చట్టసభల్లో "వై నాట్ నో ఎంట్రీ"....
గడివేముల నూర్ భాషా/దూదేకుల సంఘం నాయకుల డిమాండ్
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం కేంద్రంలో గడివేముల నూర్ భాషా/దూదేకుల సంఘం నాయకులు గడివేముల మాజీ సర్పంచ్ జమాల్ భాష, వాటర్ ప్లాంట్ ఆర్మీ జమాల్ బాషాల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గడివేముల మాజీ సర్పంచ్ జమాల్ బాషా, వాటర్ ప్లాంట్ ఆర్మీ జమాల్ బాషా మాట్లాడుతూ
భారతదేశానికి స్వసంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయినప్పటికీ ఇంతవరకు దూదేకులు చట్టసభల్లో అడుగుపెట్ట లేదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 20 లక్షలకు పైగా దూదేకులు ఉన్నారని, అలాంటి దూదేకుల వారికి చట్టసభల్లో రాజకీయ పార్టీలు ఎందుకు సీట్లు కేటాయించడం లేదని ప్రశ్నించారు.జనాభా దామాషా ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు దూదేకులకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని,మైనార్టీ పదవుల్లో వర్గీకరణ దామాషా ప్రకారం దూదేకులకు పదవులు మరియు బడ్జెట్ తప్పనిసరిగా కేటాయించాలని,
రానున్న ఎన్నికల్లో దూదేకుల వారికి ఏ రాజకీయ పార్టీ అయితే సముచిత స్థానం కల్పిస్తుందో ఆ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని తెలిపిన అనంతరం 29-10-23 వ తేదీన గుంటూరులో జరిగే నూర్ భాషా/దూదేకుల ముస్లిం సింహగర్జన గోడ పత్రికను విడుదల చేసి,దూదేకుల సింహగర్జన మహాసభకు గడివేముల మండలం నుండి దాదాపు 500 మందితో బయలుదేరి వెళుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గడివేముల మండలం దూదేకుల సంఘం నాయకులు మాజీ సర్పంచ్ జమాల్ బాషా,వాటర్ ప్లాంట్ ఆర్మీ జమాల్ బాషా, టీచర్ మహబూబాషా, ఐలన్న,సుభాన్,యాకుబ్ వలి,యాసీన్,సోఫీ,చంటి, భాష తదితరులు పాల్గొన్నారు.
చట్టసభల్లో "వై నాట్ నో ఎంట్రీ"....
గడివేముల నూర్ భాషా/దూదేకుల సంఘం నాయకుల డిమాండ్
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా పాణ్
Post A Comment:
0 comments: