సిటీ కళాశాలకు ఐఎస్ఓ 21001:2018 గుర్తింపు

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

ప్రభుత్వ సిటీ కళాశాల, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించటంతోపాటు, విద్యార్థులలో మౌలిక ప్రతిభను వెలికితీసి వారి సర్వతోముఖ వికాసానికి కృషి చేస్తున్నదని హిమ్న్ ఇంటర్నేషనల్ సంస్థ సిఇవొ ఆలపాటి శివయ్య పేర్కొన్నారు. అంతర్జాతీయ విద్యాబోధన ప్రమాణాలను మదింపు చేసి కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు గుర్తింపును అందించే ఐఎస్ఓ 21001:2018 ధ్రువపత్రాన్ని తమ సంస్థ నుండి సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పి.బాల భాస్కర్ కి అందజేశారు శివయ్య. సిటీ కళాశాల గతంలో 9001:2015 ప్రమాణాల ప్రకారం గుర్తింపు పొందిందని, ఇప్పుడు అంతర్జాతీయంగా పెంచిన కొత్త ప్రమాణాల ప్రకారం వివిధ విభాగాల ద్వారా కళాశాల అందిస్తున్న సేవలను గుర్తించి ఈ ధృవపత్రం అందించామని అన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ ధృవపత్రం తమ బాధ్యతను మరింత పెంచుతుందని, విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా బోధన, అభ్యసనం, పరిశోధన విషయాలలో త్రిగుణాత్మక సేవలందిస్తున్న అధ్యాపక బృందాన్ని, అధికారిక కార్యకలాపాలలో సహకరిస్తున్న ఆఫీసు సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: