మహిళలు ఆర్థికంగా భలోపేతం కావాలి.... శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ చైర్పర్సన్ నాగినిరవిసింగారెడ్డి

 మహిళలు ఆర్థికంగా భలోపేతం కావాలి....

శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ చైర్పర్సన్ నాగినిరవిసింగారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాలోని పేదింటి మహిళలు ఆర్థికంగా భలోపేతం కావాలని,స్వయం సంవృద్ధి సాధించి తమ కాళ్లపై తాము నిలబడేందుకు తమ వంతుగా శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ ద్వారా రుణాలను అందించడంజరుగుతుందని,ఈ రుణాలను లబ్ధిదారులైన మహిళలు సద్వినియోగం చేసుకోవాలని శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి కోరాతూ 120 మంది మహిళలకు 15 లక్షల 50వేల రుణాలను పంపిణీచేశారు.ఈ సందర్భంగా శిల్పామహిళా సహకార్ బ్యాంక్ చైర్పర్సన్ నాగినిరవిసింగారెడ్డి మాట్లాడుతూ


పేదింటి మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకు నంద్యాలలో శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ బ్యాంక్ ద్వారా పేద మహిళలకు తక్కువ వడ్డీతో రుణాలను అందజేస్తూ ఆర్థిక స్వావలంభనకు, సాధికారతకు తమ వంతు కృషి చేస్తున్నామని, మహిళలు స్వయం సంవృద్ధి సాధించి తమ కాళ్లపై తాము నిలబడినపుడే కుటుంబం, సమాజం అభివృద్ధి సాధించినట్లవుతుందని,రుణాలు పొందిన మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ,మేనేజర్ హరిలీల,సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: