నవంబర్ లో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య 15 వ రాష్ట్ర మహాసభలు

 మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గా భవాని

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల పట్టణంలో నవంబర్ 17,18,19 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య 15 వ రాష్ట్ర మహాసభలు జరుగుతాయని మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గాభవాని తెలిపారు. సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ 8 దశబ్దాలుగా మహిళల హక్కుల కోసం పోరాడిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యకు ఉందని,17-10-23 వ తేదీ నంద్యాలలో వేలాది మంది మహిళలతో ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని, పార్లమెంటులో మహిళల బిల్లును తాముcస్వాగతిస్తున్నామని, బిజెపికి చిత్తశుద్ధి ఉంటే బిల్లును వెంటనే అమల్లోకి తీసుకుని వచ్చి మహిళల బిల్లును ఆచరణలోకి తీసుకురావాలని, ప్రధాని మోడీ తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన ఇన్ని సంవత్సరాలైనా ధరలు పెరిగాయి కానీ తగ్గలేదని, నేడు గ్యాస్ సిలిండర్ ధర 1100 అయిందని, సిలిండర్ ధర 500 రూపాయలు తీసుకురావాలని, పెట్రోల్, డీజల్ ను లీటర్ 50 రూపాయలకే ఇవ్వాలని, అధిక ధరలను నియంత్రణలోకి తీసుకొని రావాలని,14 రకాల నిత్యావసర సరుకులను రేషన్ షాపుల ద్వారా ఇవ్వాలని,రాష్ట్రంలో మద్య పాన నిషేధం అమలు చేస్తామన్న జగన్ ప్రభుత్వం  మే మద్యాన్ని విక్రయిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్లో దిశాచట్టం అమల్లోకి వచ్చింది కానీ దాన్ని కేంద్రం ఇంతవరకు గుర్తించలేదని, కేవలం దిశా పోలీస్ స్టేషన్లు మాత్రమే పెట్టారని, మహిళలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి సుగుణమ్మ, మహిళా నాయకురాళ్లు లక్ష్మీదేవి, తిరుపాలమ్మ, రజిత, జిల్లా సిపిఐ కార్యదర్శి రంగనాయుడు, సహాయ కార్యదర్శి బాబాఫకృద్దిన్, పట్టణ కార్యదర్శి ప్రసాద్ తదితరులు పాల్గొని మహాసభల పోస్టర్ ను ఆవిష్కరించారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: