ఈ చలానా జీవోలను రద్దు చేయాలని ధర్నా నిర్వహించిన..... నంద్యాల ఏఐటియుసి ఆటో వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు (జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి) ఏ

 ఈ చలానా జీవోలను రద్దు చేయాలని ధర్నా నిర్వహించిన.....

నంద్యాల ఏఐటియుసి ఆటో వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

ఏఐటీయూసీ రాష్ట్ర పిలుపుమేరకు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నంద్యాల జిల్లా ఏఐటియుసి నాయకులు శ్రీను,ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు అన్వర్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా ఆటో డ్రైవర్లు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా నాయకులు శ్రీను, ఆటో యూనియన్ నాయకులు అన్వర్లు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు పెన్షన్ తో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని,ఈ చలానా జీవో నెంబర్ 21,31 ని రద్దు చేయాలని ఆటో డ్రైవర్ల అందరికీ వాహాన మిత్రపథకం అందజేయాలనే డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని డిఆర్ఓ పుల్లయ్య గారికి అందజేశారు.ఈ ధర్నా కార్యక్రమంలో డోన్ నియోజకవర్గ ఆటో యూనియన్ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, ఉపాధ్యక్షులు సోమయ్య, శ్రీనివాసులు సహకార దర్శులు షాకీర్ మరియు నంద్యాల జిల్లా ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: