అక్టోబర్ 2023

 జల్ పల్లిపై కేసీఆర్ కు ప్రత్యేక అభిమానం

ఓటువేసి వాటిని నిలుపుకొందాం

జల్ పల్లి వాసులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

ధూమ్ ధామ్ గా, గులాబీ దండుతో కలిసి జల్ పల్లి మునిసిపల్  బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. భారీ ర్యాలీతో మంత్రి,  మహేశ్వరం బిఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డికి ఘనంగా ఆ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. యువ నాయకులు కార్తీక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి మంత్రి సబితమ్మ ఇంద్రారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యా శాఖ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ బి ఆర్ ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ....


జల్ పల్లి ప్రాంతంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక అభిమానం ఉందని, ఈ ప్రాంత అభివృద్ధికి కోట్లాది నిధులు కేటాయించారన్నారు. ప్రతి ఓటరును కలిసి ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధిని వివరించి, కారు గుర్తుకు ఓటు వేయించాలని కోరారు.  ఈ ప్రాంతంలో ఐటి కంపెనీల రాకతో రూపురేఖలు మారిపోతాయని, 40 ఎకరాలు ఇప్పటికే కేటాయించామని. నియోజకవర్గంలో మొత్తం 15000 ల చెక్కులలో  4000 జల్ పల్లి షాది ముబారక్ చెక్కులు జల్ పల్లిలో అందించాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాంతంలో  30 పడకల ఆస్పత్రి మంజూరు చేసారన్నారు. 5 కోట్లు పాఠశాలకు కేటాయించాం, పహాడీ షరీఫ్ దర్గాకు 14 కోట్లతో ర్యాంప్ రోడ్డు కు నిధులు మంజూరు చేసామని మంత్రి వెల్లడించారు.

యువనేత కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ... జల్ పల్లిలో మంత్రి సబితమ్మ ఆధ్వర్యంలో ఉహాలకందని అభివృద్ధి జరిగింది. బడ్జెట్ లో మైనార్టీల కు అధిక కేటాయింపులు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో, హైదరాబాద్ లో శాంతి భద్రతలు ఎంతో మెరుగ్గా ఉన్నాయి. నీటి సమస్యతో పాటు దశాబ్దాల సమస్యలకు పరిష్కారం లభించింది. జల్ పల్లి బిఆర్ఎస్ కు కంచుకోట అని,మరింత అభివృద్ధి కోసం సబితమ్మను గెలిపించాలన్నారు.

  నా విజయానికి సహకరించండి

పార్టీ నేతలు, కార్యకర్తలను కోరిన బీజేపీ అభ్యర్థి ఊరడి సత్యనారాయణ

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

తన విజయానికి పార్టీ నేతలంతా సహకరించాలని  చంద్రయనగుట్ట అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఊరడి సత్యనారాయణ కోరారు. శుక్రవారంనాడు చంద్రయనగుట్ట అసెంబ్లీ రియాసత్ నగర్ డివిజన్ లో ఊరడి సత్యనారాయణ బీజేపీ పార్టీ డివిజన్ కార్యకర్తలను, స్థానిక బస్తీ పెద్దలను కలిసి మద్దతు కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో  అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ గంజి వేణు, డివిజన్ అధ్యక్షులు శివ కాంత్,  అర్జున్ శేఖర్ రెడ్డి, గోపి తదితరులు పాల్గొన్నారు. 

 జల్ పల్లి మున్సిపాలిటీ శ్రీరామ కాలనీలో,,,,

బిఆర్ఎస్  పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కార్తీక్ రెడ్డి 

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

విజయదశమి పర్వదినము సందర్భంగా సోమవారంనాడు జల్ పల్లి మున్సిపాలిటీ శ్రీరామ కాలనీ లో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం జల్పల్లి మున్సిపాలిటీ బిసి సెల్ అధ్యక్షులు  ఉస్కెమూరి నిరంజన్ నేత జన్మదిన సందర్భంగా  కేక్ కట్ చేయించి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ విజయదశమి రోజున పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉదన్నారు.


విజయదశమి రోజు ఏ పని చేసిన విజయం సాధిస్తామని, రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని ఆయన వెల్లడించారు. మహేశ్వరం నియోజకవర్గంలో మూడోసారి ఎమ్మెల్యేగా సబితా ఇంద్రారెడ్డి భారీ మెజారిటీ తో ఘన విజయం సాధిస్తారని కార్తీక్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకు ముందు జల్ పల్లి మున్సిపాలిటీలోని శ్రీరామ కాలనీకి  బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి రాకను స్వాగతిస్తూ  స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు యువకులు బానసంచాతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

  

  


గర్భసంచి ప్రాధాన్యత పై అవగాహన ఎంతో అవసరం

మోనోపాజల్  సొసైటీ ఆఫ్ ఇండియా ప్రారంభోత్సవంలో వైద్య నిపుణులు

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

మహిళల ఆరోగ్య పరిరక్షణ లో గర్భసంచి ప్రాధాన్యత పై విస్తృత స్థాయిలో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని పలువురు వైద్య నిపుణులు సూచించారు. ప్రధానంగా మునోపాస్ దశలో మహిళల  మానసిక శారీరక సమస్యలు పరిస్థితులు గర్భసంచి ఆరోగ్యం పై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.   తెలుగు యూనివర్సిటీ ఎన్టీఆర్ ఆడిటోరియంలో బుధవారం  సాయంత్రం జాతీయస్థాయిలో ఆయుర్వేదిక్ మనోపాజల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏ ఎం ఎస్ ఐ)  ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.  కిమ్స్ మహిళా రోగుల వైద్య విభాగం అధిపతి డాక్టర్ త్రిపుర సుందరి మల్లారెడ్డి వైద్య కళాశాల  స్త్రీలుగా వైద్య విభాగం అధిపతి  డా.హరి అనుపమ, కశ్యపి ఆయుర్వేద ప్రసూతి ఫౌండేషన్ చైర్మన్.. ప్రొఫెసర్ డాక్టర్ చిలువేరు రవీందర్ లు  ఈ సందర్భంగా మెనోపాజల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రచురించిన ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు . ఈ సందర్భంగా వైద్య నిపుణులు మాట్లాడుతూ అవగాహన లోపంతో సంతానోత్పత్తి అనంతరం మహిళలకు గర్భసంచిని తొలగించే విధానం సహేతుకం కాదన్నారు. ఉత్పత్తి అనంతరం మహిళల ఆరోగ్య పరిరక్షణలో గర్భసంచి ప్రధాన పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు వివరించారు.


గ్రామీణ ప్రాంతాల్లో మధ్య వయసు తర్వాత గర్భసంచి తొలగించేటువంటి విధానంతో అనేక శారీరక మానసిక సమస్యలు ఉత్పన్నమైనట్టు ఒక అధ్యాయంలో స్పష్టమైందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. మనోపాసులు దశలో గర్భసంచి ఆరోగ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ కే అర్. ఆయుర్వేద వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ్ గణేశ్వర్ రెడ్డి .. ప్రముఖ విద్యావేత్త డాక్టర్ నీలిమ ఆర్య లతోపాటు పలువురు వైద్య నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.    ఈ కార్యక్రమానికి మెనుపాజల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డాక్టర్ సునీత గోను అధ్యక్షత వహించారు. సౌజన్ చైర్మన్ డాక్టర్ కోల విజయ కుమారి ..డాక్టర్ బి.ఆర్ కేఆర్ వైద్య కళాశాల స్త్రీ రోగ  వైద్య విభాగం అధిపతి డాక్టర్ సునీత జోషి . డాక్టర్ నాగలక్ష్మి డాక్టర్ లక్ష్మి.అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ యామిని సౌభాగ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళా వైద్య నిపుణులు ఈ కార్యక్రమంలో ప్రతినిధులుగా పాల్గొన్నారు. 


 ఆళ్లగడ్డలో టిడ్కో గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేసిన....

రాష్ట్ర మంత్రులు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాలో ప్రతి పేదవాడు జీవితాంతం కష్టపడ్డా సొంతింటి కల నెరవేర్చుకోలేని తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇచ్చి సొంతింటి కల నెరవేర్చారాలను ఉద్దేశంతో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం పరిధిలోని చింతకుంట్ల గ్రామ సమీపంలో ఏర్పాటుచేసిన టిడ్కో గృహ సముదాయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్,రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్,జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలానీ సమూన్,ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి,ప్రభుత్వ సలహాదారుమాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి,స్థానిక ఎమ్మెల్యే బ్రిజేంద్రనాధ్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి,జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు మైనారిటీ సంక్షేమ శాఖ  మంత్రి అంజాద్ భాషాలు పాల్గొని 1392 టిడ్కో గృహాలు ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ


దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రవ్యాప్తంగా 2.62 లక్షల టిడ్కో గృహాలను మంజూరు చేసి పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నామని,31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశామనీ. నాలుగున్నర సంవత్సరాల కాలంలో  98 శాతం హామీలు సియం వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలుచేసారనీతెలిపారు. అనంతరం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ఆళ్ళగడ్డ పట్టణంలో 23 ఎకరాల స్థలంలో నిర్మించిన 1392 టిడ్కో గృహాలను పంపిణీ చేయడం సంతోషకరంగా ఉందనీ,అక్క,చెల్లెమ్మలకు జగనన్న పుట్టింటి సారెగా అన్ని వసతులతో కూడిన ఉచిత గృహాన్ని నిర్మించి ఒక్క రూపాయికే ఇస్తున్నామనీ,రాబోయే రోజుల్లో టిడ్కో గృహ సముదాయాలన్నీ గ్రామాలుగా మారుతాయనీ,గత ప్రభుత్వం అరకొరగా నిర్మించిన గృహాలకు అత్యా ధునిక వసతులు కల్పించి పేదలకు రాజకీయాలకు ఆతీతంగా సంక్షేమ పథకాలు అందరికీ అందజేస్తున్నామని,ఎన్నోఏళ్లుగా అద్దె ఇళ్లలో అవస్థలు పడిన లబ్ధిదారులు ఇక నుంచి జగనన్న నగర్ లో అన్ని వసతులతో కూడిన గృహ ఇంటి పట్టాలు పంపిణీచేస్తున్నామన్నామని తెలిపారు.

అనంతరం 
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ అసంపూర్తిగా వున్న టిడ్కో గృహ నిర్మాణాలను పూర్తి చేసి పేద ప్రజలకు పంపిణీ చేశామనీ,ఎక్కువ ధరకు టెండర్లు వేయడం గమనించి రివర్స్ టెండరింగ్ పద్ధతి ద్వారా వందల కోట్లు ప్రజాధనం వృథా కాకుండా ఆపామనని,నాడు-నేడు ద్వారా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల రూపు రేఖలు మార్చామనీ, ఆసరా,చేయూత,చేదోడు తదితర పలు సంక్షేమ కార్యక్రమాలన్నీ విజయవంతంగా అమలు చేస్తున్నామనీ,పేదవాడికి భరోసా పాలన ఇచ్చిన ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోవాలని తెలిపిన అనంతరం జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ పేదవాడు ఇల్లు కట్టుకోవాలన్న కలను రాష్ట్ర ముఖ్యమంత్రి  నిజం చేస్తున్నారనీ,జిల్లావ్యాప్తంగా 95 వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసామనీ,జిల్లా మొత్తం మీద 11,680 టిడ్కో గృహాలను నిర్మించగా ఆళ్లగడ్డ పట్టణంలో 1392 టిడ్కో గృహాలను పండుగ వాతావరణంలో లబ్ధిదారులకు అందజేస్తున్నామని,

టిడ్కో గృహ నిర్మాణం కొరకు 70 కోట్ల రూపాయలు ఖర్చు చేసామనీ,322 జగనన్న లే అవుట్ లలో 44 వేల మందికి గృహాలు మంజూరు చేయగా  ఇప్పటివరకు 31 వేల గృహాలు లబ్ధిదారులు పూర్తి చేసుకున్నారనీ తెలిపారు. అనంతరం నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి తిండి,కూడు,గుడ్డ అత్యవసరమని ఇందులో భాగంగానే ప్రతి నిరుపేద కుటుంబానికి గృహాన్ని నిర్మించి ఇవ్వాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయమనీ తెలిపిన అనంతరం లబ్ధిదారులకు ఇంటి హక్కు పత్రాలను, ఇంటి తాళాలను అందజే శారు.ఈ కార్యక్రమంలో రామతీర్థం పుట్టాలమ్మ ఆలయ చైర్మన్ గంగుల మనోహర్ రెడ్డి,గవిజయ డైరీ చైర్మన్ ఎస్వీ జగన్, విజయ డైరీ డైరెక్టర్ గంగుల విజయ సింహారెడ్డి,ఆళ్ళగడ్డ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి,ఏపీ ముస్లిం మైనార్టీ జనరల్ సెక్రటరీ బాబులాల్,ఆళ్ళగడ్డమార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం రాఘవ రెడ్డి,ఏపీ ఇరిగేషన్  చైర్మన్ కర్రాగిరజాహర్షవర్ధన్ రెడ్డి,ఆళ్లగడ్డ ఎంపీపీ గజ్జల రాఘవేంద్ర రెడ్డి,పలు శాఖల వైస్ చైర్మన్లు, ఎంపిటిసిలు,జడ్పీటిసిలు మరియు భారీ సంఖ్యలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


 ఓర్వకల్లు మండలంలోని పరిశ్రమల్లో,,,

యువతకు 75% ఉపాధి,ఉద్యోగ అవకాశాలుకల్పించాలి .....

ఆర్విఎఫ్,పిఎస్యు నాయకులు డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని స్థానిక ఓర్వకల్లు మండల పరిధిలో ప్రారంభమైన అన్ని పరిశ్రమల్లో గడివేముల, పాణ్యం,మండలాల్లో ఏర్పాటైన నూతన పరిశ్రమల్లో స్థానిక యువతకు 75% ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని రాయలసీమ రవీంద్ర నాథ్,ప్రగతిశీల విద్యార్థి సంఘం నాయకుడు అయ్యన్న డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (అర్విఎఫ్ ) ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ (అర్విఎఫ్)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ రవీంద్ర నాథ్.ప్రగతిశీల విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయ్యన్నలు మాట్లాడుతూ పాణ్యం నియోజవర్గం పీన్నాపురం, ఓర్వకల్లు లో కోన్ని వేల ఎకరాల్లో సోలార్,సిలికాన్, ఎయిర్పోర్టు,జయరాజ్ స్టీల్ ప్లాంటు డిర్డిఓ తదితర పరిశ్రమలు ఏర్పాటు అయినప్పటికీ నియోజకవర్గంలోని స్థానిక యువతకు ఉపాధి,ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని, పరిశ్రమల ఏర్పాటుకు పాణ్యంనియోజకవర్గంలోని  రైతుల పొలాలు వేల ఎకరాలు తీసుకున్నా, రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వలేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థానిక పరిశ్రమల్లో స్థానికులకే 75% ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ,పాణ్యం నియోజవర్గంలో నెలకొల్పిన పరిశ్రమంలో స్థానికులకు 75% ఉపాధి. ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా బీహార్, ఒరిస్సా ఇతర రాష్ట్రాల వారికే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని,స్థానిక యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలుకల్పిస్తున్నారని,ఓర్వకల్లు మండల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి,ఓర్వకల్లు మండలంను కరువు మండలంగా ప్రకటించాలని, పరిశ్రమల్లో భూములు కోల్పోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించి, రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో ఓర్వకల్లు మండల విద్యార్థి సంఘం నాయకులు విక్రం,విఘ్ణు, రవితేజ ఓర్వకల్లు మండలం ఆర్విఎఫ్ నాయకులు,కార్యవర్గ సభ్యులు మరియు ప్రగతిశీల విద్యార్థి సంఘం నాయకులు మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

 ఈ చలానా జీవోలను రద్దు చేయాలని ధర్నా నిర్వహించిన.....

నంద్యాల ఏఐటియుసి ఆటో వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

ఏఐటీయూసీ రాష్ట్ర పిలుపుమేరకు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నంద్యాల జిల్లా ఏఐటియుసి నాయకులు శ్రీను,ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు అన్వర్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా ఆటో డ్రైవర్లు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా నాయకులు శ్రీను, ఆటో యూనియన్ నాయకులు అన్వర్లు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు పెన్షన్ తో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని,ఈ చలానా జీవో నెంబర్ 21,31 ని రద్దు చేయాలని ఆటో డ్రైవర్ల అందరికీ వాహాన మిత్రపథకం అందజేయాలనే డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని డిఆర్ఓ పుల్లయ్య గారికి అందజేశారు.ఈ ధర్నా కార్యక్రమంలో డోన్ నియోజకవర్గ ఆటో యూనియన్ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, ఉపాధ్యక్షులు సోమయ్య, శ్రీనివాసులు సహకార దర్శులు షాకీర్ మరియు నంద్యాల జిల్లా ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. భవిష్యత్తు తరాలకు మెరుగైన సమాజం నిర్మించడం కోసం......

ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదికలో భాగస్వాములు కండి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాలో స్థానిక జిల్లా కార్యాలయం నందు ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కార్యవర్గ సమావేశము స్థానిక జిల్లా కార్యాలయం నందు జిల్లా అధ్యక్షులు ఆకుమల్ల రహీం అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లాలోనీ ఏడు మండలాల నుండి 25 మంది మండల సభ్యులు హాజరయ్యి 2024-25 సంవత్సరాల వరకు పనిచేయు నూతన నంద్యాలజిల్లా మరియు మండల కమిటీలను సభ్యులందరి ఏకాభిప్రాయంతో ఎన్నుకోవడం జరిగిందని, డిసెంబర్ చివరి నాటికి పూర్తిస్థాయిలో మండల మరియు జిల్లా కమిటీ  ఏర్పాటు చేసుకునే విధంగా కార్యాచరణను రూపొందించుకోవడం జరిగిందని,ఐక్యవేదిక ముఖ్య లక్ష్యం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటూ  రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేసుకునే విధంగా ప్రజలను చైతన్యవంతులను చేయడంలో భాగంగా ఐక్యవేదిక నాలుగు ప్రధాన అంశాలను ఆయుధాలుగా తీసుకుని భారత రాజ్యాంగము కనీస అవగాహన,సమాచార హక్కుచట్టం,గ్రామసభలు మరియు వార్డుసభలు, ఎన్నికల విధాన సంస్కరణల అంశాల పై ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజలలో చైతన్యం తీసుకుని వచ్చి,భవిష్యత్తు తరాలకు మెరుగైన,ఉత్తమ సమాజాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నదనీ,


 
సమాజ అభ్యున్నతి కోరుకునే నంద్యాల జిల్లా పౌరులు మా ఐక్యవేదిక ఉద్యమంలో పాల్గొని మెరుగైన సమాజ స్థాపనలో పాలు పంచుకోవాలని పిలుపు ఇచ్చారు.ఈకార్యక్రమంలో నంద్యాలజిల్లా అధ్యక్షులు ఆకుమల్ల రహీం,ప్రధాన కార్యదర్శి డిపి మస్తాన్ వలి,కోశాధికారి సత్యనారాయణ,మహిళా విభాగం కన్వీనర్ చిలక ప్రసన్న కుమారి,సహాయ కార్యదర్శి చిన్న నాగన్న, బండి ఆత్మకూరు మండల అధ్యక్షులు రామరాజు, నంద్యాల రూరల్ సభ్యులు ఆరిఫ్ ఉద్దీన్,నంద్యాల టౌన్ కార్యదర్శి శివశంకర్, ఆత్మకూరు మండల బాధ్యులుసాయి దత్త, మహానంది మండల బాధ్యులురాయుడు, కొత్తపల్లిమండల సభ్యులు ప్రసాదు  తదితర ఐక్యవేదిక సభ్యులు పాల్గొన్నారు.


పాణ్యం రైల్వే స్టేషన్ లో ఎక్స్ ప్రెస్ రైళ్ల ను ఆపాలనీ విజ్ఞప్తి చేసిన.... 

పాణ్యం ఎంఎల్ఏ కాటసాని రాంభూపాల్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని స్థానిక పాణ్యం రైల్వే స్టేషన్ లో దక్షిణ మధ్య రైల్వే డిఆర్ఎం మనీష్ అగర్వాల్ తనిఖీలు నిర్వహిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న పాణ్యం శాసనసభ సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి పాణ్యం రైల్వేస్టేషన్ వద్దకు చేరుకొని పాణ్యం,నెరవాడ,కౌలూరు గ్రామాల్లో నెలకొన్న రైల్వే అండర్ బ్రిడ్జి సమస్యలను, పాణ్యం రైల్వే స్టేషన్ మీదుగా 8:30 కి నడుస్తున్న అమరావతి ఎక్స్ ప్రెస్, హుబ్లీ-విజయవాడ, గుంటూరు-కాచిగూడ,  కాచిగూడ-గుంటూరు ఎక్స్ ప్రెస్ రైళ్ళను ఆపాలని, పాణ్యం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అనేక పుణ్యక్షేత్రాలు,పర్యాటక ప్రదేశాలు,సోలార్ పరిశ్రమలు ఉన్నాయనీ, పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి వచ్చిన పర్యాటకులకు మరియు అనునిత్యం వ్యాపార సంబంధిత లావాదేవీల కోసం ప్రయాణించే ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలవకుండా,ఇతర రాష్ట్రాల నుంచి పుణ్యక్షేత్రాలకు వచ్చి మోక్కుబడులు తీర్చుకునే భక్తులు ఇబ్బందులు పడుతున్నారన్నారనీ,


పాణ్యం రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్ ను తక్షణమే ఏర్పాటు చేసి, పాణ్యం రైల్వే స్టేషన్ లో ఎక్స్ ప్రెస్ రైళ్లను నిలబడేలా చర్యలు తీసుకొని ప్రజల అవసరాలను తీర్చేలా చర్యలు తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే డిఆర్ఎం ను పాణ్యం నియోజకవర్గ శాసనసభ సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి చేసిన విన్నపానికి దక్షిణ మధ్య రైల్వే డిఆర్ఎం మనీష్ అగర్వాల్ సానుకూలంగా స్పందించి త్వరలోనే సంబంధిత ఉన్నతాధికారులను సంప్రదించి నిర్ణయం తీసుకొని ఎక్స్ ప్రెస్ రైళ్లు పాణ్యం రైల్వే స్టేషన్ లో  నిలబడేలా చర్యలు తీసుకుంటామనితెలిపారు. ఈకార్యక్రమంలో మాజీ జడ్పిటిసి సభ్యులు సూర్యనారాయణ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, మార్నింగ్ వైఎస్ఆర్సిపి నాయకులు మరియు రైల్వే సిబ్బంది పాల్గొన్నారు.

నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తున్న జీవీమాల్ యాజమాన్య వైఖరిపై.....

నంద్యాలజిల్లా డీఆర్ఓ, మున్సిపల్ కమీషనర్ కి ఫిర్యాదుచేసిన....

నంద్యాల విద్యార్ధి,యువజన సంఘాల జేఏసీ నేతలు 

(జానో జాగోె వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా స్థానిక నంద్యాల పట్టణంలో ఆఫర్ల పేరుతో జీవిమాల్ యాజమాన్యం ప్రజలకు చేస్తున్న మోసంపై నంద్యాల జిల్లా డిఆర్ఓ పుల్లయ్య మరియు మున్సిపల్ కమీషన్ రవి చంద్రారెడ్డికి సమస్యను వివరించి వినతి పత్రం అందించిన విద్యార్థి యువజన సంఘాల నేతలు.ఈ సందర్భంగా జేఏసీ నేతలు రామినేని రాజునాయుడు, బందెల ఓబులేసు, శివకృష్ణ యాదవ్, షేక్ రియాజ్ , జయరాజులు మాట్లాడుతూ నంద్యాల జిల్లా కేంద్రంలో జీవీ షాపింగ్ మాల్ పేరిట కార్పోరేట్ షాపింగ్ మాల్ ఏర్పాటు చేసి గత 30 సంవత్సరాల నుండి నంద్యాలలో బట్టల వ్యాపారం చేస్తున్న నంద్యాల వాసులకు ఉపాధికి దూరం చేస్తున్నారనీ,ఆఫర్ల పేరుతో నయా మోసంచేస్తున్నారనీ,


జీవీ షాపింగ్ మాల్ కు ఎటువంటి ప్రభుత్వ అనుమతులు, మున్సిపాలిటీ అనుమతులు లేవనీ, కొందరు అధికారులు ముడుపులు తీసుకొని జీవీ మాల్ కు సరియైన మౌలిక సదుపాయాలు లేకుండా ఉన్న తప్పుడు అనుమతులు ఇచ్చారనీ, 
ఆఫర్ల పేరుతో నయా మోసం చేస్తూ, నంద్యాలలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగిస్తూ ఉన్న జీవీ షాపింగ్ మాల్ పై చర్యలు తీసుకోవాలని లేదంటే షాపింగ్ మాల్ ఎదుట ప్రత్యక్ష ఆందోళనలు చేపడుతామని వివరింపగా నంద్యాల పట్టణంలో నిర్వహిస్తున్న జీవీ షాపింగ్ మాల్ పై విచారణ చేపడుతామని మున్సిపల్ కమీషనర్ రవి చంద్రారెడ్డి తెలియజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల విద్యార్థి యువజన సంఘాల నేతలు పాల్గొన్నారు.

 పేదలకు భరోసా ముఖ్యమంత్రి సహాయనిధి అందజేసిన.. 

నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి

(జానో జాగోె వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో స్థానిక నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు భరోసా నిస్తుందని  నంద్యాల పట్టణంలో ఉన్న స్వగృహం నందు ముఖ్యమంత్రి సహాయనిధికి నంద్యాల నియోజకవర్గ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు 4.85,000/రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి  మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకంలోనికి రాని వ్యాధులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సహాయం చేయడం జరుగుతుందని,అనేక వ్యాధులకు సంబంధించిన వ్యాధిగ్రస్తులకు ఆపరేషన్లను నిర్వహించడం జరిగిందని, పేదవారి ఆరోగ్యానికి, జీవితాలకు అండగా నిలుస్తానని చెప్పిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటకు కట్టుబడి లబ్ధిదారులకు సీఎం సహాయనిధి నుండి ఆర్థిక బోరోసా కల్పిస్తున్నాడని,  ఆరోగ్యశ్రీలో 1000 కి పైగా వ్యాధులను చేర్చడం జరిగిందని,అంతేకాకుండా మిగతా వ్యాధులకు సంబంధించిన వ్యాధిగ్రస్తులకు సీఎంఆర్ఎఫ్ నుండి సహాయమందించడం జరుగుతుందని తెలిపిన అనంతరం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి నంద్యాల నియోజకవర్గ పరిధిలో


అర్హులు అయిన షేక్ హమద్ భాను 50.000/- బెక్కం హేమలత 65,000/-మంటి హుషేని 65,000/- కొనుదుల లాలితమ్మ 75,000/- బోరెడ్డి రాజేశ్వరి 60,000/- సిరియపు రెడ్డి వీరాదేవి 1,70,000/- రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు.చెక్కులు అందుకున్న లబ్ధిదారులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరియు ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్,దేశం సుధాకర్ రెడ్డి కౌన్సిలర్స్ మేష చంద్రశేఖర్,బాసిద్,కిరణ్ కుమార్,టివి రమణ,గాన్ని కరీం,ఆంధ్ర మెడికల్ రమేష్,రామ సుబ్బారెడ్డి, కాసిం,శివనాగిరెడ్డి, రామారెడ్డి తదితరులు పాల్గొన్నారు

 కృష్ణా జలాల నీటి పంపకంలో రాయలసీమకు తీవ్ర నష్టం,..... 

మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి

(జానో జాగోె వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

రాయలసీమ ప్రాంతానికి చెందిన సీఎం జగన్ మోహనరెడ్డి కృష్ణా నీటి వాడుకలో సీమకు అన్యాయం జరుగుతున్న స్పందించక పోవడం దారుణమని నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి విమర్శించారు.నంద్యాల పట్టణంలోని తన స్వగృహంలో ఏర్పాటుచేసిన సమావేశంలో విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కృష్ణాజిల్లాలను 811 టీఎంసీలను కేటాయించారని, అనంతరం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కృష్ణనది జలాలను 512టీఎంసీలను ఆంధ్రాకు,299 టీఎంసీలు తెలంగాణకు కేటాయించారని, ఆంధ్రాలో పోలవరం జాతీయ ప్రాజెక్టును నిర్మిస్తున్నందున కృష్ణా,ప్రకాశం బ్యారేజ్ లో మిగులు 80 టీఎంసీలను, కర్ణాటకకు 21 టీఎంసీలను, మహారాష్ట్రకు 14 టీఎంసీలను కేటాయించి సీమకు అన్యాయం చేశారని,మళ్ళీ ఇప్పుడు 80 టీఎంసీలలో ఎగువ రాష్ట్రాలకు 35 టీఎంసీలు పోను మిగిలిన 45 టీఎంసీలలో కూడా సగంవాటాను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో ఉండగానే  తెలంగాణ ప్రభుత్వం 45 టీఎంసీలలో సగం నీటిని కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందని,పోలవరం నిర్మాణానికి 7 మండలాలను ఇచ్చామని కాబట్టి మాకు నీటి కేటాయింపులు చేయాలనీ చాలాకాలం నుండి కోరుతున్నారని తెలుపగా కేంద్రం కృష్ణా జలాలను సమీక్సించమని జీవో విడుదల చేసిందని,కృష్ణా జలాల పంపిణీ వల్ల సీమ రైతులు తీవ్రంగా నష్ట పోతారని తెలిసి కూడా సీఎం జగన్మోహనరెడ్డి నోరు మెడపక పోవడం దారుణమని,


అంబటి రాంబాబు ఈ జివో పై సుప్రీంకోర్టుకు పోతామని హడావుడి చేశారని,కానీ ఆచరణలో మాత్రం చేయలేదని,తెలంగాణ ప్రభుత్వం ఈవిషయం పై ఆంధ్ర కంటే ముందే కెవియట్ పిటిషన్ వేసిందని,ఆంధ్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల స్టే వచ్చే అవకాశాలు కూడా ఇప్పుడు లేకుండా పోయాయని,సీమ రైతులకు సాగు నీటి విషయంలో అన్యాయం జరుగుతున్న అధికారపార్టీ ప్రజాప్రతినిధులు స్పందించకపోవటం సిగ్గు చేటని,ఇప్పటికైనా రైతులకు అన్యాయం జరగకుండా కేంద్రం సంబందిత అధికారులతో చర్చలు జరపాలని, లేకపోతే ప్రస్తుత అధికార పార్టీ నాయకులు సీమ ద్రోహులుగా మిగిలి పోతారని తెలిపారు. ఈకార్యక్రమంలో రైతులు సంఘం నాయకులు బాలీశ్వర్ రెడ్డి,గోపాల్ రెడ్డి,రవి బాబు,గురునాధ్ రెడ్డి, మహేంద్ర రెడ్డి, పెద్దకొట్టాల కొండా రెడ్డి,లాయర్ మనోహర్ రెడ్డి మరియు రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

 చట్టసభల్లో "వై నాట్ నో ఎంట్రీ"....

గడివేముల నూర్ భాషా/దూదేకుల సంఘం నాయకుల డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం కేంద్రంలో గడివేముల నూర్ భాషా/దూదేకుల సంఘం నాయకులు గడివేముల మాజీ సర్పంచ్ జమాల్ భాష, వాటర్ ప్లాంట్ ఆర్మీ జమాల్ బాషాల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గడివేముల మాజీ సర్పంచ్ జమాల్ బాషా,  వాటర్ ప్లాంట్ ఆర్మీ జమాల్ బాషా మాట్లాడుతూ


భారతదేశానికి స్వసంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయినప్పటికీ ఇంతవరకు దూదేకులు చట్టసభల్లో అడుగుపెట్ట లేదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 20 లక్షలకు పైగా దూదేకులు ఉన్నారని, అలాంటి దూదేకుల వారికి చట్టసభల్లో రాజకీయ పార్టీలు ఎందుకు సీట్లు కేటాయించడం లేదని ప్రశ్నించారు.జనాభా దామాషా ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు దూదేకులకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని,మైనార్టీ పదవుల్లో వర్గీకరణ దామాషా ప్రకారం దూదేకులకు పదవులు మరియు బడ్జెట్ తప్పనిసరిగా కేటాయించాలని,

రానున్న ఎన్నికల్లో దూదేకుల వారికి ఏ రాజకీయ పార్టీ అయితే సముచిత స్థానం కల్పిస్తుందో ఆ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని తెలిపిన అనంతరం 29-10-23 వ తేదీన గుంటూరులో జరిగే నూర్ భాషా/దూదేకుల ముస్లిం సింహగర్జన గోడ పత్రికను విడుదల చేసి,దూదేకుల సింహగర్జన మహాసభకు గడివేముల మండలం నుండి దాదాపు 500 మందితో బయలుదేరి వెళుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గడివేముల మండలం దూదేకుల సంఘం నాయకులు మాజీ సర్పంచ్ జమాల్ బాషా,వాటర్ ప్లాంట్ ఆర్మీ జమాల్ బాషా, టీచర్ మహబూబాషా, ఐలన్న,సుభాన్,యాకుబ్ వలి,యాసీన్,సోఫీ,చంటి, భాష తదితరులు పాల్గొన్నారు.

 బీసీలు అంటేనే... తెలుగుదేశం.... తెలుగుదేశం అంటేనే బీసీల పార్టీ

గౌరు దంపతుల వెల్లడి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజక వర్గం గడివేముల మండల పరిధిలోని మంచాలకట్ట గ్రామంలో మాజీ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మంచాలకట్ట గ్రామంను పసుపు మయంగా మార్చి ఘన స్వాగతం పలికిన కార్యక్రమానికి పాణ్యం  మాజీ శాసనసభ సభ్యురాలు,టిడిపి ఇన్చార్జ్ గౌరు చరితారెడ్డి,నందికొట్కూరు టిడిపి ఇన్చార్జ్ గౌరు వెంకటరెడ్డి లు ముఖ్య అతిథులుగా పాల్గొని భవిష్యత్తుకు గ్యారెంటీ, చంద్రబాబుతో నేను సైతం, రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పాణ్యం మాజీ శాసనసభ సభ్యురాలు టిడిపి ఇన్చార్జ్ గౌరు చరితా రెడ్డి మాట్లాడుతూ బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని, యువతకు బాబు వస్తేనే జాబు గ్యారెంటీ అని, చంద్రబాబు గారి నాయకత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తూ మినీ మహానాడులో సూపర్ సిక్స్ పథకాలతో మినీ మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగిందని,


దసరా పండుగ రోజు ప్రజా సంక్షేమం కోసం మరియొక మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తున్నారని, అంతేకాకుండా ఎన్నికల సమయంలో మరో మేనిఫెస్టోను కూడా విడుదల చేయడానికి సిద్ధం చేశారని,ప్రజలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన వ్యక్తి నీ అక్రమంగా అరెస్టు చేసి ప్రజాక్షేత్రంలో తిరుగనీయకుండా ప్రజాక్షేత్రంలో తాము ఓడిపోతామనే భయంతోనే వైసీపీ నాయకులు రాజకీయాలు చేస్తూ అక్రమ కేసులు పెట్టారని,స్కిల్ డెవలప్మెంట్ లో  యువతకు ఉపాధి కల్పించారు అంతేకానీ ఏలాంటి అక్రమాలకు, అవినీతికి పాల్పడలేదని, ఇంతవరకు స్కిల్ డెవలప్మెంట్ పై పెట్టిన కేసుపై ఆరు రూపాయల అవినీతి జరిగిందని నిరూపించుకోలేకపోతున్నారని,వైసీపీ ప్రభుత్వానికి దాచుకోవడం,దోచుకోవడం తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనే లేదని గ్రామ ప్రజలకు వివరించారు.అనంతరం నందికొట్కూరు టిడిపి ఇంచార్జ్ గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి చేయాలని ఆలోచన వైసిపి ప్రభుత్వానికి లేదని, గ్రామాలలో యువత ఉద్యోగ,ఉపాధి లేకుండా రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరుస్తున్నారని, అమ్మ ఒడి కి ఇద్దరు పిల్లలు ఉంటే కేవలం ఒకరికి మాత్రమే వర్తిస్తుందని, కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయని,ఇంటిలో ఉద్యోగం ఉందని,అమ్మ ఒడి తీసివేసి మహిళలను మోసం చేస్తున్నారని,

సంక్షేమ పథకాలు కేవలం వైసీపీ నాయకుల అనుచరులకు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో గడివేముల మండల టిడిపి కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి, గడివేముల టిడిపి సీనియర్ నాయకులు సీతారామిరెడ్డి,బూజునూరు రామచంద్రారెడ్డి,దుర్వేసి కృష్ణ యాదవ్,పెసరవాయి ఒడ్డు లక్ష్మీదేవి,సోషల్ మీడియా ప్రతినిధి సుభద్రమ్మ,రాష్ట్ర ముస్లిం మైనార్టీ కార్యదర్శి ఫరూక్, ఉందుట్ల గ్రామ సర్పంచ్ గంగాధర్ రెడ్డి,పాణ్యం నియోజకవర్గ ఐటిడిపి సభ్యులు,టిడిపి కార్యకర్తలు,అభిమానులు మరియు మంచాలకట్ట గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

 న్యాయానికి సంకెళ్లు అంటూ నిరసన తెలిపిన.....

గడివేముల మండల టిడిపినాయకులు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ వర్గం గడివేముల మండల పరిధిలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ అధినాయకుల పిలుపు మేరకు"న్యాయానికి సంకెళ్లు"కార్యక్రమం లో భాగంగా పాణ్యo మాజీ శాసనసభ్యురాలు మరియు టీడీపీ ఇంచార్జి గౌరు చరిత రెడ్డి ఆదేశాల మేరకు గడివేముల మండల టిడిపి కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో గడివేముల మండలంలోని టీడీపీ నాయకులు,ఐటీడీపీ సభ్యులు,కార్యకర్తలు మరియు అభిమానులతో కలిసి "న్యాయానికి సంకెళ్లు" అనే నినాదంతో చేతులకు నల్ల రిబ్బన్లతో సంకెళ్లు వేసుకొని, ఫ్లకార్డులు చేతబూని చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ చంద్రబాబు నాయుడు గారికి మేము సైతం అండగా ఉన్నామని మద్దతుగా నినాదాలు చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో గడివేముల మండల టిడిపి కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డి గడివేముల గ్రామ టిడిపి నాయకులు శ్రీనివాసరెడ్డి, రమణారెడ్డి,నాగిరెడ్డి, ముస్లిం నాయకులు షాలుబాషా,


ఎస్సీ నాయకులు చిట్టిబాబు, దానం,బిలకలగూడూరు గ్రామంలో ముస్లిం మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి ఫరూక్,బూజునూరు గ్రామంలో రామచంద్రారెడ్డి, దుర్వేసి గ్రామంలో కృష్ణ యాదవ్, కే.బొల్లవరం గ్రామంలో సోషల్ మీడియా ప్రతినిధి సుభద్రమ్మ,పెసర వాయి గ్రామంలో ఒడ్డు లక్ష్మీదేవి, చిందుకూరు గ్రామంలో అనసూయమ్మ, మంచాలకట్ట గ్రామంలో శ్రీనివాసరెడ్డి, ఉందుట్ల గ్రామంలో గంగాధర్ రెడ్డి, కరిమద్దెల గ్రామంలో ఈశ్వర్ రెడ్డి,తిరుపాడు గ్రామంలో గిరిబాబు, ఐటీడీపీ సభ్యులు రాజు, బాబునాయక్ గ్రామాలలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పరిశీలనకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయండి....

జిల్లా కలెక్టర్  డా.మనజిర్ జిలాని సమూన్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాలో 16-10-23(సోమవారం) నుండి ప్రారంభమయ్యే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ప్రథమ స్థాయి పరిశీలన(ఎఫ్ఎల్సి)కు సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని నంద్యాలజిల్లా కలెక్టర్  డా.మనజిర్ జిలాని సమూన్ డిఆర్ఓ పుల్లయ్య,ఆర్డీవో శ్రీనివాసులును ఆదేశించారు.టేక్కె మార్కెట్ యార్డు గోడౌన్లో భద్రపరచిన ఈవీఎంలను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డితో కలిసి కలెక్టర్ పరిశీలించారు.ఈసందర్భంగా జిల్లాకలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు 16 -10-23 నుండి 10-11-23 వ తేదీ వరకు ఉదయం 09:00 గంటల నుండి సాయంత్రం 07:00 గంటల వరకు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి సూపర్వైజర్ ఆధ్వర్యంలో ఓటింగ్ యంత్రాల పరిశీలన జరుగుతుందని, రాజకీయ పార్టీ ప్రతినిధులకు జారీచేసిన గుర్తింపు కార్డుదారులను మాత్రమే లోపలికి అనుమతిస్తామని,రాజకీయ పార్టీల ప్రతినిధులు కూర్చునేందుకు వీలుగా కౌంటర్లలో కుర్చీలు ఏర్పాటు చేయాలని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ప్రథమ స్థాయి పరిశీలనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని,ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్లో పరిశీలనకు అవసరమైన టేబుళ్లు, కుర్చీలు, టివి, లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలని,ఫ్లెక్సీ బ్యానర్ ఏర్పాటు చేయడంతో పాటు బెల్ ఇంజనీర్లకు అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇతర స్టేషనరీ సామాగ్రి  కొరత లేకుండా చూసుకోవాలని డిఆర్ఓ పుల్లయ్యను ఆదేశించారు.


అనంతరం బిల్డింగ్ చుట్టు బారికేడింగ్ ఏర్పాటు చేసుకోవాలని, గుర్తింపు కార్డులు మంజూరు చేసిన వ్యక్తులనే లోపలికి అనుమతించాలని, పరిశీలన గది వెలుపలి ప్రాంతంలో సెల్ ఫోన్ లు, డిపాజిట్ చేసేందుకు కౌంటర్ ను ఏర్పాటు చేయాలని, మెటల్ డిటెక్టిర్ ను ఏర్పాటు చేసి ప్రతి వ్యక్తిని తనిఖీ చేసిన అనంతరం లోపలికి అనుమతించేలా చర్యలు తీసుకోవాలని డిఎస్పి మహేశ్వరరెడ్డిని ఆదేశించారు. వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటింగ్ యంత్రాల పరిశీలన పర్యవేక్షించేందుకు సిసి నిఘా కెమెరాలను ఏర్పాటు చేయాలని డిఎస్పి మహేశ్వరరెడ్డిని ఆదేశించారు. అనంతరం 
డిఆర్వో పుల్లయ్య మాట్లాడుతూ 12 మంది బెల్ ఇంజనీర్లు, 50 మంది మున్సిపల్ సచివాలయ సిబ్బంది, 40 మంది రెవెన్యూ సిబ్బందిని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ప్రథమ స్థాయి పరిశీలన(ఎఫ్ఎల్సి)కు వినియోగిస్తున్నమని, వైయస్సార్ సిపి పార్టీ అనిల్, అమృతరాజు, సిపిఎం ప్రతినిధి పూల నరసింహులు, సిపిఐ రంగనాయుడు, కాంగ్రెస్ పార్టీ సయ్యద్ రియాజ్, తెలుగుదేశం పార్టీ శివరామిరెడ్డి, నంద్యాల తాసిల్దార్ శ్రీనివాసులు పాల్గొన్నారు.


మార్క్ ఫెడ్  సంస్థ ద్వారా మొక్కజొన్నలు కొనుగోలు చేయాలి....... 

అఖిలభారత కిసాన్ మహాసభ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్.

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా స్థానిక నంద్యాల పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్నిచ్చేలా అందుబాటులోకి తీసుకు రానున్న టూరిస్ట్ రెస్టారెంట్, పార్క్ పనులను ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి పరిశీలించారు. నంద్యాల పట్టణంలోని చిన్న చెరువు కట్టపై టూరిస్ట్ రెస్టారెంట్ వద్ద గ్రీన్ కో ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సంభందిత అధికారులను అడిగి తెలుసుకొని, త్వరలో పనులను పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి  మాట్లాడుతూ నంద్యాల పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా జరుగుతున్న టూరిస్ట్ రెస్టారెంట్,పార్క్ అభివృద్ధి పనులను త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని గ్రీన్ కో ప్రతినిధులకు సూచించారు.రెస్టారెంట్ బిల్డింగ్ పునర్నిర్మాణ పనులు,చిన్నపిల్లల ఆట వస్తువులకు సంబంధించిన పరికరాలు, జిమ్, ల్యాండ్ స్కేపింగ్, వాకింగ్ ట్రాక్, చెరువు చుట్టూ ప్రమాద నివారణ నిమిత్తం ఏర్పాటు చేసే సేఫ్టీ ఫెన్సింగ్,ఫుడ్ కౌంటర్ తదితర పనులను పురోగతిని పరిశీలించి, త్వరితగతిన పూర్తి చేసి నంద్యాలపట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, పనులను వేగవంతంగా నాణ్యతతో పూర్తి చేయాలని, చెరువులో బోటింగ్ చేసేందుకు వీలుగా అందుబాటులో ఉంచిన మోటార్ బోట్లు, ఫెడల్ బోట్లను పరిశీలించి, నంద్యాల పట్టణ ప్రజల ఆహ్లాదకర వాతావరణానికి మానసికల్లాసానికి ఈ ఎకో టూరిజం పార్క్ దోహద పడుతుందని తెలిపారు.

 నంద్యాల టూరిస్ట్ రెస్టారెంట్,పార్క్ అభివృద్ధి పనులను పరిశీలించిన...

ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా స్థానిక నంద్యాల పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్నిచ్చేలా అందుబాటులోకి తీసుకు రానున్న టూరిస్ట్ రెస్టారెంట్, పార్క్ పనులను ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి పరిశీలించారు. నంద్యాల పట్టణంలోని చిన్న చెరువు కట్టపై టూరిస్ట్ రెస్టారెంట్ వద్ద గ్రీన్ కో ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సంభందిత అధికారులను అడిగి తెలుసుకొని, త్వరలో పనులను పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి  మాట్లాడుతూ నంద్యాల పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా జరుగుతున్న టూరిస్ట్ రెస్టారెంట్,పార్క్ అభివృద్ధి పనులను త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని గ్రీన్ కో ప్రతినిధులకు సూచించారు. రెస్టారెంట్ బిల్డింగ్ పునర్నిర్మాణ పనులు,


చిన్నపిల్లల ఆట వస్తువులకు సంబంధించిన పరికరాలు, జిమ్, ల్యాండ్ స్కేపింగ్, వాకింగ్ ట్రాక్, చెరువు చుట్టూ ప్రమాద నివారణ నిమిత్తం ఏర్పాటు చేసే సేఫ్టీ ఫెన్సింగ్, ఫుడ్ కౌంటర్ తదితర పనులను పురోగతిని పరిశీలించి, త్వరితగతిన పూర్తి చేసి నంద్యాల పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, పనులను వేగవంతంగా నాణ్యతతో పూర్తి చేయాలని, చెరువులో బోటింగ్ చేసేందుకు వీలుగా అందుబాటులో ఉంచిన మోటార్ బోట్లు, ఫెడల్ బోట్లను పరిశీలించి, నంద్యాల పట్టణ ప్రజల ఆహ్లాదకర వాతావరణానికి మానసికల్లాసానికి ఈ ఎకో టూరిజం పార్క్ దోహద పడుతుందని తెలిపారు.

 రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకుని అరెస్టు చేస్తారా.... 

టిడిపి రాష్ట్ర ముస్లిం మైనార్టీ అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్

(జానో జాగోగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలంలోని గడివేముల స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన ముస్లిం మైనారిటీ సమావేశం గడివేముల మండలం టిడిపి కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి రాష్ట్ర ముస్లిం మైనారిటీ అధ్యక్షులు మౌలానా ముస్తాక్ మహమ్మద్ గడివేముల మండలంలోని ముస్లిం మైనార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గడివేముల మండలం టిడిపి కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ఎటువంటి ఆధారాలు లేకుండా 34 రోజుల నుండి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని రుజువులు చూపించకుండా అక్రమంగా,అన్యాయంగా కేసులు పెట్టి,మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం రాష్ట్ర టిడిపి మైనార్టీ అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహమ్మద్ మాట్లాడుతూ


ప్రజాక్షేత్రం నుంచి చంద్రబాబు నాయుడుని దూరం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని,తక్షణమే ప్రజా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిపై అక్రమ కేసులు బనాయించి 34 రోజులుగా జైలుకే పరిమితం చేసిన జగన్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలు నందు కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా ఇబ్బందులకు గురి చేయడం సబబు కాదని, చంద్రబాబుని  ఆరోగ్యపరంగా దెబ్బకొట్టి ప్రజా క్షేత్రంలో రానివ్వకుండా టిడిపి పార్టీని దెబ్బ కొట్టేందుకు జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని,వైసీపీ నాయకులు చంద్రబాబుకు జైలులో విలాసాలు కావాలా అంటూ చంద్రబాబుపై సోషల్ మీడియాలో అవహేళనగా పోస్టులు పెడుతున్నారని, 40 ఏళ్లకు పైగా రాజకీయ జీవితం14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిని ఇలాంటి రుజువు లేకుండా అన్యాయంగా అరెస్టు చేయడమే కాకుండా,ఇబ్బందులకు గురి చేస్తున్నారని, చంద్రబాబు నెల రోజుల్లో ఐదు కేజీలు బరువు తగ్గడం ఆందోళన కలిగిస్తోందని,ఆయన ఆరోగ్యం క్షీణిస్తే బాధ్యలు ఎవరిని,చంద్రబాబు గారికి టెస్టులు చేసిన డాక్టర్లు కాకుండా జైలు సూపరింటెండెంట్ హెల్త్ రిపోర్ట్,నివేదిక ఇవ్వడానికి సూపరింటెండెంట్ ఎవరని, సంతకం పెట్టడానికి సూపరిండెంట్ కు అథారిటి ఎవరిచ్చారని,

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేసే అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉందని,చంద్రబాబుకు ఇచ్చిన మందులను చంద్రబాబు గారి పర్సనల్ డాక్టర్లకు ఎందుకు చూపించడంలేదని, చంద్రబాబుగారి ఆరోగ్యం పై పబ్లిక్ లో ఎమోషన్స్ రాకుండా జగన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని, చంద్రబాబుని తక్షణమే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించి, కోలుకునే వరకు ఆసుపత్రిలో వైద్య నిపుణుల బృందంతో నిత్యం పర్యవేక్షణ లో ఉంచాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గడివేముల మండలం టిడిపి కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి ఫరూక్, గడివేముల మండలం టిడిపి సీనియర్ నాయకుడు సీతారామిరెడ్డి, టిడిపి నాయకులు బూజునూరు రామచంద్రారెడ్డి, గడివేముల మండలం ముస్లిం మైనార్టీ నాయకులు ముస్తాక్ అహ్మద్, ఫరూక్, వలి, షఫీ ఉల్లా, నజీర్ వలి, తపాల బషీర్, గడివేముల మండలం ముస్లిం మైనార్టీ సోదరులు పాల్గొన్నారు.

 హనీఫ్ అలీ మనమధ్య లేకపోవడం బాధాకరం

షేక్. ఖలీఫా తుల్లా బాషా

(జానో జాగోగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ కౌన్సిల్ సభ్యులు బీజేపీ మైనారిటీ మోర్చా జాతీయ నాయకులు హనీఫ్ అలీ మనమధ్య లేకపోవడం  చాలా బాధాకరం అని మంచి సోదరుడిని కోల్పోయమని  హ్యూమన్ రైట్స్  కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ & బీజేపీ  మైనారిటీ మోర్చా ఫార్మర్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు షేక్. ఖలీఫా తుల్లా బాషా విచారం వ్యక్తపరిచారు. హైదరాబాద్ లోని ఆయన నివాసముకు వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామశించారు. కుటుంబసభ్యులను  ఓదార్చి ఆయన లోటు ఎవ్వరు తీర్చలేనది అని అయితే మీకు నావంతూ సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని ధైర్యం ఇచ్చారు.

దివంగత హనీఫ్ అలీ

బీజేపీ పార్టీ  మైనారిటీ వర్గాలల్లో బలపడటానికి ఆయన చేసిన కృషి మరువలేనిది అన్నారు. షేక్. ఖలీఫాతుల్లా బాషా వెంటా బీజేపీ మైనారిటీ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి మహమ్మద్  గజనీ , హైదరాబాద్ సిటీ బీజేపీ మైనారిటీ మోర్చా అధికార ప్రతినిధి  బేగం, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ అలుగునురి విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.


 నకిలీ సర్టిఫికెట్ల సూత్రదారి నవభారత్ స్కూల్ యజమాని ఉసెన్,,,

ఆయన పేరుతోనున్న అన్ని స్కూల్స్ గుర్తింపు రద్దు చేసి,సీజ్ చేయాలి.....

ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి ధనుంజయుడు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా స్థానిక నంద్యాలలో10 మరియు ఇంటర్ నకిలీ సర్టిఫికెట్లు సృష్టించడంలో కీలక పాత్ర  పోసించిన నవభారత్ స్కూల్ యజమాని ఉసెన్ దాదాపుగా 800 మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాటాడని, బాధిత విద్యార్థులు  పోలీస్ స్టేషన్ చేరిన నకిలీ సర్టిఫికెట్ల  విద్యార్థుల పంచాయతీ విషయం బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారని, నకిలీ సర్టిఫికెట్లు సృష్టించిన వారిని కఠినంగా శిక్షించేంతవరకు పోరాటాలు కొనసాగిస్తామని ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి ధనుంజయ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి ధనుంజయుడు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో నవభారత్ స్కూల్ నిర్వహిస్తున్న కరస్పాండెంట్ హుస్సేన్ ఓపెన్ స్కూల్,ఓపెన్ ఇంటర్ పేరుతో విద్యార్థులను మోసం చేయడమే కాకుండా, ఇప్పుడు కొత్త మోసానికి తెరలేపి ప్రభుత్వ అనుమతులు లేనటువంటి ఓరియంటల్ వోకేషనల్ స్కూల్ బోర్డ్ పేరుతో టెన్త్, ఇంటర్ నకిలీ సర్టిఫికెట్లను సృష్టించడం జరిగిందని,ఈ సర్టిఫికెట్ల సృష్టించడం కోసం ఒక్కొక్క విద్యార్థి నుండి దాదాపుగా 20 వేల వరకు వసూలు చేశారని,


నవభారత్ స్కూల్ హుస్సేన్ తో పాటు మాస్టర్ ఓపెన్ స్కూల్ ఏర్పాటు చేసినటువంటి మున్వర్ హుస్సేన్ అనే వ్యక్తి కూడా ఇందులో భాగస్వామిగా ఉన్నారనేఆరోపణలు వస్తున్నాయని,నంద్యాల పట్టణంలో నవభారత్ స్కూల్ హుస్సేన్, మునువార్ హుస్సేన్లపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత విద్యార్థుల ఫిర్యాదులు బయటికి రాకుండా రహస్యంగా పోలీసులు ఉంచారని, నవ భారత్ ఓపెన్ స్కూల్, ఓపెన్ ఇంటర్ నకిలీ సర్టిఫికెట్లు తీసుకున్న విద్యార్థులు కళాశాలలో, డిగ్రీ ప్రవేశం కోసం వెళ్లిన నేపథ్యంలో నవభారత్ హుస్సేన్,మున్వర్ హుస్సేన్ లు సృష్టించిన నకిలీ సర్టిఫికెట్లను అడ్మిషన్ కోసం అందజేసిన సమయంలో ఆ సర్టిఫికెట్లను వెరిఫై చేసినటువంటి రాయలసీమ యూనివర్సిటీ అధికారులు హైయర్ ఎడ్యుకేషన్ కు పంపించడం జరిగిందని, హయ్యర్ ఎడ్యుకేషన్ అధికారులు పరిశీలించి ఇవి నకిలీ సర్టిఫికెట్లని తేల్చిన తర్వాత రాయలసీమ యూనివర్సిటీ అధికారులు వాటిని గుర్తించి ఈ నకిలీ సర్టిఫికెట్ల ద్వారా విద్యార్థులు మోసపోయారని ఓరియంటల్ వోకేషనల్  స్కూల్ బోర్డుకు ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేవని పత్రికా ప్రకటన ద్వారా అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని,

ఈ నకిలీ సర్టిఫికెట్ల ద్వారా మోసపోయినటువంటి కొంతమంది విద్యార్థులు నేరుగా నంద్యాల పట్టణంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా యాజమాన్యం వారికి నచ్చజెప్పి పోలీసుల దగ్గరుండి ఆ సమస్యను సర్దుమనియేటట్లు చేయడం జరిగిందని,నకిలీ సర్టిఫికెట్లు సృష్టించిన వారి పైన ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోకపోవడం ఎంతవరకు సమంజసమని,నంద్యాల పట్టణంలో దాదాపుగా నవభారత్ హుస్సేన్, మునవర్ హుస్సేన్ లతోపాటు ఇంకా కొంతమంది సహకారంతోనే  నకిలీ సర్టిఫికెట్లు మోసానికి దాదాపుగా 800 మంది విద్యార్థులు మోసపోయారని, మోసపోయిన విద్యార్థుల పక్షాన వారికి న్యాయం జరిగేంత వరకు పోరాటాలు కొనసాగిస్తామని ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి ధనుంజయుడు తెలుపుతూ బాధిత విద్యార్థులు ఎవరైనా సెల్:9160164862,9121660517 నెంబర్ లకు సమాచారం అందిస్తే ఖచ్చితంగా వారికి న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తామని విజ్ఞప్తి చేశారు.