13 వ తేదీ మహానంది మండల తాసిల్దార్ కార్యాలయంలో జగనన్నకు చెబుదాం - స్పందన కార్యక్రమం....ఇన్చార్జి కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి

 13 వ తేదీ మహానంది మండల తాసిల్దార్ కార్యాలయంలో జగనన్నకు చెబుదాం - 

స్పందన కార్యక్రమం....ఇన్చార్జి కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాలోని మహానంది తాసిల్దార్ కార్యాలయంలో వారంలో ప్రతి బుధవారం,శుక్రవారం మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం - స్పందన కార్యక్రమంలో భాగంగా ఈనెల 13 వ తేదీ మహానంది మండల కేంద్రంలో మండల స్థాయి జగనన్నకు చెబుదాం - స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి గురువారం తెలిపారు. మహానంది మండల తాసిల్దార్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి జగనన్నకు చెబుదాం - స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరిస్తామన్నారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఇంచార్జి కలెక్టర్ టీ.రాహల్ కుమార్ రెడ్డి తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: