కౌలూరు గ్రామంలో....మట్టి మిద్దె కూలి ఒకరు మృతి...మరోకరి పరిస్థితి విషమం

 కౌలూరు గ్రామంలో....

మట్టి మిద్దె కూలి ఒకరు మృతి...మరోకరి పరిస్థితి విషమం

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని కౌలూరు గ్రామంలో  నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో రెవెన్యూ అధికారులు సమీపంలోని గ్రామాలలోని ప్రజలను అప్రమత్తం చేయాల్సి ఉండగ ఏలాంటి చర్యలు పాణ్యం మండలంలో తీసుకున్న దాఖలాలు లేవని, ఎక్కువ రోజులు వర్షాలు పడితే పాతకాలం నాటి మట్టి మిద్దెలు కూలుతాయని తెలిసిన గ్రామంలో రెవెన్యూఅధికారులు దండోరా ద్వారా ప్రజలకు తెలియజేయాల్సి ఉందని, గ్రామాలలోని ప్రజలను దండోరా ద్వారా అప్రమత్తం చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, అందువల్లనే పాణ్యం మండలంలోని కౌలూరు గ్రామంలో మట్టిమిద్దె కూలి నాగమ్మ (85)మృతి చెందగా, తీవ్ర గాయాలు అయిన శివనాగమ్మ (75) పరిస్థితి విషమంగా ఉండగా మెరుగైనచికిత్స నిమిత్తం శివనాగమ్మను శాంతిరాం ఆసుపత్రికి తరలించారని, ప్రజలను అప్రమత్తం చేయడంలో అధికారులు విఫలం చెందారని,


మృతి చెందిన కుటుంబానికి 10 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యమే ఈ సంఘటనకు కారణమని గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభుత్వం ఒకపక్క ప్రజలను అప్రమత్తం చేయాలని చెబుతున్నా, ప్రభుత్వ ఆదేశాలను రెవెన్యూ అధికారులు పాటించకపోవడం చాలా దురదృష్టకరమని ఇందుకు కారణమైన రెవెన్యూ అధికారులపై జిల్లా కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: