ఈ నెల 10, 11వ తేదీల్లో హజ్రత్ సయ్యద్ మోయినుద్దీన్ ఖాద్రీ బాగ్దాది రహ్మతల్లాహి ఉర్సు

 ఈ  నెల 10, 11వ తేదీల్లో,,,,

హజ్రత్ సయ్యద్ మోయినుద్దీన్ ఖాద్రీ బాగ్దాది రహ్మతల్లాహి ఉర్సు

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

హజ్రత్ సయ్యద్ మోయినుద్దీన్ ఖాద్రీ బాగ్దాది రహ్మతల్లాహి ఉర్సు మహోత్సవం ఈ నెల 10, 11వ తేదీల్లో జరగనున్నదని దర్గా ముత్తవలిలు జానషిన్ మహమ్మద్ హాపీజుల్లా షరీఫ్ ఖాద్రీ, నాయబ్ జానషిన్ మహమ్మద్ సమీవుల్లా షరీఫ్ ఖాద్రీ తెలిపారు. జహనూమాలోని ఆస్తాన ఔలియాలోని దర్గా ప్రాంతంలో ఈ ఉర్పు మహోత్సవం జరగనున్నది వారు వెల్లడించారు.  అక్టోబర్ 10వ తేదీన మంగళవారంనాడు సందల్ కార్యక్రమం ఉంటుందని, 11వ తేదీన బుధవారంనాడు చీరాగ్ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.  జహనూమాలోని ఆస్తాన ఔలియాలోని ప్రాంతంలోని దర్గాలో హజ్రత్ సయ్యద్ మోయినుద్దీన్ ఖాద్రీ బాగ్దాది రహ్మతల్లాహి, హజ్రత్ సయ్యద్ జమాలుద్దీన్ ఖాద్రీ బాగ్దాది రహ్మతల్లాహి కోలువైవున్నారు. వీరిలో ఒకరైన హజ్రత్ సయ్యద్ మోయినుద్దీన్ ఖాద్రీ బాగ్దాది రహ్మతల్లాహి ఉర్సు ఈ నెల 10వ తేదీన ప్రారంభమై 11వ తేదీ వరకు రెండు రోజుల పాటు జరగనున్నదని ముత్తవలిలు వెల్లడించారు. ఈ ఉర్సులో గంధంను మిస్రీగంజ్ లోని హజ్రత్ సూఫీ షా మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ రాజ్ రహ్మతుల్లాహి దర్గా నుంచి మగ్రీబ్ నమాజ్ అనంతరం బయలుదేరి జహనూమాలోని ఆస్తాన ఔలియాలోని దర్గాకు చేరుకొంటుందని వారు వెల్లడించారు. కావున ఈ దర్గా మహోత్సవంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామి వారి ఆశీస్సులు తీసుకోవాలని వారు కోరారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: