ఓర్వకల్లు మండలంలోని పరిశ్రమల్లో,,,
యువతకు 75% ఉపాధి,ఉద్యోగ అవకాశాలుకల్పించాలి .....
ఆర్విఎఫ్,పిఎస్యు నాయకులు డిమాండ్
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని స్థానిక ఓర్వకల్లు మండల పరిధిలో ప్రారంభమైన అన్ని పరిశ్రమల్లో గడివేముల, పాణ్యం,మండలాల్లో ఏర్పాటైన నూతన పరిశ్రమల్లో స్థానిక యువతకు 75% ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని రాయలసీమ రవీంద్ర నాథ్,ప్రగతిశీల విద్యార్థి సంఘం నాయకుడు అయ్యన్న డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (అర్విఎఫ్ ) ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (అర్విఎఫ్)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ రవీంద్ర నాథ్.ప్రగతిశీల విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయ్యన్నలు మాట్లాడుతూ పాణ్యం నియోజవర్గం పీన్నాపురం, ఓర్వకల్లు లో కోన్ని వేల ఎకరాల్లో సోలార్,సిలికాన్, ఎయిర్పోర్టు,జయరాజ్ స్టీల్ ప్లాంటు డిర్డిఓ తదితర పరిశ్రమలు ఏర్పాటు అయినప్పటికీ నియోజకవర్గంలోని స్థానిక యువతకు ఉపాధి,ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని, పరిశ్రమల ఏర్పాటుకు పాణ్యంనియోజకవర్గంలోని రైతుల పొలాలు వేల ఎకరాలు తీసుకున్నా, రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వలేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థానిక పరిశ్రమల్లో స్థానికులకే 75% ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ,పాణ్యం నియోజవర్గంలో నెలకొల్పిన పరిశ్రమంలో స్థానికులకు 75% ఉపాధి. ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా బీహార్, ఒరిస్సా ఇతర రాష్ట్రాల వారికే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని,స్థానిక యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలుకల్పిస్తున్నారని,ఓర్వకల్లు మండల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి,ఓర్వకల్లు మండలంను కరువు మండలంగా ప్రకటించాలని, పరిశ్రమల్లో భూములు కోల్పోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించి, రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో ఓర్వకల్లు మండల విద్యార్థి సంఘం నాయకులు విక్రం,విఘ్ణు, రవితేజ ఓర్వకల్లు మండలం ఆర్విఎఫ్ నాయకులు,కార్యవర్గ సభ్యులు మరియు ప్రగతిశీల విద్యార్థి సంఘం నాయకులు మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఓర్వకల్లు మండలంలోని పరిశ్రమల్లో,,,
యువతకు 75% ఉపాధి,ఉద్యోగ అవకాశాలుకల్పించాలి .....
ఆర్విఎఫ్,పిఎస్యు నాయకులు డిమాండ్
Post A Comment:
0 comments: