్రత్యేకదృష్టిసారించండి ...
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి
Post A Comment:
0 comments: