ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో....
హెల్త్ కార్డులు పంపిణీ చేసిన... కౌన్సిలర్ నాగిని రవి సింగారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లాలోని స్థానిక నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 36 వ వార్డులో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా 72 మంది కి హెల్త్ కార్డులను కౌన్సిలర్ నాగిని రవి సింగారెడ్డి పంపిణీ చేశారు. ఈసందర్భంగా 36 వ వార్డు కౌన్సిలర్ నాగిని రవి సింగారెడ్డి మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు వల్ల పేదవారు ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం ఈకార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా రాష్ట్రంలో మాత్రమే ఆరోగ్యశ్రీ ద్వారా చేయించుకోవడానికి వీలు అవుతుందని,కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ హెల్త్ కార్డును దేశంలో ఉన్న నిర్ధేశిత జాబితాలో
ఉన్న ఆసుపత్రులలో పైసా ఖర్చు లేకుండా ఎక్కడైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చూపించుకోవడానికి వీలుగా ఉంటుందని వివరిస్తూ ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం ద్వారా 36 వ వార్డులో ఆర్థికంగా నిరుపేదలైన 72 మందికి హెల్త్ కార్డులను పంపిణీ చేసి అర్హులైన ప్రతి ఒక్కరు నిర్ధేశిత హాస్పిటల్స్ నందు ఈ కార్డును ఉపయోగించుకోవచ్చని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మంది పేదవారికి నాణ్యమైన ఆరోగ్యసేవలందిస్తున్నారని,కేంద్ర ప్రభుత్వం కూడా దేశంలో ఎక్కడైనా నిర్ధేశిత జాబితాలో ఉన్న హాస్పిటల్ నందు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఇస్తున్న కార్డును ఉపయోగించుకోవచ్చునని తెలిపారు.ఈకార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వాలంటరీలు మరియు ప్రజలు పాల్గొన్నారు.
ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో....
హెల్త్ కార్డులు పంపిణీ చేసిన... కౌన్సిలర్ నాగిని రవి సింగారెడ్డి
Post A Comment:
0 comments: