లంచము తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ.... 

జలకనూరు వీఆర్వో వెంకట రమణారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం మిడుతూరు మండల పరిధిలోని జలకనూరు గ్రామానికి చెందిన వెంకట రమణయ్య తన ముగ్గురు పిల్లలు కూతుర్ల పేరిట తన భూమిని దాన విక్రయముగా రిజిస్టరు చేయించాడు. భూమిని తన   పేరును తొలగించి కూతుర్ల పేర్లపై ఆన్లైన్ నందు మార్పుచేసి పాసుబుక్కులు ఇవ్వడానికి  విఆర్ఓ వెంకట రమణారెడ్డి, వెంకట రమణయ్య వద్ద నుండి 10,000/- రూపాయలు లంచము ఇస్తే పని చేస్తానని చెప్పడంతో వెంకట రమణయ్య ముందుగా 3,000/- రూపాయలు ఇవ్వగా


వెంకట రమణారెడ్డి తీసుకుని మిగిలిన 7,000/- రూపాయలను మిడుతూరు గ్రామంలోని తన ప్రైవేటు కార్యాలయము నందు తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు వల పన్ని జలకనూరు వీఆర్వో వెంకట రమణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన, చట్టబద్దమైన పనిని చేయడానికి ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచము ఆశిస్తే ముందుగా 14400 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి గాని,మొబైల్ యాప్ ద్వారాగాని 14400 నెంబర్ కు సమాచారమును అందించిన, లంచగొండి అధికారులపై చట్ట పరమైన చర్యలు తీసుకోబడతాయని, కర్నూలు ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి తెలిపారు. ఈ ఏసీబీ దాడులలో ఏసీబీ ఇన్స్పెక్టర్ తేజేశ్వర్ రావు, వెంకట కృష్ణారెడ్డి, ఇంతియాజ్ అహ్మద్, కృష్ణయ్య, వంశినాథ్ మరియు సిబ్బంది పాల్గొన్నారని కర్నూలు ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: