సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి
సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తమ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని,లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని,వైకాపా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు హెచ్చరించారు.నంద్యాల జిల్లా సిపిఐకార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ సిపిఐపార్టీ బాధ్యతాయుత ప్రతిపక్ష పార్టీగా కేంద్ర,రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తుందని, ప్రజల కోసం నిరంతరం ఉద్యమిస్తుందని అటువంటి పార్టీపై సజ్జల రామకృష్ణారెడ్డి కమ్యూనిస్టులు టిడిపికి అమ్ముడుపోయారని అనడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. కమ్యూనిస్టులను కొనగలిగే సత్తా ఈ భూమి మీద ఎవరికి లేదని,వైకాపాకు అనుకూలంగా మాట్లాడితే ఒక రకంగా,వ్యతిరేకంగా మాట్లాడితే మరోరకంగా ద్వందర్ధాలు తీయడం సజ్జలకే చెల్లింని,ప్రజావేదిక కూల్చినప్పుడు తాము తప్పు పట్టామని, ఇసుకను ఇష్టారాజ్యాంగ అమ్ముకున్నారని,జగన్ పాత్ర ఇందులో ఉందని అందుకే ఇసుక మాఫియా రెచ్చిపోతుందన్నారని, మద్యపానం నిషేధిస్తామని చెప్పి మద్యం మాఫియాతో కోట్లు గడుస్తున్నారని, నంద్యాలలో తెల్లవారు జామున అడ్డగోలుగా ఒక బందిపోటునో,టెర్రరిస్టునో అరెస్ట్ చేస్తున్నట్లు చంద్రబాబును అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని,
ప్రతిపక్షాల గొంతు నొక్కడం జగన్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని,స్కిల్స్ స్కాం, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ జరిగి ఉంటే నాలుగున్నర సంవత్సరాల పాటు ఎందుకు చర్యలు తీసుకోలేదని,25 ఎంపీ సీట్లు ఇస్తే జగన్ ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి ప్రస్తుతం ఎందుకు తెలేదని, కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన అన్నిటికీ చేయొచ్చుతూ జై కొడుతున్న జగన్ కేంద్రం నుండి ఎంత లబ్ధి పొందాడో చెప్పాలని, అంగన్ వాడీలు విజయవాడలో ర్యాలీ పెడితే ఎక్కడికక్కడ అరెస్టు చేశారని,అగ్రిగోల్డ్ బాధితుల ధర్నా అనుమతి రద్దుచేసి ఇబ్బందులు పెట్టారని,ఆటో వాళ్లకు 10,000/- ఇచ్చి లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారని,300 యూనిట్ల విద్యుత్ దాటితే సంక్షేమ పథకాలు రద్దవుతున్నాయని,మోడీ చెప్పినప్పుడల్లా తమ ఎంపీలు చెయ్యి ఎత్తెందుకు ఎంత ప్యాకేజీ తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.రానున్న రోజుల్లో కలిసి వచ్చే పార్టీలతో ప్రజా పోరాటాలు కొనసాగిస్తామని ఆయన స్పష్టంచేశారు.ఈసమావేశంలో సిపిఐ రాష్ట్రకార్యవర్గ సభ్యులురామాంజనేయులు, సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు,సహాయ కార్యదర్శి బాబాఫకృద్దిన్, పట్టణ కార్యదర్శి ప్రసాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు రఘురాం మూర్తి,భాస్కర్ సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి సోమన్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.
సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి....
సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు
Post A Comment:
0 comments: